Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాడపాటి కథలు - పరిశీలన | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 12,2023

మాడపాటి కథలు - పరిశీలన

          మాడపాటి హనుమంతరావు జనవరి 22, 1885లో కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పొక్కునూరు గ్రామంలో జన్మించాడు. ఐదేండ్ల వయసులో తండ్రి చనిపోతే, తల్లి వెంకటసుబ్బమ్మ అతన్ని తీసికొని నల్లగొండ జిల్లా సూర్యాపేటలో టీచరుగా పనిచేస్తున్న అన్న జమలాపురం వెంకటరావు దగ్గరికి వచ్చింది. విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో కొనసాగింది. నల్లగొండ, హన్మకొండలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యాభ్యాసం కాలం నుంచే మాడపాటి గ్రంథాలయోద్యమం, సామాజికోద్యమం, సాంస్కృతికోద్యమాల వైపు దృష్టి సారించాడు. నిరంకుశపాలన గల హైదరాబాద్‌ సంస్థానంలో సాంస్కృతికోద్యమాన్ని తన శక్తి సామర్థ్యాల్ని ధారపోసి నడిపించాడు. రాజనీతి, సంస్కరణ, స్త్రీ విద్య, చరిత్ర, భాష, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో కృషి చేసారు.
          కవిత్వం, అనువాదం, వ్యాసం ఇలా పలు ప్రక్రియల్లో రచ నలు చేసాడు. బంకించంద్ర ''ఆనందమఠ్‌'' నవలను తెలుగు లోకి అనువదించాడు. ఇటలీ జాతీయోద్యమకారుడు గారీబాల్డీ జీవిత చరిత్ర రచించాడు. ''రోమన్‌ సామ్రాజ్య చరిత్ర'' సగ భాగం రాసాడు. ఇవేవీ ముద్రణకు నోచుకోలేదు. బొంబాయి నివాసి చింతామణి వైద్య రచించిన ''ఎపిక్‌ ఇండియా'' లోని వ్యాసాలకు హనుమంతరావు చేసిన తెలుగు అనువాదం ''క్షాత్రకాలపు హింద్వార్యులు'' 1927లో ముద్రణ పొందింది. ''మహా భారత సమీక్షణము'' కూడా చింతామణి వైద్య రచనకు అనువాదమే. పార్సీ కవులను పరిచయం చేస్తూ మాడపాటి అనేక వ్యాసాలు రాసాడు. మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను రాస్తూ ఆదిరాజు వీరభద్రరావు ''ఆంద్రములో కథానికలు నూతన పద్ధతుల మీద మొట్టమొదట రాసిన కీర్తి హనుమంత రావుకి దక్కవలసి యున్నది'' అని అన్నాడు. గురజాడ రాసిన ''దిద్దుబాటు'' కథ ''ఆంధ్ర భారతి''లో 1910లో అచ్చయితే మాడపాటి ''హృదయశల్యము'' కథ అందులోనే 1912 జనవరిలో అచ్చయింది. మాటపాటి కథల్లో ''నేనే'', ''హృదయశల్యము'' అను రెండు కథలు స్వతంత్రమైనవి. మిగ తావి అనువాదములు. ప్రేమ్‌చంద్‌ ఉర్దూలో రాసిన కథలకు స్వేచ్ఛానువాదాలు. తెలంగాణ సాహిత్యంపై ప్రేమ్‌చంద్‌ ప్రభావం అధికం. మాడపాటి వాటిని అనువదించాడు. హృదయ శల్యము, రాణీసారంథా, ముసలిదానియుసురు, నేనే, అగ్నిగుండము, నాడు నీ పంతము-నేడు నా పంతము, ఆత్మార్పణము అను ఏడు కథలను సంకలనంగా ''మల్లికాగుచ్ఛము'' అను పేరున మచిలీపట్టణములోని సరస్వతీనికేతనం వారు 1915లో వెలువరించాడు. ''విధి ప్రేరణము', ''ఎవరికి'', అన్న కథలను అణాగ్రంథమాల-హైదరా బాదు వారు ప్రచురించాడు. ''న్యాయమా'', ''ఎవరిది తప్పు'', ''ఇక కావలసినదేమి'', ''నిజమేనా'' అన్న