Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స‌మాజానికి దిక్సూచి చిత్రం, శిల్పం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 26,2023

స‌మాజానికి దిక్సూచి చిత్రం, శిల్పం

        ఆదిమానవుల రాతి గుహల కాలం నుంచీ 5వ శతాబ్దపు గుప్తుల కాలం వరకూ మనం ఇన్ని సంచికలలో మాట్లాడుతున్నప్పుడు, మనకు ప్రతీ ప్రదేశంలోనూ శిల్పం ఎదురౌతోంది కానీ చిత్రం మటుకు రాతియుగం నాటి గుహలలో చిత్రాలు, మళ్ళీ అజంతాలో చిత్రాలు, తప్ప మరెక్కడా కన్పించలేదు. దానికి కారణమేవిటీ అని మనకూ ప్రశ్న రాకమానదు. ఆ పైన చిత్రాలు, క్రీ.శ. 5వ శతాబ్దంలో బాగ్‌ గుహలు (మధ్య ప్రదేశ్‌)లోను, ఆపై క్రీ.శ. 8వ శతాబ్దంలో రాతి గోడలపై, ఆపై తాళ పత్రాలపై, 12వ శతాబ్దంలో కాగితం తయారీ కనుగొన్న తరువాత, కాగితంపై కనిపిస్తాయి. పూర్వ శతాబ్దాలలో చిత్ర రచననే జరుగలేదా, అలా అయితే ఒక్కసారిగా అజంతాలో అంత అందమైన చిత్రం ఎలా చిత్రించబడింది? బహుశ చిత్రకారుల అభ్యాసం జరుగుతూనే ఉండి ఉండవచ్చు. కానీ ఆనాడు శిల్పానికే రాజులు, ప్రజలు ఎక్కువ ఆదరణ ఇచ్చి ఉండవచ్చు. లేదా ఇంకా ఎన్నో కళాస్థావరాలు మన భారతీయ పరిశోధకుల కంటికి అంది ఉండకపోయి ఉండవచ్చు. లేదా కాలమాన పరిస్థితుల్లో ధ్వంసం అయి ఉండవచ్చు. కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. వాస్తవం మటుకు అజంతా తరువాత మనుకు మళ్ళీ చిత్రాలు మధ్యప్రదేశ్‌లోని బాగ్‌ గుహలలో కనిపిస్తాయి.
        బాగ్‌ గుహలు క్రీ.శ. 5వ శతాబ్దంలోని గుప్తుల నాటి గుహలు. ఇవీ అజంతా గుహలకు మల్లేనే కొండ తొలచి నిర్మించిన 9 గుహల నిర్మాణాలు. ఇవి మధ్యప్రదేశ్‌లోని ధార్‌ కి 97 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇవన్నీ బౌద్ధ విహారాలేను. ముందు ఈ గుహల పేరు కళ్యాణ విహారాలుగా పిలిచేవారు. దాతక అనే భిక్కు నిర్మించిన నిర్మాణాలివి. బాఘేశ్వరీ అనే నది ఒడ్డున నిలిపిన గుహలివి. క్రీ.శ. 10వ శతాబ్దంలో బౌద్ధం మధ్య భారతంలో అంతరించిన తరువాత, ఆ ప్రదేశం పెద్ద పులుల స్థావరంగా మారింది. ఆపై మళ్ళీ 1818 లో మళ్ళీ ఈ ప్రదేశాన్ని చూసినపుడు, బాగ్‌ (పెద్దపులి) అనే పేరు ఇవ్వబడింది.
బాగ్‌ గుహల, అజంతా చిత్రాల మధ్య ఎంతో పోలిక కనిపిస్తుంది. ఈ 9 గుహలు 750 గజాల పొడవున కొండ తొలిచి నిర్మించినవి. అక్కడ దొరికిన ఒక రాగిపలక శాసనం ప్రకారం క్రీ.శ. 487లో మహారాజు సుబంధు 2వ గుహ మరమ్మతు కోసం విరాళమిచ్చాడు. అసలు గుహల కట్టడము ఎప్పుడు జరిగిందో తెలిపే శిలాశాసనం దొరకక పోయినా, క్రీ.శ. 5వ శతాబ్దంలో అజంతా చిత్రాల పద్ధతి, ఇక్కడి పద్ధతి పోల్చి, ఈ బాగ్‌ గుహలు క్రీ.శ. 5వ శతాబ్దానివని తేల్చారు.
