Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగు సాహిత్యానికి అక్షరమాల కొప్పుల కవిత్వం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

తెలుగు సాహిత్యానికి అక్షరమాల కొప్పుల కవిత్వం

''అక్షరమే నా సాంస్కతి
నా ఆలోచనలే కవితా కుసుమాలు...
నిత్య నైవేద్యముగా తెలుగు తల్లికి ప్రతి నిత్యం అక్షరాభిషేకం ....'' తెలుగు భాష పట్ల ఎంతటి మమకారమో కదా! కొప్పుల వారికి.

నేడు తెలుగు భాషలో వాడుకలో ఉన్న అక్షరాలు 56. అందుకేనేమో ఈ కవితా సంపుటి 56 కవితలతో ముస్తాబైయింది.
''నేనొక అక్షర పిపాసిని
నిరంతర అక్షర తపస్వినీ
అక్షర యజ్ఞంలో ఇంధనమై నేను
జీవం ఉన్నంతవరకూ వెలుగుతుంటాను ..''
ఇది కదా! నేను కవిని. కవిత్వమే నా శ్వాస అని సగర్వంగా చాటుకునే విధానం.
తాను కరిగిపోతూ, సాహిత్య వనంలో చిరు దివ్యగా వెలిగిపోవాలనే వీరి తష్ణ శ్లాఘనీయం.
కవిత్వానికి (సాహిత్యానికి) సామాజిక ప్రయోజనం ఉండాలని, అభ్యుదయానికి, వికాసానికి దారి తీయాలని, కవులు, రచయితలు, కళాకారులు ఇందుకు శ్రమించాలని, వారికి ఆ అదనపు సామాజిక బాధ్యత ఉందని, ఎంతో కాలంగా విమర్శకులు గొంతు చించుకుని చెపుతున్న మాటలు.
ఆ మాటలను తన రచనల్లో సరి కొత్తగా ఆవిష్కరించారు కొప్పుల ప్రసాద్‌.
హదయాన్ని హత్తుకునేలా శీర్షిక, అంతే అందంగా ముస్తాబైన ముఖ చిత్రంతో కొప్పుల వారి మస్తిష్క మధనమే ఈ ''చిరుగాలి పలకరిస్తే'' కవితాసంపుటి.
''చిరుగాలి పలకరిస్తే ..'' కవితలు హదయాన్ని తాకి ఉల్లాసాన్ని కలుగ చేస్తాయి. ప్రకతిలో విహరించిన అనుభూతిని కలిగిస్తాయి. కవి సమాజంలోని అన్ని కోణాలలోనూ సజించాడు. కొన్ని కవితల్లో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, ప్రకతి కవిత్వం మనకు దర్శనమిస్తుంది..
సంపుటిలోని మొదటి కవిత ''అక్షర పరిమళాలు'' ... ''నా అక్షరాలకు ఊహల్లో రెక్కలు వచ్చి సాహిత్య వీధుల్లో విహరిస్తున్నాయి..'' అంటూ సంపుటి మొదటి కవితలను ప్రారంభించారు కొప్పుల. సాహిత్యంలో శాశ్వత కీర్తి పొందాలని వారు అక్షరాలను ఎంత చక్కగా చెక్కుకున్నది, తెలుగు భాష పట్ల వారికున్న మక్కువ, తపన ఇక్కడ నుంచే మనకు అర్థమవుతుంది.
కొప్పుల ప్రసాద్‌ మాటల్లో... ''మనసులో పలికే భావోద్వేగాలను అక్షర రూపంలోకి అందించాలనే తాపత్రయంతో మొదట్లో చిన్న చిన్న ప్రాస కవితలను రాసుకునేవాణ్ణి. పేదరికం నేర్పిన అనుభవాల్లోంచి పుట్టిన అక్షర రూపాలే నా కవితా కుసుమాలు. ఆవేశంలోనూ ఆనందంలోనూ పుట్టిన భావాలు. చూసినవి, చదివినవి, విన్నవి, మనస్సులో సంఘర్షణ పడి అక్షర రూపంలో వెలుగు చూసినవి నా కవితలు. ప్రతి విషయాన్నీ కవితల్లో స్పందిస్తూ నిత్య ప్రయాణం కొనసాగిస్తున్నా. ఈ ప్రయాణంలో సాహితీ జగత్తులో మరపురాని జ్ఞాపకమై నిలవాలని ఆశతో... రాస్తుంటాను'' అంటారు.