కథలు సుజాత, శారద మాస పత్రికలో వచ్చాయి. తెలంగాణ తొలితరం కథకులలో వీరిది ప్రథమ స్థానం, స్వయం కల్పితమైన వీరి ''హృదయ శల్యము'' చారిత్రక కథ గా కనిపిస్తుంది. ఇది సంస్కరణ బాటన నడచింది. ఆడవాళ్ళ శీలాన్ని శంకించే మగవాణ్ణి వస్తువుగా చేసికొని ఈ కథ రాసాడు. భార్యా భర్తల మనస్తత్వాన్ని చక్కగా చిత్రించాడు. ఓరుగల్లు, రాణిరుద్రమ, అంబాల, రుద్రవరం మొదలగు ప్రాంతాల చిత్రణ వల్ల తెలంగాణ స్థానీయత కథలో కనిపిస్తుంది. శిష్ట వ్యవహారికం వాడటం వల్ల ఆనాటి భాషావిధానం తెలుస్తుంది. స్త్రీజనోద్దరణ, స్త్రీ విద్య అనే భావాలు కథల్లో కనిపిస్తాయి. సామాజికో ద్యమాల్లో పాల్గొన్న మాడ పాటి కథల్లో సంఘ సంస్కరణ భావాలు కనిపిస్తాయి. 'నేనే' కథ అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది కొసమెరుపు కథ. శిల్పపరంగా ఈ కథ ఆనాటికి కొత్త పుంతలు తొక్కింది. ''మల్లికా గుచ్చము''లో ఏడు కథలు మాత్రమే ఉన్నవి. మాడపాటి శత జయంతి కానుకగా ఆంధ్రసారస్వత పరిషత్తు ''మల్లికాగుచ్ఛము' సంకలనానికి, ''ఎవరిది తప్పు'', ''ఎవరికి'', 'విధప్రేరణ'' అనే మూడు కథలను కలిపి ప్రచురించింది. ఆ తరువాత అదే పుస్తకాన్ని నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, 2017లో ''మాడపాటి హనుమంతరావు కథలు'' అను పేర ప్రచురించింది. ఆంధ్రపితామహు డనే పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్‌ 11న 86వ ఏట మరణించాడు.
          మాడపాటి హనుమంతరావు తన కథలను ''రంగము''లుగా విభజించుకొని రాశాడు. కథనం చాలా వరకు ''సర్వసాక్షి'' దృష్టి కోణంలో సాగుతుంది. కథలన్నిటిలో గ్రాంధిక భాష పరచుకొని ఉంది. ఒక్కొక్క రంగంలో పాత్రలను ప్రవేశపెట్టడం, సంఘటనలను సృజించడం, మలుపు తిప్పడం చేశాడు. అందుకే కథలు సుమారు ఏడు రంగముల వరకు కొన్ని విస్తరించాయి. వీరికి వర్ణనలపై ప్రీతి ఎక్కువ. పాత్రవర్ణన, స్థలవర్ణన, కాలవర్ణన, స్వభావవర్ణన ఇలా ప్రతి కథలో వర్ణనలు తారసపడతాయి. అవి కథా గమనానికి ఎక్కడా అడ్డుపడవు. శైలి పరంగా గ్రాంధిక భాషకు, శిల్ప పరంగా వర్ణనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మానసిక దౌర్భల్యము, ధృడత్వము గల స్త్రీ పాత్రలను ప్రవేశపెట్టి, కథల్లో నాటకీయతను, చక్కగా పండిం చాడు. వివిధ రకాల మానసిక ప్రవృత్తులు గల మనుషులు కథల్లో కనిపిస్తారు. వారి చర్యలు అనూహ్యములు. భార్యాభర్తల మధ్య సాగే సంవాదములో భాగంగా ఒక చోట, కథకుడే మరొకచోట, కథా గమనంలో భాగంగా ఒకసారి, ఇలా పాత్రల గుణగణాల్ని ఎరుక పరచడం మాడపాటికి ఇష్టవ్యాపకం.
గీ|| పడఁతి యొక్క దానివిడిచి యించుక యమృ
తంబులేదు భువి విషంబు లేదు - భర్తృహరి
పై పంక్తులతో ''హృదయశల్యము'' కథ మొదలవుతుంది. ఈ పంక్తులు కథను సమర్థించేవిగా ఉన్నవి అలా కథా ప్రారంభం కుదిరింది. అలాగే ''ముసలిదాని యుసురు'' అనే కథ
గీ|| దీనయగునాడుదాని దుఃఖానలమునఁ
బాడుకాలేదె బాగ్దాదు పట్టణంబు!
