Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్వ‌ర ర‌స‌వాహిని వాణీ జ‌య‌రాం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 12,2023

స్వ‌ర ర‌స‌వాహిని వాణీ జ‌య‌రాం

            ఆమె ప్రతి పలుకు తేనెలూరించే ఓ రసగుళిక.. ఆ గళం... ప్రతి ఎదను మీటి సుస్వరాల విరిజల్లుల్ని కురిపిస్తుంది.. అమృత గానపు మాధుర్యం అమితానందంతో అంబరాన్ని తాకేలా చేస్తుంది.. తొలి మంచుతెరల చల్లని పలకరింపులా అలసి సొలసిన మృదయాలకు సాంత్వన చేకూర్చుతుంది. ఆ స్వరరస వాహినిలో పులకించని తనువుండదు. తన సుమధుర గాత్రంతో మూడు తరాలను రంజింపజేసిన గాయనీ వాణీ జయరామ్‌. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు ఉండరేమో..? తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రంతో ప్రాణ ప్రతిష్ట చేసిన వాణి తన సంగీత ప్రయాణంలో కొన్ని వేల పాటలు... ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. దొరకునా ఇటువంటి స్వరం అంటూ సంగీత ప్రియులు వేనోళ్ల పొగిడిన ఆ అమృతగళం ఆమెది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా దాదాపు 19 భాషల్లో సుమారు 5 దశాబ్దాల పాటు తేనె కన్నా తియ్యనైన స్వరంతో 20వేలకు పైగా పాటలు పాడారు. ఆమె పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల్లో వాణీ జయరాంకు ''పద్మ భూషణ్‌'' ప్రకటించినప్పటికీ, ఆ అవార్డు అందుకోకుండానే ఆమె తుది శ్వాసవిడిచింది.
వాణీ జయరాం 1945 నవంబర్‌ 30 న తమిళనాడు లోని వెల్లూరులో అయ్యంగార్‌ కుటుంబంలో దురైస్వామి, పద్మా వతి దంపతులకు జన్మించింది. ఈమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ ఐదో సంతానంగా జన్మించింది. చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన వాణీ, తన ఎనిమిదేళ్ల వయసులో తొలిసారిగా వేదికపై ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకుంది. ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు కడలూర్‌ శ్రీనివాస్‌ అయ్యంగారు, టీఆర్‌ బాలసుబ్ర మణియన్‌, ఆర్‌ఎస్‌ మణి వద్ద శిష్యరికం చేసిన వాణీ జయరాం పదేళ్ల వయసులో తొలిసారి మద్రాస్‌ ఆలిండియా రేడియోలో మొదటిసారిగా తన ప్రతిభను చాటుకుంది. ముత్తస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో వాణీ బాగా గుర్తింపు తెచ్చు కుంది. పాటలోని భావాన్ని చక్కగా అర్థం చేసు కున్న తర్వాతే ఆమె ఆలపిస్తారు.. తమిళ నాడు సొంత రాష్ట్రమైనా.. ఆమె కర్నూలు లో పెరిగింది. అందుకే తెలుగుపై పట్టు సాధించింది. తన చదువు పూర్తయిన తర్వాత జయరామ్‌ని వివాహమాడిన వాణీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగంలో చేరింది. మామ కూడా కర్ణాటక గాయకుడే కావడం, తన భర్త జయరామ్‌ ప్రోత్సా హంతో కర్ణాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది. ఉద్యోగ నిమిత్తం బొంబాయి వెళ్ళి, అక్కడ 1969లో తన మొదటి కచేరీని ఇచ్చింది. సంగీత దర్శకుడు వసంత్‌ దేశారు వాణి సంగీత కచేరీలో శ్రావ్యమైన గొంతు విని మరాఠీ ఆల్బమ్‌లో 'రుణానుబంధాచ' అనే పాట పాడించారు. ఇదే వాణీ జయరాం రికార్డ్‌ చేసిన తొలి పాట. ఆ తర్వాత 1971లో 'గుడ్డి' అనే హిందీ చిత్రంలో నేపథ్య గాయనిగా ఆవకాశమి చ్చారు. కాగా ఈ సినిమాలోని 'బోలే రే పపీ హరా' పాటతో వాణీ తన మొదటి పాటకే 'తాన్‌సేన్‌ అవార్డు' తోపాటు మరో నాలుగు అవార్డులు అందు కుంది. దీంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి.
