Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ ప్రశ్నకు బదులేది? | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 05,2023

ఈ ప్రశ్నకు బదులేది?

జగన్నాథం పేరు జగన్నాథమే కాని అయోమయం జగన్నాథం మాత్రం కాదు. జగన్నాథం స్కూల్‌ విద్య వెలగబెడుతున్న రోజుల్లో జగన్నాథం అనే పేరుకి ముందు అయోమయం చేరింది. తర్వాతి కాలంలో అయోమయం జగన్నాథం అని పిలవబడ్డ జగన్నాధం ఉత్తి అయోమయంగా మిగిలిపోయాడు.
అసలు ఈ అయోమయం జగ న్నాథానికి తుమ్మబంకలా అంటుకుం దుకు కారణం స్కూల్లో జగన్నాథం ప్రవర్తనే. అసలు ఈ లోకంలో ప్రశ్నలూ, సందేహాలూ లేని వాడెవ డుంటాడు చెప్పండి. క్లాస్‌లో టీచర్‌ పాఠం అయిపోగానే విద్యార్థులను అర్థమయిందా అనడుగుతాడు. నలభైమందికి ముప్పయి తొమ్మిది మంది చాలా బాగా అర్థమైంది సార్‌ అంటారు. ఒక్కడు మాత్రం లేచి తనకో సందేహం ఉందంటాడు. అదేమిటో చెప్పమని టీచర్‌ అడుగుతాడు. ఆ ఒక్కడు అదేమిటో చెప్తాడు కానీ అది ఎవరికీ అర్థం కాదు టీచర్‌తో సహా. ఆ అడిగే ఒక్కడు జగన్నాథమే. అతని సందేహం అందరికీ అయోమయమే. అలా పేరుకు అయో మయం తగిలించుకున్న జగన్నాథం ఎన్నేళ్ళ యినా దాన్ని వదిలించుకోలేకపోయాడు.
నిత్యం అనేక అనుమానాలతో, సవాలక్ష యక్ష ప్రశ్నలతో సతమతమయ్యే జగన్నాథాన్ని ఓ ప్రశ్న వేధించసాగింది. రాచిరంపాన కొయ్యసాగింది. ఇదేం కొత్త ప్రశ్న కాదు. దీనికి ఆర్కిమిడిస్‌ యూక్లిడు లాంటి మేధాయోధులు కూడా జవాబు చెప్పలేరు. అయితే లోకంలో 'ఫ్రీ'గా గాలి పీలుస్తున్న ప్రతివాడికీ ఈ సందేహం రాకపోదు. లోకంలో ఒకరికంటే ఒకరు తెలివైనవారు కనుక దీన్ని పెద్దగా పట్టించుకోరు. అవసరమా అని తన్ని తగలేస్తారు.
జగన్నాథ అందరిలాంటి వాడు కాదు మరి. అయోమయం కదా! ఆ ప్రశ్నకి సమాధానం కోసం కంటి మీద కునుకులేకుండా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏ క్షణాన ఏ అద్దం ముందు నిలబడి ముఖం చూసుకుంటుంటే ఆ ప్రశ్న అయోమయంగా అయోమయం మెదడులోకి జొరబడ్డదో మరి!
ఇంత పెద్ద భూగోళంలో ఇన్ని ఖండాలూ సముద్రాలూ ఉన్న లోకంలో తెలుపూ నలుపూ ఎరుపూ పొడుగూ పొట్టీ లావూ సన్నం మనుషుల్లో ఈ మతం, ఆ కులం గుర్తింపున్న జనంలో ఈ వృత్తి ఆ వృత్తి అనేక వృత్తుల జనాభాలో తన సందేహ నివృత్తి చేసేవాడెవడూ ఉండడా అని కనిపించిన వాడినల్లా ఏ మాత్రం సిగ్గూ మొహమాటం లేకుండా అడిగేయసాగాడు.