అనే చరణాలతో మొదలువుతుంది. వీటి తాత్పర్య విస్తృతి కథలో కనపడుతుంది. కథ విషాదాంతమగుతుంది. కథ ద్వారా ఈ వాక్యాల మర్మం రుజువౌతుంది.
ఉ|| కంటికి నిద్రవచ్చునె ? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్‌
వంటక మిందునే ? యితర వైభవముల్‌ పదివేలు మానసం
బంటునె మానుషంబుగల యట్టి మనుష్యున కెంతవానికిన్‌
కంటకుఁడైన శాత్రవుఁడొకండు తనంతటి వాఁడు గల్గినన్‌
(కాశీఖండము)
          ''అగ్నికుండము'' అనే కథకు ముందు ఈ పద్యం ఉంది. కథరాసి పద్యాన్ని ఎన్నుకున్నాడా, లేక ఈ పద్యాన్ని చూసి కథ రాశాడా అనే మీమాంస పాఠకుడికి కల్గుతుంది. కథ ప్రారంభంలోనో, కథ ముగింపులోనో పద్య పాదాల నుంచి కథా రచన చేయడం ఇతని శిల్పరహస్యం. ఈ పద్ధతి ఇతనితోనే మొదలయింది. కథకు సరి పోయే పద్యాన్ని ఎన్నుకొని కథకు అనుసంధానించడం కొత్త ప్రయోగం. ''ఆత్మార్పణము'' కథకు ముందు భారతములోని శల్య పర్వము నుంచి పద్యం ఎన్నుకొన్నాడు. ఇలా ఒక కొత్త ఒరవడికి అంకురార్పణ చేశాడు. విషయాన్ని ''రంగము'' లుగా విభజించి రాయడం వీరి ప్రణాళిక. భాష విషయములో వీడు గ్రాంధిక భాషా వాది. ప్రాచీన భాషా పరిమళాలు, కథలయందున్నవి. గ్రాంధిక మైనను, పఠనమునకు ఆటంకము కలగదు. ఈనాటి వారికి కొంత అనాసక్తి కలుగును. చాలా కథల్లో వస్తువు రాజులకాలం నాటిది. భాష కూడా ఆనాటి గ్రాంధికమే వాడినాడు. కొన్ని కథల్లో శిష్టవ్యావ హారిక భాష కనపడుతుంది. సనాతన సంప్రదాయము, ఆలోచన వీరి శైలికి వెన్నెముకను ఇచ్చినవి.
          ప్రతి రచయితకు ఒక తాత్విక దృష్టి ఉంటుంది. రచనను అది ప్రభావితం చేస్తుంటుంది. ఆ ప్రభావమే రచయిత ప్రాపంచిక దృక్ప థాన్ని నిర్ణయిస్తుంది. మాడపాటిపై ఇతిహాస పౌరాణిక సాహిత్య ప్రభావం, సనాతన ధార్మిక ప్రభావాలు ఉన్నాయి. ''నాఁడు నీ పంతము! నేఁడు నా పంతము!' అనే కథలో ''మానవునకు జాతీయ ధర్మము సర్వధర్మములలో నుత్కృష్టతమమైనదే కాని, యొక్కొక్క ప్పుడసామాన్యస్థితులందు సంఘమును వ్యక్తి కొఱకు వదలవలసి వచ్చును''అని అంటాడు. ఈ మాట చెప్పడానికి అతను రామాయణాన్ని ఆధారం చేసికొన్నాడు. రామాయణంలోని ఒక విషయాన్ని ఇలా అన్వయిస్తున్నాడు.
          ''అయోధ్యానగరమున వసించి, తన ప్రజలకు సుఖము లభింపఁజేయుట శ్రీరామచంద్రుని సాంఘిక కర్తవ్యమై యుండియు, అతడు పితృవాక్యపాలనము కొఱకు దానిఁదృణీకరించెను! అయోధ్య వాసులెవ్వాని దమ భాగ్యదేవతగ భావించుచుండిరో యట్టి శ్రీ రామునిఁ బట్టాభిషక్తునిఁ జేయుట దశరథునికి సాంఘిక ధర్మమైయుండియు, నతఁడద్దాని వ్యక్తి విషయకమగు స్వీయ ధర్మమునకై విడిచిపెట్టెను!''