1వగుహ విరిగిపోయి, పాడైన గుహ. రెండవ గుహ పాండవ గుహగా పిలువబడీ ఎంతో భద్రంగా ఉన్న గుహ. 150 అడుగుల ఈ గుహ, చతురస్త్రాకారంలో ఉండి, మధ్యన హాలు, 3 వైపుల భిక్కులు ఉండేందుకు వీలుగా 3 గదులు వెనుక గోడలు స్థూపం ఉన్న మందిరమూ, అందులో ఇద్దరు అనుచరులు అటు ఇటూ నిలుచుని ఉన్న బుద్ధ విగ్రహమూ ఉంటుంది. 3వ గుహ హాధీ ఖానా (నa్‌ష్ట్రఱ ఖష్ట్రaఅa) గా పిలువబడుతుంది. దీనిలో ఉన్న భిక్కుల గదులలోనూ చిత్రాలు చిత్రించబడ్డాయి. గోడలపై చిత్రించిన బుద్ధుడి ఎదురుగా వంగి నమస్కరిస్తున్న బౌద్ధ భక్తుల చిత్రాలు కూడా ఉండటం తో ఈ గుహ, ఉన్నత గురువుల కోసం ఏర్పాటు చేసిన గుహ అని ఒక ఆలోచన.
4వ గుహ రంగమహల్‌గా పిలువబడే గుహ. ఇందులో ఇప్పటికీ చిత్రాలు గోడలపై కనిపిస్తాయి. ఇందులో ఒకే ఒక్క భిక్కుల ఆరామ గుడి, ఆర్భాటంగా చెక్కిన ద్వారాలు కిటికీలు, మధ్యలో స్థూపం ఉన్న మందిరం, స్తంభాలపై ఎన్నో చిత్రాలు, మకరంపై గంగ ఆకారం చెక్కిన, ఆకర్షణీయ గుహ. 5వ గుహలో గోడలపై, స్తంభాలపై, పైకప్పు మీద టెంపరా (ువఎజూవతీa) పద్ధతిలో చిత్రించిన చిత్రాలు కనిపిస్తాయి. 6వ గుహలో ఎక్కువ ఏమీ చూడదగ్గ అలంకరణలు మిగలకపోయినా, శుభ సూచికంగా చెక్కే కలశం, కుండ దానిపై పూలు ఆకులతో చెక్కి కనిపిస్తుంది. 7, 8, 9 గుహలు విరిగి పడిపోయినవి.
అజంతా, బాగ్‌ గుహలు రెంటిలోనూ ఫ్రెస్కో (ఖీతీవరషశీ), కుడ్య చిత్రాలు, టెంపరా పద్ధతిలో చేయబడ్డాయి. అజంతా కంటే బాగ్‌లో మొదటి పూత గోడలపై తక్కువ శ్రద్ధతో పూసారేమో అనిపిస్తుంది. ఎర్రమట్టి రంగు, సున్నపు పూత మొదటి పూతపై పూసి ఆపై చిత్రలేఖనం చేసారు. ఇక్కడి బౌద్ధ విషయానికి సంబంధించిన చిత్రాలలో, శిల్పాలలో అటు ఇటు బోధిసత్వుడు నిలుచుని ఉన్న బుద్ధ విగ్రహాలు, వదర ముద్ర, అభయ ముద్రలలో దర్శనమిస్తాయి. అంతేకాక పద్మపాణి, జాతక కథలు, ఋషులు, మునులు, గాయకులు, నర్తకీమణులు, పక్క వాద్యాలు, ఏనుగు, గుర్రపు స్వారీలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా అజంతా వలెనే యక్షులు, నాగులతో సమానంగా బౌద్ధం చూపారని అర్థం అవుతుంది. ఇక్కడి 2వ గుహలో, 4 సింహాలపై ఉన్న సింహాసనంపై కూర్చున్న నాగాలరాజు రాజహంగులతో కనిపిస్తాడు. 4వ గుహ, 7 తలల నాగరాజు, రాణి కూర్చుని ఉన్న శిల్పం అభయ ముద్రలో కనిపిస్తుంది.
అజంతా గుహలకూ, బాగ్‌ గుహలకూ ఎంతో దగ్గరి సామ్యం కనిపిస్తుంది. అజంతా చిత్రాలు, ఎంతో నైపుణ్యంతో మరిన్ని వివరాలతో చిత్రించినట్టు ఉంటే, బాగ్‌ చిత్రాలు బలమైన గీతలతో కొంచెం పెద్ద రూపాల చిత్రాలా అనే అనుమానం వస్తుంది. ఇప్పటికీ 2, 3, 4, 5, 7 గుహలలో కొంత చిత్రాలు కనిపించినా, ఇక్కడి చాలా చిత్రాలు అతి జాగ్రత్తగా 1982లో పురాతత్త్వ శాస్త్రవేత్తలు, తీసి గ్వాలియర్‌ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ పని మొత్తం 17 సం||లు కొనసాగింది. పురాతత్వ విభాగం, కళాకారులైన నందలాల్‌ బోస్‌, అసిత్‌ కుమార్‌ హల్దర్‌, సుమేంద్రనాథ్‌కర్‌, ఎ.బి. భోంసలే, బి.ఎ. ఆప్టే, ఎం.ఎస్‌. భాండే, వి.జి. జగ్తాప్‌లను కలకత్తా, ముంబయి, గ్వాలియర్‌ నుంచీ పిలిచి ఇక్కడి చిత్రాలను మళ్లీ చిత్రాలుగా గీయించి గ్వాలియర్‌ మ్యూజియంలో ప్రదర్శించారు.