'గుడ్డి' హిందీ చిత్రంతో గాయనిగా సినీరంగ ప్రవేశం
1971లో మొదటిసారిగా 'గుడ్డి' చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వాణీజయరాం, అక్కడి నుంచి ఎదురు లేకుండా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. హిందీలో ''మీరా, జానీ మేరా నామ్‌, ఆయినా, ఖూన్‌ కా బద్లా ఖూన్‌, వఫాదార్‌'' వంటి హిందీ సినిమాల్లో వాణీ జయ రాం పాడిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి.
'అభిమానవంతులు' చిత్రంతో తెలుగు తెరకు...
బొంబాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాణీ జయరాం మలయాళం చిత్రం 'స్వప్నం' కోసం తన తొలి పాట పాడింది. ఆ తర్వాత 'తాయుంసేయుమ్‌' అనే తమిళ సినిమా కోసం పాడింది. 'స్వప్నం' పాటలు విశేషాదరణ పొందాయి. వాణీ గాత్ర మాధుర్యాన్ని గుర్తించిన దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి 1973లో తెరకెక్కించిన 'అభిమాన వంతులు' చిత్రంతో తెలుగు సినిమాకు ఆమెని పరిచయం చేశాడు. ఈ చిత్రంలో ''ఎప్పటి వలె కాదురా నా స్వామి'' పాటతో తన ప్రస్థానాన్ని ప్రారంభిం చింది. ఆ తర్వాత 1975లో విడు దలైన 'పూజ' సినిమా వాణీ జయరాంకు పాపు లారిటీ తీసుకొ చ్చింది.
ఈ చిత్రం లోని ''పూజలు చేయా.., ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ'' పెద్ద హిట్‌ అయ్యాయి. కె. విశ్వనాథ్‌ క్లాసిక్‌ చిత్రం 'శంకరాభరణం' సినిమాలో ''దొరకునా ఇటువంటి సేవా.., ఏ తీరుగ నను దయ చూచెదవో.., పలుకే బంగారమాయెనా.., మానస సంచరరె.., బ్రోచేవారెవరురా'' ఇలా ఆమె పాడిన 5 పాటలు ఎవర్‌ గ్రీన్‌ హిట్‌. ఇప్పటికీ అందరినీ ఆ పాటలు అలరిస్తూనే ఉన్నాయి. అదే విశ్వనాధ్‌ దర్శకత్వంలో వచ్చిన స్వాతికిరణంలో మొత్తం 11 పాటలూ వాణిజయరాం పాడారు. ఆ పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోతాయి. ''తెలి మంచు కరిగింది అంటూ పాడినా.., ప్రణతి ప్రణతి ప్రణతి.. అంటూ ప్రార్ధించినా.. కొండాకోనల్లో లోయల్లో'' అంటూ హుషారెక్కించినా అది ఒక్క వాణీ జయరాంకు మాత్రమే చెల్లింది. ముఖ్యం గా సంగీత ప్రధానమైన మెలోడీలలో ఆమె స్వరం ఒక్క సారి వింటే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు తన స్వంత చిత్రాలలో వాణీ జయరాంతో ఏదో ఒక పాట పాడించేవాడు. ''మరో చరిత్ర, పూజ, ఆరాధన, అంతులేని కథ, ఇది కథ కాదు, సీతాకోకచిలుక, సీతామాలక్ష్మి, మంగమ్మ గారి మనవడు, సంకీర్తన, ఘర్షణ, గుప్పెడు మనసు, పెళ్లి పుస్తకం, సీతా కళ్యాణం, శ్రుతిలయలు, స్వర్ణకమలం, ప్రేమాలయం'' వంటి చిత్రాల్లోని ఎన్నెన్నో మరపురాని పాటలు ఆమె గాన మధురిమను పంచాయి. క్లాస్‌ నుంచి క్లాసికల్‌ సాంగ్స్‌ వరకూ, జానపదం నుంచి జాజ్‌ బీట్స్‌ వరకూ అన్ని పాటలు పాడింది. హాయిగా పాడేడమే ఆమె స్పెషాలిటీ. తన కెరీర్‌లో తెలుగు పాట ఎంతో ప్రత్యేకమని చెప్పుకునే వాణీ జయరాం ''తేలి మంచు కరిగింది, నువ్వడిగింది ఏనాడైన కాద న్నానా' అంటూ 'వయసు పిలిచింది' సినిమాలో వాణి జయరాం అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపింది. మణిరత్నం 'ఘర్షణ' సినిమాలో 'ఒక బృందా వనం... సోయగం, కురిసేను విరిజల్లులే', రోజాలో 'లేత వన్నెలే' అంటూ మెలోడీతో మైమరిపించినా.. శ్రీ గణనాధం అంటూ శ్రుతిలయలతో అధ్యాత్మికాన్ని పంచినా ఆమె స్వరరాగ మాధుర్యం మన తెలుగు సినిమాకు దక్కిన అదృష్టం. ఎప్పటికీ మరచిపోలేని పాటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఆమె.. పాడిన ప్రతి పాటా ఒక అద్భుతమే. తెలుగు చిత్రసీమలో టాప్‌ గాయనీమణులుగా చెప్పుకునే ఎస్‌.జానకి, సుశీల వంటి వారికి ఏమాత్రం తీసిపోని గానకోకిల ఆమె. వాస్తవానికి ఆమె పాటలు వింటున్నపుడు మనం కచ్చితంగా ఆ పాటల్లోకి దూరిపోతాం. ఆ స్వర మాధు ర్యానికి పరవశించి పోతూనే ఉంటాం.
