Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెండితెరపై కంచుకంఠం మోగించిన జగ్గయ్య | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 05,2023

వెండితెరపై కంచుకంఠం మోగించిన జగ్గయ్య

           కంచుకంఠంతో పాటు, మంచి చదువు.. సాహిత్యంపై పట్టు.. నాటకాలలో ఉన్న అపారమైన అనుభవం.. స్పష్టమైన ఉచ్చారణ.. కంగుమంటూ మ్రోగే కంఠం.. కొంగర జగ్గయ్య సొంతం. అద్భుతమైన ఈ వాయిస్‌ కారణంగానే ఆయనకి ఆల్‌ ఇండియా రేడియోతో పాటు, సినిమాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. కవిగా, రచయితగా, చిత్రకారుడుగా, అధ్యాపకుడుగా, పాత్రికేయుడుగా, రాజకీయ నాయకుడుగా, నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన విశిష్ట వ్యక్తి జగ్గయ్య. ధరించిన పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి ఒక ప్రత్యేకతను, నిండుతనాన్ని, హుందాతనాన్ని సంతరింపజేసిన వ్యక్తి జగ్గయ్య. సినీరంగ ప్రవేశానికి ముందే దశాబ్దంపాటు నాటకరంగంలో విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి. ఎన్‌.టి. రామారావు, జమున, సావిత్రి, గుమ్మడి, ముక్కామల వంటి నటీనటులతో రంగస్థలం మీద నటించిన జగ్గయ్య ఎందరు నటులకో మార్గదర్శకుడుగా నిలిచాడు. ''కళా వాచస్పతి''గా గుర్తింపు పొందిన జగ్గయ్యను భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన 'పద్మభూషణ్‌ అవార్డ్‌' ను ఇచ్చి సత్కరించింది.
           జగ్గయ్య గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలో ఉన్న మోరంపూడి గ్రామంలో కొంగర సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు 1926 వ సంవత్సరం డిసెంబర్‌ 31న జన్మించాడు. సీతారామయ్య తన తండ్రి పేరును జగ్గయ్యకు పెట్టుకున్నాడు. వారిది సంపన్న కుటుంబం. జగ్గయ్య తండ్రికి సంస్కృత, ఆంధ్ర సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండడమే కాకుండా కళల మీద కూడా ఆసక్తి వుండేది. అదే జగ్గయ్యకు కలిసివచ్చిన అంశం. జగ్గయ్య తండ్రి 'సీతారామ విలాస నాట్యమండలి' అనే నాటక సంస్థను నెలకొల్పి ఔత్సాహిక నటులను ప్రోత్సహిస్తూ మంచి మంచి నాటకాలను ప్రదర్శింపజేస్తూ వుండేవాడు. ఈ నాటక ప్రదర్శనల కోసం ప్రత్యేకంగా తెనాలిలో 'శ్రీకష్ణ సౌందర్య భవనం' అనే నాటక శాలను కూడా ఆయన నిర్మించాడు. అందులో పండిత సభలను నిర్వహించేవారు. తరవాతి రోజుల్లో దానినే 'రత్నా టాకీసు'గా ఆధునీకరించారు. చిన్నతనంలో జగ్గయ్య నౌకర్లు భుజమెక్కి తెనాలికి వెళ్లి తండ్రి ఆధ్వర్యంలో ప్రదర్శితమయ్యే నాటకాలను చూసేవాడు. జగ్గయ్య ప్రాధమిక విద్యాభ్యాసం మోరంపూడిలో, ఉన్నత పాఠశాల విద్య దుగ్గిరాలలో కొనసాగగా, ఆంధ్ర క్రిష్టియన్‌ కళాశాలలో బి. ఏ పూర్తి చేశాడు. హైస్కూలులో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో హిందీ మాస్టారు ప్రోత్సాహంతో 'లవకుశ' అనే హిందీ నాటకంలో జగ్గయ్య లవకుమారుడుగా నటించాడు. డ్రాయింగ్‌ మాస్టారు ద్వారా జగ్గయ్యకు చిత్రకళ అబ్బింది. జగ్గయ్య క్రిష్టియన్‌ కళాశాలలో చదువుతున్నప్పుడు నటన పట్ల ఆసక్తి ఉన్న సహ విద్యార్థి ఎన్టీఆర్‌ ఇరువురు కలిసి ''నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌'' పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా వారు వేసిన 'బలిదానం', 'చేసిన పాపం' నాటకాలు ఎంతో పేరు తెచ్చాయి. అనంతరం దుగ్గిరాలలో ఉపాద్యాయునిగా పని చేస్తున్న సమయంలో పత్రికా రంగం వైపు ఆకర్షితుడైన జగ్గయ్య 'దేశాభిమాని' పత్రికలో ఉప సంపాదకుడుగా, 'ఆంధ్ర రిపబ్లిక్‌' పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు.
చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి
చిన్నతనం నుంచే జగ్గయ్య నాటకాలు.. సాహిత్యం.. చిత్రలేఖనంపై ఆసక్తిని చూపేవాడు. స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవాడు. సాహిత్యం పట్ల గల ఆసక్తి కారణంగానే, ఆ తరువాత కాలంలో ఆయన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'గీతాంజలి'ని 'రవీంద్ర గీత' పేరుతో తెలుగులోకి అనువదించేలా చేసింది. నాటకాలు వేసే సమయంలోనే జగ్గయ్య వాయిస్‌ కి అభిమానులు ఉండేవారు. అద్భుతమైన ఆ వాయిస్‌ కారణంగానే జగ్గయ్యకు ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసే అవకాశం లభించింది. నాటకాలు ఆడే సమయంలోనే ఆయనకి రచయిత త్రిపురనేని గోపీచంద్‌ తో సాన్నిహిత్యం ఏర్పడింది.
'ప్రియురాలు' తో తెలుగు తెరకి పరిచయం
త్రిపురనేని గోపీచంద్‌ మద్రాసు వెళ్లి అక్కడి సినిమా రంగంలో కుదురుకుంటున్న రోజులలో ఆయనకు 'ప్రియురాలు' సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. దాంతో ఆయన కథానాయకుడి పాత్ర కోసం జగ్గయ్యను పిలిపించాడు. అలా ఆ సినిమాతో జగ్గయ్య 1952లో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన 'ఆదర్శం' సినిమా కూడా పరాజయంపాలు కావడంతో, అవకాశం వస్తే హీరోగా చేద్దాం.. లేదంటే ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళ్లాలని జగ్గయ్య తీసుకున్న నిర్ణయం, ఆయనను ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది. ఈ సమయంలో ప్రసిద్ధ దర్శక నిర్మాత హెచ్‌. ఎం. రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'బీదలఆస్తి' సినిమాలో జగ్గయ్యకు అవకాశమివ్వగా, ఈ చిత్రంలో నటిస్తూ వుండగానే 1955 లో బి. ఎన్‌. రెడ్డి రూపొందించిన 'బంగారుపాప' లో జమున సరసన నటించిన జగ్గయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ''బాల సన్యాసమ్మ, దొంగ రామూడు, ఛాయా, అంతే కావాలి'' చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రాల తర్వాత జగ్గయ్యకు వరసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. రాగిణీ పిక్చర్స్‌ 'అర్థాంగి', అన్నపూర్ణా బ్యానర్‌ తొలిచిత్రం 'దొంగరాముడు' సినిమాలలో ప్రతినాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావుతో నటించాడు. అర్ధాంగి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ బహుమతిగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సమయంలోనే జగ్గయ్యకు ఎవరికీరాని మహత్తర అవకాశం మరొకటి వచ్చింది. 1954లో తమిళంలో ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో శివాజీ గణేశన్‌ నటించిన 'మనోహర' చిత్రం విడుదలై విజయవంతంకాగా, దానిని తెలుగులోకి డబ్‌ చేశారు. అందులో శివాజీ గణేశన్‌ కు గంభీరమైన గొంతుతో జగ్గయ్య డబ్బింగ్‌ చెప్పాడు. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్‌ దీటుగా జగ్గయ్య డబ్బింగ్‌ చెప్పడంతో ఆ సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది. జగ్గయ్య కంఠస్వరం తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. తదనంతరకాలంలో శివాజీ గణేశన్‌ నటించిన చిత్రాలు తెలుగులోకి అనువదించిన అన్ని సందర్భాల్లో జగ్గయ్యే అతనికి డబ్బింగ్‌ చెప్పాడు.