తెలుగు సాహిత్యానికి సేవ చేసుకోవాలనే తపన వీరి కవిత్వంలో కనిపిస్తుంది. తెలుగు భాషాభివద్ధికి నేటి కవులు ఎంతగానో కషి చేస్తున్నారు. అందుకు నిదర్శనమే నేడు వెలువడు తున్న అనేక ప్రక్రియల్లో కవితా సంపుటాలు, సంకలనాలు .
ఒక కవిత పది కాలాలు మన్నన పొందాలి అంటే ఆ కవిత్వంలో సాంస్కతిక అభివద్ధి, నాగరికత, ప్రజా జీవనాన్ని ప్రతిబింబించే భాష , భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యమైనవి.
కొప్పుల ప్రసాద్‌ సమాజం వైపు సంధించిన అక్షర శరాలు ఈ కవితలో చూడవచ్చు.
పథకాల మాయాజాలం
కురుస్తున్నాయి పథకాల జల్లులు
తడుస్తున్నాయి సామాన్యుల జేబులు
పెరుగుతున్నాయి ధరాఘాతం
చిల్లులు విలవిలలాడుతున్నారు
సగటు మనుష్యులు ...
ఓట్ల కోసం వేస్తున్నారు ఎర్రను
అంటించిన గాలం
ఆనందంగా మ్రింగితే అనుభవిస్తారు
బాధలు పథకాల మాయాజాలం
వైకుంఠపాళి ఆట
నిచ్చెన ఎక్కిన పాము నోట్లో చిక్కినట్లే...''
అనే కవిత్వం నేటి రాజకీయ పరిస్థి తులకు దర్పణం. ఉచ్చితాల కోసం ఓటర్‌ వెంపర్లాట. అవకాశంగా తీసుకునే ప్రజా నాయకులు వరాల జల్లు కురిపిస్తారు. ఐదేండ్లు నిరంతరంగా ప్రతి రోజూ ఏదోక విధంగా, ఇచ్చిన ఉచ్చితాలకు పదింతలు గుంజుతూనే ఉంటారు. నిత్యావసరాల సరుకులు నుంచి తల దాచుకునే నివాసాలు వరకు పన్నులు, ట్యాక్స్‌ల రూపంలో ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటారనే విషయాన్ని, ప్రజలు మేల్కోవలసిన ఆవశ్యకతను వివరించిన కవిత్వం ఇది.
''అక్షరాల వెలుగు దివ్వెల పట్టుకొని
లోకమంతా పహరా కాస్తూ
చీకటి శక్తులను అణిచివేసేందుకు
కవిత్వమునే అస్త్రంగా వదులుతున్నాను..''
చిక్కనైన తెలుగు పదాలు కవిత్వం. అన్యాయాలను అక్రమాలను తన కలం ద్వారా పెకిలించాలని, సమాజాన్ని శాంతియుత నందన వనం లా మార్చాలనే భావం.. నిగూఢంగా నింపుకున్న కవిత్వం.
ఇక్కడ శ్రీశ్రీ కవిత్వ చాయలు వినిపిస్తుంటాయి..
''నేను సైతం ప్రపంజాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానూ...'' అనే కవిత మనకు గుర్తుకు రాకమానదు.
కొప్పుల ప్రసాద్‌ స్వతహాగా ఉపాధ్యాయులు కావడం, వారికి భాష పట్ల పట్టు, మమకారం ఉన్నందున ప్రతి కవిత అక్షర సౌరభాలు వెదజల్లుతుంది.
ఇది మాతభాష అధ్యయనం వల్ల కంఠస్థం చేయడం వల్లే సాధ్యమౌతుంది.
కొన్ని అనుభూతులు అకస్మాత్తుగా మనల్ని కదిలిస్తాయి. మరి కొన్ని క్రమంగా మనసులో రూపు దిద్దుకుంటాయి. కానీ, ఈ ఊహలకి నిర్ధిష్టమైన ఆకారం ఉండదు. వీటిని వేరొకరితో పంచుకో వడానికి మాట ఒక్కటే మార్గం. అయితే ఎప్పుడు వాటిని పదాలలో, వాక్యాలలో పెడతామో, అప్పుడు అవి ఒక స్పష్టమైన ఆకతి తెచ్చుకుంటాయి.అందమైన కవిత్వంగా సంతరించుకుంటుంది.