వైవిధ్యభరితం ఆమె గాత్రం
ఏ తరహా పాటనైనా పాడగల సత్తా గల గాయనిగా సంగీత దర్శకుల మెప్పుపొందారు వాణీ జయరాం. తెలుగులో ఇళయ రాజా, కేవీ మహదేవన్‌ సంగీత దర్శకత్వం వహించిన పాటలు వాణీ ఆమెకు బాగా పేరు తీసుకొచ్చాయి. ఎంతటి క్లిష్టమైన పాటలైనా ఆమె శ్రోత లను ఆకట్టుకునేలా పాడేవారు. కర్నాటక, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాల్లో శిక్షణ పొందడం, సంప్రదాయ సంగీతంలో అవగాహన ఉండటం వాణీ జయరాంకు ఎలాంటి పాటనైనా పాడే నేర్పు అందిం చింది. ''ఒక బృందావనం సోయగం అంటూ పాడినా..., బ్రోచేవారెవరురా అని గొంతెత్తినా, అందెల రవమిది, పలుకే.. బంగారమాయెనా, మిన్నేటి సూరిడు వచ్చెనమ్మా, శ్రీ సూర్య నారాయణా మేలుకో'' అని ఆమె ఆలపించినా మధుర గీతాలు మంచి పేరు తెచ్చి పెట్టి, సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసాయి. వీటితో పాటు వాణీ జైరామ్‌ పండిట్‌ బ్రిజు మహారాజ్‌తో ''హోలీ పాటలు'', ''తుమ్రీ దాద్రా భజన్స్‌'' రికార్డ్‌ చేసింది. ఆమె ఒడిస్సీ గురువు కేలుచరణ్‌ మోహోపాత్ర పఖావాజ్‌ వాయించడంతో ప్రఫుల్లకర్‌ స్వరపరిచిన ''గీత గోవిందం'', జైరామ్‌ సంగీతం అందించిన ఆమె రాసిన పాటలతో ''మురుగన్‌ సాంగ్స్‌''ని కూడా విడుదల చేసింది. వాణీ పాటలతో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ అయితే వేలాదిగా వచ్చాయి. ఇలా, వేలాది వైవిధ్యమైన పాటలు పాడటం ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనంగా నిలిచాయి.
హైదరాబాద్‌తో అనుబంధం
మద్రాస్‌ క్వీన్స్‌ మేరీ కాలేజ్‌ నుంచి పట్టభద్రురాలైన వాణీ జయరాం కొన్నేళ్లు మద్రాస్‌ ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత, బదిలీ మీద మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి కోఠీ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కొన్నేళ్ల పాటు విధులు నిర్వర్తిం చింది. ఇక వాణీ జయరాం వివాహం కూడా సికింద్రాబాద్‌ లోనే జరిగింది. 'నా మనసులో హైదరాబాద్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుం టుంద'ని చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. పీబీ శ్రీనివాస్‌ అవార్డు, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డుతోపాటు పలు సత్కారా లన్నీ హైదరాబాద్‌లోనే అందుకున్నారు.
లతా మంగేష్కర్‌తో గొడవ..