ఒక ఉద్యోగి తను ఆ ఉద్యోగం చెయ్యడానికే పుట్టానని తను లేకపోతే ఆఫీసు అంగుళం ముందుకు కదలదని చెప్పాడు. ఓ వ్యాపారి వేలని లక్షలు, లక్షల్ని కోట్లు చెయ్యడం కోసమే తన జన్మ అని చెప్పుకొచ్చాడు. ఒక పంతులు పాఠాలు చెప్పడానికని ఒక డాక్టరు అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు చేసి బస్తాల కొద్దీ మందులు కొనిపించి తను పని చేసే కార్పొరేట్‌ దవాఖానా ఖజానా నింపడం కోసం అని ఓ కవి పత్రికల్లో అచ్చుకావడం లేదని తన కవితల్ని వాట్ప్‌ఆప్‌లో చదివి వినిపించి చెవులు మూయించడానికని, ఒకడు బ్యాంకుల్ని దివాలా తీయించడానికికని ఒకడు భూ కబ్జాలకోసమని రకరకాలుగా జవాబులు చెప్పారు. కానీ జగన్నాథం అమయోమయం సంతృప్తి పడలేదు. తన ప్రశ్నకు పండితులు కాని పామరులు కాని ప్రవచన కర్తలు కాని, ఆస్తికులు కాని నాస్తికులు కాని సమాధానం చెప్పలేరు అనుకున్నాడు.
ఊళ్ళోకి ఎక్కడ్నించో ఓ బవిరిగడ్డం బాబా వచ్చాడని ఆయన అందరి సందేహాలూ చిటికెలో తీర్చేస్తున్నాడని విన్న జగన్నాథం 'ఆఘమేఘాల మీద' వెళ్ళలేడు కనుక కళ్ళు బైర్లు కమ్మే బస్సు చార్జీలు పెట్టుకుని ఆయన ముందువాలాడు. సవినయంగా తన సందేహం చెప్పాడు. గ్యారంటీగా సమాధానం వస్తుందని ఆశ పడ్డాడు. కానీ ఆ సన్యాసి, ఆ స్వామి, ఆ బైరాగి ఆ సర్వసంగ పరిత్యాగి తానూ ఆ ప్రశ్నకు సమాధానం కోసమే చెట్లూ పుట్టలూ అడవులూ కొండలూ, బావూలూ, తీర్థాలూ తిరిగానని కాళ్ళు అరిగాయి కానీ గడ్డం పెరిగింది కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదని ఏడ్చి మొత్తుకున్నాడు.
అయోమయం వీడని జగన్నాథం నిరాశగా వెనక్కి తిరిగి వస్తుంటే ఓ చోట ఏదో సభ జరుగుతున్నది. ఒక నాయకుడు మైకులో ప్రసంగిస్తున్నాడు. ఏం చెప్తాడో విందామని నిలబడిపోయాడు. ప్రసంగం పూర్తయ్యాక ముందు వరుసలో నిలబద్ద జగన్నాథం చేయి పైకి ఎత్తి 'అయ్యా నాది ఓ జవాబు తెలియని ప్రశ్న. అడగనా?' అన్నాడు జగన్నాథం.
'అడుక్కో' అన్నాడు నాయకుడు మైకు వదలకుండా.
'నేనేందుకు పుట్టాను??' అని బిగ్గరగా అరిచాడు జగన్నాథం.
మైకు ముందున్న నాయకుడు ఏ మాత్రం షాక్‌ అవకుండా 'నువ్వు పుట్టింది నాకు ఓటు వేయడానికే' అన్నాడు. 'ఇప్పటిదాకా నేను చెప్పిందంతా విన్నావు కదా. నువ్వు పుట్టింది నేను చెప్పింది అదెంత చెత్తయినా వినడానికన్న మాట పిచ్చివాడా! వేల సంఖ్యలో ఉన్న మేం ఓట్లు వేయించుకోవడానికై, కోట్ల సంఖ్యలో ఉన్న మీరు ఓట్లు మీరు ఓట్లు వేలు మీద చుక్క వేయించుకోవడానికై పుట్టారన్న మాట' అని ముగించాడు.
ఈ లోకంలో మసిపూసి మారేడు కాయను చెయ్యగలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలకు జవాబు చెప్పగలరన్న మాట అనుకున్నాడు జగన్నాథం అయ్యోమయం!!
- చింతపట్ల సుదర్శన్‌, 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.