అది తను నిత్యం చూస్తున్న, వింటున్న యదార్థ సంఘటనలను తలచుకుని, సగటు మనిషి కన్నీటిని అర్దం చేసుకుంటూ రాసిన కవిత ఇది..
ఎంతని మధించను .. !!
''కన్నీటి సంద్రంలో జీవన యానం దినదినం ఉపాధి వెతుకులాట కదిలిస్తే హదయం తరుక్కః పోయే వ్యాధలను తోడు చేసుకున్న అభాగ్యులు చూసిన''
మనసుతో రాసిన కవిత ఇదేనేమో అనిపిస్తుంది
''ఎంతని మధించను మదిని
కన్నీటి చుక్కల దాహం కోసం
ఎడారిలో నీటికోసం తిరిగినట్లు
తడి ఆరిన హదయాన్ని
ఎలా నింపగలను ...''
కన్నీరు ఎండిపోయి, జీవం కోల్పో యిన కన్నుల్లోని వ్యధను అర్థం చేసుకో వడం కొప్పుల ప్రసాద్‌కు మాత్రమే సాధ్యం అనిపించే కవిత ఇది.
అలా ఆకతి దాల్చిన కవిత్వమే కొప్పుల ప్రసాద్‌ ''చిరుగాలి పలకరిస్తే'' కవితా సంపుటి.
శ్రీశ్రీ కవిత్వం ఎందరినో ప్రభావితం చేసింది అనేది వాస్తవం. ఆయనలా ఒక్క కవిత అయినా రాయాలి అని ప్రయత్నించే యువ కవులకు కొదవేలేదు.
శ్రీశ్రీ 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం' అనే కవిత్వం కొప్పులను చాలా ప్రభావితం చేసిందేమో అనిపిస్తుంది. మీరు కూడా నా అభిప్రాయం సరైనదే అంటారు ఈ కవిత ఒక్కసారి పరిశీలిస్తే...
చరిత్రలో నూతన అధ్యాయం...!!
యుద్ధాల తారీకులు దస్తావేజుల పుట్టుకలు సామాన్యులకు సమస్యలు చరిత్ర నేర్పిన పాఠాలు ...
కాలానికి నల్లని మరకలు ప్రపంచానికి దొరల పాలన దోపిడీకి పుట్టిన వ్యవస్థలు దొడ్డిదారిన తీర్మానాలు ఎన్నో ...
పేదరికపు అవయవ దానం చరిత్రలో బలి చేసిన మహాదానం అహంకారం జ్వాలలకు ఆరిన చిరు దీపాల బ్రతుకులు ...
రాలి పడిన కన్నీటి చుక్కలు
ఆకలి కేకల దాహములో
మాయాజాలం మార్కెట్లో అమ్మబడిన యవ్వనపు ఛాయలు ..
పేదవాడి జీవనం దుర్భరంగా సాగుతుంటే.
ఉన్నవాడు ధనంతో అవయవాలను కొనుగోలు చేస్తుంటే.ఆకలిని జయించలేని వారు తమ అవయవాలనే అమ్ముకునే పరిస్థితి మన భారతావనిలో..
నిత్యం ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉంది.
దీనికి బాధ్యులు ఎవ్వరు..
ప్రశ్న చిన్నదే..
సమాధానం కోసం చరిత్ర తిరిగేయక తప్పదు.
బిక్కి కష్ణ ముందుమాటలోని ముగింపు తీసుకోక తప్పలేదు. ఆయన మాటల్లో కొప్పుల ప్రసాద్‌ కవితా సష్టి అద్భుతం, నిర్మాణదష్టి అపురూపం. వస్తువైవిధ్యం, శిల్పసోయగంతో వెలువడుతున్న ఈ చిరుగాలి పలకరిస్తే కవితా కదంబం సహదయ పాఠకులను, కవితా ప్రియులను అలరిస్తుందని ఆశిస్తూ ... అభినందనలతో ..
అంటూ దీవించేంతగా కొప్పుల ప్రసాద్‌ కవిత్వం

- రాము కోలా, 9849001201

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.