          పై పేరాలోని విషయము మాడపాటి దృక్పథ విశిష్టతను తెలు పుతుంది. ఇదియే అతని కథావస్తువు ఎంపికలోను, కథా సంవిధాన ములోను కనిపిస్తుంది. కథావస్తువుకు తగిన భాష వచ్చి చేరింది. రాచరికం, దేశభక్తి, శరణాగత ధర్మము, స్వజనరక్షణ, ప్రతిజ్ఞాపాలన, సమరోత్సాహము, త్యాగభావము, స్వదేశీభావన, విదేశీభావన, రాజ ధర్మము, క్షత్రియధర్మము, జాతీయధర్మము, వీరధర్మము, పాతివ్రత్య ధర్మము, ఆత్మగౌరవము, వంశప్రతిష్ఠ, సమభావన, ఆదర్శభావన, జాతిఔన్నత్యము, విధిచింతన, వ్యక్తి అంతర్మధనం, వ్యక్తి నిర్మాణము, ఆధ్మాత్మికత, న్యాయపాలన, శత్రువులు-కుట్రలు, సతీసహగమనము మొదలగు విషయాలు-విలువలు కథల్లో ప్రధానపాత్ర పోషిం చాయి. ''చారిత్రక దృష్టి'', ''విషాదాంత వైఖరి'' రెంటిని పనిముట్లుగా చేసికొని కథాసేద్యం చేసాడు. కథల్లో నాటకీయతను పండించాడు.
          మాడపాటిలో సంఘసంస్కరణ దృష్టి కూడా ఉంది. అది కథల్లో కనపడుతుంది. అంటరానివారి పట్ల సహానుభూతి చూపించి, వారి అభివృద్ధికి బాటలు వేసిన ''శ్యామసుందరుడు'' అనే వ్యక్తిని పాత్రగా చేసి కథ రాసాడు. మహాత్మాగాంధి బోధనల ప్రభావం వీరి రచనల్లో కనిపిస్తుంది. మాడపాటిలో సంఘసంస్కరణ దృష్టియే కాదు, స్త్రీ జనాభ్యుదయ కాంక్ష కూడా ఉంది. ''ఎవరిది తప్పు'' అనే కథలో సుందరమ్మ అనే పాత్రచే ఇలా పలికిస్తాడు.
''నేను ఆడదానను. పనిబడిన యెడల అగ్ని గుండములో దుముకగలను. స్త్రీలు సుకుమారులను మాట పురుషుల కల్పనము. వారిని అబలలని, సౌకుమార్యము కలవారు అని, వారిని చేతగాని వారిగా జేసియున్నారు. మనము దుర్భలులము అయిన కావచ్చును గాని మానసము దుర్భలము కాదు. వారి ధైర్యసాహసములను జీవితమందలి ఎట్టి అవాంతరములైనను లొంగదీయలేవు.''
          మాడపాటిలో అనేక భావాలు కొలువు దీరాయి. హైదరాబాదు సంస్థాన సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో చురుకుగా పాల్గొని, నడిపించాడు. రాజనీతి, సంస్కరణ, స్త్రీవిద్య, చరిత్ర, భాష, సాహిత్యం మొదలగు రంగాలలో కృషి చేసాడు. ఆ అనుభవం, దిశానిర్దేశనం, వీరి సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. దివానీ (సివిలు) వ్యవహారము, ఫౌజ్దారి (క్రిమినలు) వ్యవహారము అనే మాటలు నాటి సంస్థానపు సంఘవాతావారణమును పట్టిస్తాయి. 'నోరుగల వానిది యూరు'', ''ఇక్కడదప్పించుకుంటివి గానీ, అక్కడ దప్పించుకుం టావా'' లాంటి నానుడులు నాటి ప్రజల ఆలోచనల్ని మన ముందుం చుతాయి. ''అనురాగ ఖడ్గము'', ''పచ్చికచే ముట్టడింపబడియున్నది'' లాంటి పదబంధాలు, వాక్యాల్లోని కవితాత్మ మాడపాటి సృజనకు మచ్చుతునక. ద్విచక్రిక (బైసికిలు), యక్షిణీదీపము (మాజిక్‌ లాంతరు) రక్షక పర్యవేక్షకుడు (పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌) యుష్ణమాపకము (ధర్మామీటరు) మొదలగు పదాలు పాఠకునికి ఆసక్తిని పంచుతాయి. వచనంలోని వ్యంగ్య వైభవము చదవరి ఆలోచనా శక్తిని పెంచుతుంది. మొత్తంగా ఇతని కథలు నాటి కాలపు ఆనవాళ్ళు.

- బి.వి.ఎన్‌. స్వామి, 9247817732

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.