Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తాతకు తగ్గ మనుమడు తారకరత్న | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 26,2023

తాతకు తగ్గ మనుమడు తారకరత్న

            తాత నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో నడుద్దామనుకున్న తారకరత్న రెండు పదుల వయస్సులోనే తెరంగేట్రం చేసి తొలి అడుగులోనే సంచలం సృష్టించాడు. తాత ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టిస్తే... ఈ మనవడు... ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి టాలీవుడ్‌ లో రికార్డు నెలకొల్పాడు. ఒకటో నెంబర్‌ కుర్రాడంటూ చిత్రసీమకు కథానాయకుడిగా పరిచమయ్యాడు. తొలి చిత్రమే తారకరత్నకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత పరాజయాలు, వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవడంతో కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్నాడు. అమరావతి చిత్రంతో ప్రతినాయకుడిగా మరోసారి తెరముందుకొచ్చిన తారకరత్నకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. కానీ అమరావతి చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నాడు. తారకరత్న నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా అనుకున్న విధంగా సక్సెస్‌ కాకపోవడంతో విలన్‌ పాత్రల్లో కూడా నటించాడు. ఇటీవల ప్రజా జీవితంలో ఉండాలనుకొని రాజకీయాల్లోకి వచ్చిన తారకరత్న, ఆ ఆశలు నెరవేరకుండానే ఈ నెల 18 న తుదిశ్వాస విడవటం బాధాకరం.
తారకరత్న 1983 జనవరి 8వ తేదీన చెన్నైలో ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి మోహనకృష్ణ, సీత దంపతు లకు జన్మించాడు. మోహనకృష్ణ దంప తులకు తారకరత్న ఒక్కగానొక్క కొడుకు. తారకరత్న తరవాత ఈ దంపతులకు కూతురు రూప జన్మించింది. చెన్నైలో ఏడో తరగతి వరకు చదువుకున్న తారక రత్న ఆ తరవాత హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు.
సినీరంగ ప్రవేశం
నటుడు, ప్రజల నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తారకరత్న సినీరంగ ప్రవేశమే ఓ పెద్ద సంచలనం. ఎన్టీఆర్‌ ఐదో కుమారుడైన మోహనకష్ణ పెద్దకొడుకు తారకరత్న హీరోగా రాణించాలనే కలతో కేవలం 20 ఏళ్ళ వయసులోనే బాబాయిలు, తమ్ముళ్ల అడుగుజాడల్లో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. 2001లో ఇండిస్టీకి వచ్చిన తారకరత్న ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన ఏకైక హీరో. దేశంలోనే కాకుండా, ప్రపంచం లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ హీరోకి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. 2001లో ''ఒకటోనెంబర్‌ కుర్రాడు, యువరత్న, తారక్‌, నో, భద్రాద్రి రాముడు, వెంకటాద్రి, ముక్కంటి'' ఇలా తారకరత్న ఒకేరోజు తొమ్మిది సినిమాలకు ముహుర్తం పెట్టి మొదలుపెట్టాడు. అయితే నందమూరి తారకరత్న ప్రారం భించిన ఈ తొమ్మిది సినిమాలలో.. తొలి సినిమా ''ఒకటో నెంబర్‌ కుర్రాడు'' మంచి విజయాన్ని సాధించింది. అశ్వినీదత్‌ సమర్పణలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రం తారకరత్నకు మంచి పేరు తీసుకొచ్చింది. తారకరత్న ఇండిస్టీకి పనికొస్తాడని అందరూ భావించారు. ఎంఎం కీరవాణి సంగీతం, పాటలు ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిం చాయి. ఆ తర్వాత విడుదలయిన ''యువ రత్న, తారక్‌, నో, భద్రాద్రి రాముడు'' చిత్రాలు తారకరత్నను నిరాశపరిచాయి. మొదలు పెట్టిన 9 చిత్రాల్లో 5 మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఐదు చిత్రాలలో ఒక్కటి మినహా మిగతా చిత్రాలు ప్లాప్‌ అవ్వడంతో నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో మిగతా 4 చిత్రాలు సెట్స్‌ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. 