హీరోగా, క్యారక్టర్‌ నటుడుగా రాణించిన జగ్గయ్య
జగ్గయ్య దాదాపు వంద సినిమాల్లో హీరోగా, మరో వంద సినిమాల్లో సహకథానాయకుడిగా, రెండు వందల చిత్రాల్లో క్యారక్టర్‌ నటుడుగా రాణించాడు. ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అగ్రశ్రేణి నటులుగా తెలుగు చలనచిత్ర రంగంలో దూసుకుపోతున్న సమయంలో జగ్గయ్య మాత్రం తనదైన శైలిలో స్థిరమైన వేగంతో నటజీవితాన్ని సాగించాడు. జగ్గయ్య ఎక్కువగా నాగేశ్వరరావు చిత్రాల్లో సహ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించాడు. ఆయన ఏ హేరో ప్రక్కన నటించినా హీరోకన్నా జగ్గయ్యకే ఎక్కువ పేరువచ్చేది. నాగేశ్వరరావు-సావిత్రి-జగ్గయ్య కలిసి నటించిన చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. వాటిలో ''తోడికోడళ్ళు, వెలుగునీడలు, ఆరాధన, పూజాఫలం, డాక్టర్‌ చక్రవర్తి, సుమంగళి, మనుషులు మమ తలు, మనసే మం దిరం'' సినిమాలను ముందుగా చెప్పు కోవాలి. ఈ సినిమాల న్నింటిలోనూ జగ్గయ్య పోషించిన భూమికలు వేటికవే సాటి. ఇక నాగేశ్వరరావుతో నటించిన జగపతి సంస్థ చిత్రాలు ''ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు'' లో జగ్గయ్య నటించిన పాత్రలు ప్రతినాయక లక్షణాలతో వున్న ప్రత్యేక పాత్రలు. అక్కినేని కాంబినేషన్‌లోనే నటించిన 'ప్రేమించిచూడు'లో జగ్గయ్యది సరదా పాత్ర, 'బందిపోటు దొంగలు' లో విలన్‌ పాత్ర, 'మేఘసందేశం, లో సాత్వికమైన పాత్ర. ఇలాంటి విభిన్న పాత్రలు జగ్గయ్యకు దొరకడం ఆయన చేసుకున్న అదృష్టం. నందమూరి తారక రామునితో కూడా జగ్గయ్య సహాయక, ప్రతినాయక పాత్రలతో బాటు క్యారక్టర్‌ నటుడిగా కూడా నటించారు. ''అప్పుచేసి పప్పుకూడు, కలసివుంటే కలదు సుఖం, ఇంటికి దీపం ఇల్లాలే, మంచిమనిషి, గుడిగంటలు, బడిపంతులు, అడవిరాముడు, బొబ్బిలిపులి'' సినిమాల్లో రామారావు తో కలిసి వైవిధ్య పాత్రల్లో నటించారు. ఇక హీరోగా ''పదండి ముందుకు, ఎం.ఎల్‌.ఎ, ఈడూ జోడూ, ఉయ్యాల జంపాల, అన్నపూర్ణ, ఆమె ఎవరు, అర్ధరాత్రి, రామాలయం'' చిత్రాల్లో అద్భుతంగా నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు ''నవ రాత్రి, జరిగిన కథ, బాల మిత్రుల కథ, బడిపంతులు, భార్య బిడ్డలు, దేవుడు చేసిన మనుషులు'' చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచాయి. ''అల్లూరి సీతా రామరాజు'' చిత్రంలో బ్రిటీష్‌ అధికారి రూథర్‌ ఫోర్డ్‌ పాత్రను, 'కరుణామయుడు'లో పోంటియస్‌ పిలేట్‌గా అద్భుతంగా నటించిన జగ్గయ్య ఆ తర్వాత 'వేట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం, ధర్మ క్షేత్రం' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. రిచర్డ్‌ అటెన్‌ బరో దర్శకత్వంలో ఆస్కార్‌ బహుమతులు గెలుచుకున్న 'గాంధి' సినిమా తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ లో అటెన్‌ బరో పాత్రకు గాత్రదానం చేశాడు. జురాసిక్‌ పార్క్‌ డబ్బింగ్‌ వర్షన్‌ లో కూడా జగ్గయ్య గాత్రదానం చేశాడు. మోహన్‌ బాబు నిర్మించిన 'కుంతీపుత్రుడు' లో జగ్గయ్య చివరిసారిగా నటించాడు. తొంటి నొప్పితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న జగ్గయ్య చికిత్సానంతర ఇబ్బందులు తలెత్తడంతో 2004 మార్చి 5 న చెన్నైలో మరణించాడు.
జగ్గయ్య డ్యూయెట్లు హిట్‌
జగ్గయ్య హీరోయిన్‌ లతో డ్యూయెట్లు పాడింది కొన్ని సినిమాలలోనే అయినా, ఆ పాటల్లో చాలావరకూ సూపర్‌ హిట్లు ఉండటం విశేషం. జరిగిన కథ చిత్రంలో 'భలేమంచి రోజు.. పసందైన రోజు..', ఈడు జోడు లో 'ఇదేమి లాహిరి.. ఇదేమి గారడి..', ఉయ్యాల జంపాల లో 'ఓ పోయే చినదాన..', గుడిగంటలు లో 'నీలికన్నుల నీడలలోన..', మంచి మనిషి లో 'ఓహౌ గులాబి బాల..', కానిస్టేబుల్‌ కూతురులో 'చిగురాకుల ఊయలలో..', ఆమె ఎవరు లో 'అందాల ఈ రేయి..' పాటలు హిట్‌ సాదించి ఈ నాటికీ ఆ పాటలు శ్రోతల మనసు తలుపు తడుతూనే ఉన్నాయి.
నిర్మాతగా
జగ్గయ్య నిర్మాతగా 1962 లో 'పదండి ముందుకు' చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం. ఈ సినిమాకు నిర్మాత జగ్గయ్యే అయినా పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తిది. ఈ సినిమాను 1930లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో డాన్సులు, డ్యూయెట్లు వంటి ఆకర్షణలు లేకుండా తీశాడు. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. ఈ సినిమా రష్యాలో తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ తో బాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి సంభాషణలతో బాటు చిత్రం చివర్లో వచ్చే 'మంచికి కాలం తీరిందా' అనే పాటను కూడా జగ్గయ్యే వ్రాశాడు. ఇది మహమ్మద్‌ రఫీ పాడిన తొలి తెలుగు పాట. ఈ సినిమాలో కృష్ణ ఒక చిన్న పాత్ర వేశాడు. ఈ చిత్రం తర్వాత జగ్గయ్య 'శభాష్‌ పాపన్న' చిత్రాన్ని నిర్మించారు.