ప్రముఖ గాయని వాణీ జయరాం.. తన కెరీర్‌లో లతా మంగేష్కర్‌తో విభేదా లున్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పింది. లతా తన ఆదరణ చూసి భయ పడ్డారని స్పష్టం చేసింది. వసంత్‌ దేశారు సంగీత దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా 'గుడ్డీ' తో కెరీర్‌ మొదలు పెట్టిన వాణి ఆ చిత్రంలో పాడిన 'బోలే రే పపీ హరా' పాటకు ఎన్నో అవార్డులు అందు కుంది. తన తొలి చిత్రంలోని పాటలతో వాణి శ్రోతల నుంచి మంచి ఆదరణ పొందేసరికి తనకు ఎక్కడ పోటీగా వస్తుం దోనని లతా మంగేష్కర్‌ భయపడింది. గుడ్డీలో పాటలు ప్రజాదరణ పొందాక.. లతా ఆశీస్సులు తీసుకోడానికి వెళ్తే కలవడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. 1979లో విడుదలైన ''మీరా'' వారి మధ్య మరింత దూరాన్ని పెంచింది. మీరా చిత్రానికి పండిట్‌ రవి శంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు దర్శకుడు గుల్జార్‌. అది లతామంగేష్కర్‌కు మింగుడు పడలేదు. తన సోదరుడిని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని తేల్చి చెప్పారు. దాంతో గుల్జార్‌ సినిమాలోని పాటలన్నీ వాణితో పాడించారు. అలా, లతాకి వాణిపై కోపం ఇంకా ఎక్కువైంది. కొన్నా ళ్లకు బాలీవుడ్‌లో రాజకీయాలు నచ్చక వాణీ జయరాం తిరిగి మద్రాస్‌ వచ్చేసింది.
అవార్డులు
1975లో ఉత్తమ గాయనిగా కెరీర్‌లో మూడుసార్లు జాతీయ పురస్కారం పొందింది వాణీ జయరామ్‌. కె. బాలచందర్‌ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్‌' సినిమాలోని పాటకు గానూ వాణీని మొదటిసారి జాతీయ పురస్కారం వరిం చింది. ఇదే సినిమా తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది. ఆ తర్వాత వాణీ రెండు జాతీయ అవార్డులు కె. విశ్వనాథ్‌ సినిమా ల్లోని పాటలకు అందుకుంది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో 1979లో వచ్చిన 'శంకరా భరణం' చిత్రంలోని ''మానస సంచరరే..'' గీతానికి రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. 1991లో 'స్వాతి కిరణం' చిత్రం లోని ''ఆనతినియ్యరా హరా..'' పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది వాణీ జయరామ్‌. జాతీయ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ అవార్డును ఆమె మూడు సార్లు, 2013 లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. 2017లో న్యూయార్క్‌ నగరంలో జరిగిన ''చీAఖీA'' కార్యక్రమంలో వాణీ ఉత్తమ మహిళా గాయనిగా సత్కారాన్ని అందు కుంది. 2014లో హైదరాబాద్‌లోని యువకళా వాహిని సంస్థ ఆమెకు 'ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూజిక్‌' అవార్డును అందించింది. 1972 లో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం 'ఘూంగాట్‌' సినిమాలోని పాటకు బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ అవార్డు, 1979 లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 'అజగే ఉన్నై ఆరాధిక్కిరెన్‌' కు ఉత్తమ గాయని అవార్డు, 1979లో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం 'శంకరాభరణం' లోని గీతానికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు, 1982 లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంచే 'దేబ్జాని'కి ఉత్తమ గాయనీ అవార్డులను ఆమె అందుకున్నారు. ఇవే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాణీ ప్రత్యేక అవా ర్డులు అందుకున్నారు.
హిందూస్థానీ క్లాసికల్‌ గీతాలు ఆలపించడంలో ప్రావీణ్యం పొందిన వాణీ జయరామ్‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజపురి, మరాఠీ, ఒరియా.. ఇలా 19 భాషల్లో దాదాపు 20 వేల పాటలు పాడింది. వాణీ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిం చింది. కెవి.మహదేవన్‌, ఎం.ఎస్‌. విశ్వ నాధన్‌, ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడింది వాణీ జయరాం. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇటీవల ''పద్మ భూషణ్‌'' అవార్డును ప్రకటిం చగా, అది అందుకోకుండ గానే ఆమె కన్ను మూయడం
బాధాకరం. ఆమె మరణం తో సంగీతలోకం ఒక గొప్ప గాయనీని కోల్పోయింది. వాణీ జయరాం దంపతు లకు సంతానం లేరు. 2018లో భర్త జయరామ్‌ కన్నుమూసిన తర్వాత వాణి ఒంటరిగానే చెన్నైలో నివాసం ఉంటూ ఈ నెల 4న ప్రమాదానికి గురై మరణించింది. ఈ సందర్భంగా నవతెలంగాణ ''సోపతి'' ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతుంది
-పొన్నం రవిచంద్ర,
 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.