2006 తర్వాత మూడేండ్లు సినిమాలకు దూరం గా ఉన్న తారకరత్న 2009లో 'అమరా వతి' చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అమరావతి' సినిమాలో ప్రతి నాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ ప్రతినాయకుడిగా తారకరత్న నంది పురస్కారాన్ని అందుకు న్నారు. హీరోగా చేసినప్పుడు రాని అవార్డు, ఆయన విలన్‌గా చేసినప్పుడు రావడం విశేషం. ఆ తరవాత నారా రోహిత్‌ నటించిన 'రాజా చెయ్యి వేస్తే' చిత్రంలోనూ మరోసారి ప్రతినాయకుడిగా మెప్పించాడు. తారకరత్న ''వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురు లేని అలెగ్జాండర్‌, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంత, ఖయ్యూంబారు, దేవినేని, ఎస్‌ 5 నో ఎగ్జిట్‌, సారథి'' తదితర చిత్రాల్లో తారకరత్న నటించాడు. వెబ్‌ సిరీస్‌లోనూ తారకరత్న నటించాడు. క్రిష్‌ కథను అందించిన '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌లో పోలీసు అధికారికగా నటించాడు. ఆ పాత్రకు విమర్శకుల నుంచి తారకరత్న మంచి ప్రశంసలందుకున్నాడు. మొత్తంగా ఒక వెబ్‌ సిరీస్‌తో పాటు 23 సినిమాల్లో నటించిన తారకరత్న సినిమా 'సారధి' విడుదల కావాల్సి ఉంది. ఇలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాలని అనుకున్నప్పటికీ, అనుహ్యాంగా రాజకీయాలపై దృష్టి సారించాడు.
అలేఖ్య రెడ్డితో వివాహం
2012లో 'దయ' సినిమా షూటింగ్‌ సమయంలో తారకరత్నకు పరిచయమైన అలేఖ్యరెడ్డి ఆ తరవాత 'నందీశ్వరుడు' సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. ఈ సమయంలోనే తారకరత్న, అలేఖ్యరెడ్డితో ప్రేమలో పడ్డాడు. తారకరత్న, అలేఖ్యరెడ్డి తమ ప్రేమతోపాటు, తాము వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకోవడంతో పాటు, కులాలు వేరుకావడం కారణంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో 2012లో స్నేహితుల సాయంతో హైదరాబాద్‌ శివారులో ఉన్న సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. అలేఖ్యరెడ్డి సిస్టర్స్‌ ఈ పెళ్ళికి హాజరైన, నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదు. అయితే, తారకరత్న, అలేఖ్య దంపతులకు కూతురు 'నిష్క' జన్మించాక బాలకృష్ణ చొరవతో తారకరత్న తల్లిదండ్రులు మనసు మార్చుకుని కొడుకు, కోడలిని ఆశీర్వదించారు. ఆ తర్వాత తారకరత్న, అలేఖ్య దంపతులకు కుమార్తెతో పాటు ఇద్దరు కవలలు పుట్టారు. వైఎస్సార్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలేఖ్యరెడ్డి చాలా దగ్గర బంధువు.
గుండెపోటుతో మృతి
తెలుగుదేశం పార్టీకి తనవంతు సహాయంగా ఉండాలని నిర్ణయించుకుని రాజకీయరంగ ప్రవేశం చేసిన తారకరత్న, నారా లోకేశ్‌ మొదలుపెట్టిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ముందడుగు వేశాడు. అయితే పాదయాత్రలో భాగంగా లోకేష్‌తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో తారకరత్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి, 23 రోజులు మెరుగైన వైద్యం అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సబ్యులు తారకరత్న గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ప్రతి క్షణం దగ్గరుండి చూసుకున్నారు. ఎలాగైనా మామూలు మనిషి అవుతాడని ప్రతిఒక్కరూ భావించారు. కానీ దానికి భిన్నంగా ఆయన ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
- పొన్నం రవిచంద్ర, 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.