జగ్గయ్య మనవడు సాత్విక్‌ నటుడే
1951లో 'ప్రియురాలు' సినిమాతో ఆరంభించి 125 సినిమాల్లో నాయకుడిగా, 325 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో 'కళావాచస్పతి'గా ముద్ర వేసుకున్న 'పద్మభూషణ్‌' కొంగర జగ్గయ్య సినీ వారసుడు లేడనుకుని నిరాశ పడ్డారెందరో... ఇందుకు జవాబుగానేమో? ఆయన మన వడు 'కొంగర సాత్విక్‌ కృష్ణ' నటనా రంగంలోకి దూసుకొచ్చాడు. బుల్లి తెర బిజీ స్టార్‌గా ఉంటూ, మరోవైపు వెండితెరపైనా సాత్విక్‌ అరంగేట్రం చేశాడు. ఆయన తొలి సారిగా వెండి తెర అవకా శమే 'అర్ధనారి' సినిమా రూపంలో పలక రించింది. అందు లో పోలీసాఫీసర్‌ పాత్రలో నటించిన సాత్విక్‌కు, బుల్లితెర మంజులా నాయుడు నుంచి కబురొచ్చింది. 'శ్రావణ సమీరాలు' టీవీ సీరియల్‌లో 'షెట్టి' అనే ప్రధాన విలన్‌గా అవకాశమొచ్చింది. ఆ తరవాత ఆయ నకు అవకాశాలు వరుసకట్టాయి. 'కోయిలమ్మ', 'అభిషేకం', 'స్వాతిచినుకులు', 'అగ్నిసాక్షి', 'సావిత్రి', 'ఆడదే ఆధారం' సీరియల్స్‌తో బుల్లితెరకు పర్మినెంట్‌ నటుడయ్యాడు. దాదాపు అన్నీ విలన్‌ పాత్రలే. కోయిలమ్మ, స్వాతిచినుకులు, అగ్ని సాక్షి సీరియల్స్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్‌ 'మధుమాసం'లో సీబీఐ అధికారిగా, 'గోరింటాకు', 'మట్టిగాజులు'లో విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. సాయిధరమ్‌ తేజతో కృష్ణవంశీ తీసిన 'నక్షత్రం' సినిమాలో నటించాడు. 'టీవీ సీరియల్స్‌తో బీజీగా ఉండటం సంతృప్తిగా ఉంది. సినిమాల్లోనూ ప్రూవ్‌ చేసుకోవాలని ఉంది' అంటాడు సాత్విక్‌. తాతయ్య గురించి అందరూ చెబుతుంటే హ్యాపీగా ఉంటుంది. 'టాలెంటుతోనే పైకిరావాలని ముందు కెళుతున్నా, ఇంటిపేరుతో తెలిసిపోతున్నాను' అని చెప్పారు.
నాట్యం చేసే సావిత్రికి
నటిగా అవకాశం కల్పించిన జగ్గయ్య
విజయవాడ 'అరుణోదయ నాట్యమండలి' నాటక సంస్థలో జగ్గయ్య అనువదించిన విశ్వకవి రవీంద్రనాథ టాగూరు రచించిన 'బలిదానం' నాటకాన్ని ప్రదర్శించెందుకు సిద్దమైనపుడు, ఆ నాటకంలో స్త్రీ పాత్రకు ఒక ఆర్టిస్టు కావాల్సి వచ్చింది. సుంకర కనకారావు తన సంస్థలో చిన్నచిన్న ప్రదర్శనలలో నాట్యం చేస్తూ ఉండే సావిత్రిని ఈ నాటకంలోని పాత్రకు సిఫార్సు చేయడంతో జగ్గయ్య సావిత్రికి ఆ నాటకంలో అవకాశం కల్పించాడు. ప్రదర్శనలలో నాట్యం చేస్తూ వుండే సావిత్రికి నటిగా ఇదే తొలి ప్రదర్శన. జగ్గయ్య నటిగా అవకాశం కల్పించిన సావిత్రి ఆ తర్వాత మహానటిగా సినీ పరిశ్రమలో వెలుగొందింది.
చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా డ్యూయెట్లు..
తెనాలి దగ్గర ఓ గ్రామంలో ప్రదర్శించే 'ఢిల్లీ రాజ్యపతనం' అనే నాటకంలో మహారాజు ముందు డ్యాన్స్‌ చేయాల్సిన పాత్రకి దుగ్గిరాల స్కూలులోనే చదువుకునే ఓ చిన్నపిల్లని ఎంపిక చేసుకుని వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకొని నాటక బందంతో తెనాలి వరకు రైలులో వెళ్లి, అక్కడి నుండి ఒక ఎడ్లబండిలో 'ముండూరు' గ్రామానికి ప్రయాణమయ్యారు. అయితే మధ్యంలో ఆ బండి చెడిపోవడంతో, పంటపొలాల వెంట నడిచి వెళ్ళాల్సి రావడం, ఆ అమ్మాయి నడవలేక ఏడవడం మొదలెట్టింది. దాంతో జగ్గయ్య ఆ అమ్మాయిని చంకనేసుకొని నడుచుకుంటూ ముండూరు గ్రామం వరకూ వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిచే ప్రదర్శన ఇప్పించాడు. అయితే తదనంతర కాలంలో ఒక అద్భుత నటిగా రూపుదిద్దుకున్న జమునే ఆ అమ్మాయి. ఇలా జమునను చంకనేసుకుని తొలిసారి స్టేజ్‌పై నాటకాలు వేయించిన జగ్గయ్య ఆ తర్వాత ఆమె పక్కనే హీరోగా డ్యూయెట్లు పాడాడు.
లోక్‌సభకు ఎన్నికైన తొలి సినీనటుడు
సినీ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ముఖ్య మంత్రుల నుండి కేంద్ర రాష్ట్ర మంత్రుల వరకు పదవులు చేపట్టారు. అయితే మొట్టమొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టిన నటుడు జగ్గయ్య కావడం విశేషం. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న జగ్గయ్య కాంగ్రెస్‌ పార్టీలోని సోషలిస్ట్‌ గ్రూప్‌ రద్దయిన తర్వాత ప్రజా సోషలిస్ట్‌ పార్టీలో చేరాడు. 1956 లో నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జగ్గయ్య 1967లో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు కు పోటీ చేసి గెలుపొందాడు. దేశంలో ఎం.పి గా గెలుపొందిన తొలి సినీ నటుడుగా రికార్డు సృష్టించాడు.
సాహిత్య సేవలో..
విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూరు రచించిన నోబెల్‌ బహుమతి కవితాగ్రంధం 'గీతాంజలి' ని తెలుగులోకి తర్జుమా చేసిన ఘనత జగ్గయ్యదే. అలాగే టాగూరు నాటకం 'శాక్రిఫైస్‌' ని 'బలిదానం' పేరుతో అనువదించడమే కాకుండా రంగస్థలం మీద ఆ నాటికను ప్రదర్శిం చాడు జగ్గయ్య.
'మన స్విని' పేరుతో ఒక స్వచ్చంద సంస్థను నెల కొల్పి ఆచార్య ఆత్రేయ వంటి కవులను సత్కరించడమే కాకుండా, ఆత్రేయ సంపూర్ణ రచనలను ఏడు సంపుటాలుగా ప్రచురించి తన సాహిత్య సేవను చాటుకున్నారు.
పురస్కారాలు
సినిమారంగంలో జగ్గయ్య చేసిన కృషికి భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన 'పద్మభూషణ్‌' పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించగా, ఢిల్లీలోని సంస్కృత విశ్వవిద్యాలయం 'కళా వాచస్పతి' అనే బిరుదుతో జగ్గయ్యను సత్కరించింది. హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయం జగ్గయ్యను గౌరవ డాక్టరేటుతో సత్కరించగా, తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి బిరుదు నిచ్చింది.
- పొన్నం రవిచంద్ర, 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.