ఇక్కడి చిత్రాలైనా, అజంతా చిత్రాలైనా, మరి ఏకకాలంలోని శిల్పం అయినా భారతీయ పురాతన చిత్ర కళగానూ, సంగీతం, సాహిత్యం వీటన్నిటి సంగమంలా కనిపిస్తుంది. చిత్రించిన గీతల్లో, భంగిమల్లో, విషయంలో వీటన్నింటిలో సంగమం తీసుకురావటం ఆనాటి కళాకారుల ముఖ్యోద్దేశ్యంలా, జీవన సౌందర్య రహస్యాలు చెప్ప ప్రయత్నించినట్టుంటాయి. అది బౌద్ధ శిల్పం అయినా, హిందూ శిల్పం అయినా, జైన అయినా, లేదా చిత్రం అయినా, భారతీయ చరిత్రకాలంలోని పురాతన, మధ్య యుగాలను చూస్తే కొన్ని చోట్ల సాహిత్య పరంగా లేదా నాటక, సంగీత, నృత్యపరంగా ఆలోచించి రూపం దిద్దారనిపిస్తుంది. అజంతా చిత్రాలు చూస్తే అందమైన భంగిమల్లో, అందమైన రంగుల్లో మనకు బౌద్ధంలోని మంచి బోధనని అందించటానికి చేసిన ప్రయత్నమే కదా! అదే ప్రయత్నం బాగ్‌ గుహలకూ వర్తిస్తుంది.
జైన మత గురువు మహావీరుడైనా, బౌద్ధ గురువు బుద్ధుడైనా, హిందూ పురాణాలు రాసిన వ్యాసుడైనా సరే, వీరందరి ఆలోచన ఒక్కటే. ధర్మం, న్యాయం బోధించుటే. ఈ తత్వజ్ఞులు అందరూ ప్రయత్నించింది, సమాజంలో మంచి నెలకొల్పుటకు. సమాజంలోని తప్పటడుగుల నుంచీ మానవులను మంచి మార్గంలో నిలపటమే. అందుకు వారు పురాణ కథలూ లేదా జాతక కథలు అనే సాహిత్యాన్ని ఎన్నుకున్నారు. నిజానికి భారతీయ తత్త్వ శాస్త్రం ఆధ్యాత్మిక మార్గంలో బోధింపబడింది.
తత్వశాస్త్రం, జనజీవన దినచర్య అనే సంస్కృతి ద్వారా, ఆధ్యాత్మిక సాహిత్యం ద్వారా ప్రవచనాలు, బోధనల ద్వారా ప్రతీ సామాన్య మానవులకూ అర్థం అయ్యే రీతిలో అందించబడింది. నీతి, న్యాయం, ధర్మం, సహృదయత ఈ గురువులందరి బోధనలకు మూలమై, సామాజిక సంతులనం కోసం ప్రయత్నించారు. అందుకనే అన్ని ధర్మాలకూ గమ్యం ఒక్కటే అన్నారు.
ఆనాటి కళలు, చిత్రం అయినా శిల్పం అయినా ధర్మం అనే మార్గానికి, మూలమైన శాస్త్రాలకు దృశ్యరూపం ఇవ్వటానికి ప్రయత్నించారు. సాహిత్యం, సంగీతం ద్వారా మానవులకు ఒక ఊహారూపం కదులుతుంది. ఆ రూపాన్ని చూడాలనే తపనా మనసుకు అనిపించటం సహజం. కళాకారులు చిత్రించేది ఆ రూపం. ఆ ఊహా రూపాన్ని దర్శనం చేయించటమే ఊహాలోకంలోని రూపాలకు నిజ రూపం ఇవ్వటం. ఇలా రూపాన్ని సృష్టిస్తున్నపుడు చిత్రకారులకు, శిల్పకారులకు ధర్మం అనే పదానికి దృశ్యరూపం ఇవ్వటం, బాధ్యతగా, సృజనాత్మకంగా సృష్టించటం. సి.శివరామమూర్తి అనే కళా చిత్రకారుడు 1980లో దృశ్యకళకు, సాహిత్యానికి మధ్య పోలికల గురించి రాస్తూ, ధర్మం మన దేశలోని దిక్సూచి గా పని చేసిందనీ, అలగ్జాండర్‌ (క్రీ.పూ. 4వ శతాబ్దం) కాలంలో మన దేశం వచ్చిన మెగస్తనీసు, ఇక్కడి సమాజంలోని మాట తప్పటం, ధర్మ విరుద్ధం అసంభవం అని ఆశ్చర్యపోయాడు.
- డా. ఎం.బాలమణి, 810671 3356

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.