Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒకనాటి పోరాటాలకు వేదికగా వరవర రంగనాయక భాషా నిలయం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 12,2023

ఒకనాటి పోరాటాలకు వేదికగా వరవర రంగనాయక భాషా నిలయం

           స్వాతంత్య్రోద్యమంలో కానీ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ... గ్రంథాలయాల పాత్ర ఎనలేనిది... నాటి నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రంథాలయాలను ముఖ్య వేదికగా చేసుకున్నారు. ప్రజలకు అక్షర జ్ఞానం కల్పించడమే కాదు.. వారు ఎదుర్కొంటున్న దోపిడీని అర్థమయ్యేలా చేసేందుకు గ్రంథాలయాలే ముఖ్య పాత్ర పోషించాయి. ఆనాడు గ్రంథాలయాల నిర్వహణ ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ.. కొందరి దాతల ప్రోద్భలం... ఔత్సాహిక యువకుల చొరవతో విజయవంతంగా కొనసాగించారు. అలా మొదలైన చాలా గ్రంథాలయాలు కాలక్రమేణా కొన్ని కనుమరుగైనప్పటికీ కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి... అలాంటి వాటిలో ఓ గ్రంథాలయమే వరవర రంగనాయక భాషా నిలయం!
           హుజూర్నగర్‌ తాలూకాలోని గణపవరం గ్రామంలో 1941 లో వరవర రంగనాయక భాషా నిలయాన్ని (గ్రంథాలయం) స్థాపిం చారు. తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, నిజాం వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం సష్టించి అనేక సాంఘిక, సాంస్కతిక పోరాటాలకు, తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసాయి. చిలుకూరులో 1941లో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభ (రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా పులిజాల వెంకట రంగారావు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా) ప్రభావం వల్ల హుజూర్‌నగర్‌ పరిసర గ్రామీణ ప్రాంతాలలోనూ యువకులు, మధ్యతరగతి మేధావులు చైతన్యవంతులై గ్రంథాలయాలు స్థాపిస్తున్న సందర్భం అది. తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు భాషాభివద్ధికి పోరాటం జరుగుతున్న సందర్భం కూడానూ. ఈ సందర్భంలో 1941లో జాబిశెట్టి చంద్రయ్య, ఇర్ల వెంకటరెడ్డి, కత్తి రంగయ్య నాయుడు, ఇంటి అంజయ్య నాయుడు, పోతరాజు బజార్‌, యమా సత్యనారాయణ, కొట్టా రామయ్య తదితరులు కలిసి ఈ గ్రంథాలయ స్థాపనకు పూనుకున్నారు.
           1941 నాటికి మారు మూల ప్రాంతమైన గణపవరం గ్రామంలో గ్రంథాలయం స్థాపించడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికే ఆ ప్రాంతంలో అక్షరాస్యుల సంఖ్య అంతంత మాత్రమే. అయినప్పటికీ ఆ గ్రంథాలయ స్థాపనకు పూనుకున్నారంటే కారణం ఆ ప్రాంతం సమావేశాలకు కూడలి కావాలని, అభిప్రాయాలు పంచుకోవడానికి సమావేశ మందిరం కావాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి కార్య స్థలం కావాలని, చదువు నేర్చుకోవాలనే ప్రధాన ఉద్దేశం వంటి ఆకాంక్షలతో ఈ గ్రంథాలయ స్థాపన జరిగింది.
           అప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం, నీలగిరి గ్రంధాలయాలు స్థాపితమయ్యాయి. వీటిని ఉపయోగించుకొని ముఖ్యంగా రాత్రి సమయాలలో ఉపయోగించుకొని చైతన్యవంతులై నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఉదతంగా పాల్గొన్నారు. ఈ గ్రంథాలయాల ప్రభావం కూడా గణపవరం గ్రంథాలయ ఏర్పాటుకు నాంది పలికింది. ఈ గ్రంథాలయ ఏర్పాటుకు మరొక ప్రధాన కారణం కోదాటి నారాయణరావు ప్రభావం. ఆయన అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అనేక గ్రంథాలయాలు స్థాపించి గ్రంథాలయాల ఉన్నతికి సేవ చేస్తున్నారు. అంతేకాదు ఆయన స్వగ్రామం ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడం కూడా. తొలుత ఈ భాషా నిలయాన్ని గుడిసెలోనే ఏర్పాటు చేశారు. ఆనాడు నిరంతరం జరుగుతున్న సాంఘిక, రాజకీయ విషయాలు చర్చించుకునేందుకు ఈ గ్రంథాలయం వేదికగా మారింది. దీంతో ఈ గ్రంథాలయాకి పక్కా భవనం నిర్మించాలని ప్రయత్నం చేయగా 1950 దశకంలో ఇర్ల వెంకటరెడ్డి గ్రంథాలయ భవనానికి ఆర్థిక సహకారాన్ని అందించారు. 1951 జులై 10 నాటికి 4 గుంటల భూమిని సేకరించారు. ఇందులో సగం భూమి దానంగా మరికొంత భూమిని ప్రజల నుంచి చందాల ద్వారా వసూలు చేసిన సొమ్ముతో కొనుగోలు చేశారు. దీనికి వరవర రంగనాయక భాషా నిలయం అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో వరవర రంగనాయక దేవాలయం ఉండడమే. ఇది కాకతీయుల కాలం నుంచి ప్రాశస్తమైన దేవాలయం. ఈ దేవాలయం పేరు మీద గ్రంథాలయంతో పాటు వర వర రంగనాయక నాట్యాలయం కూడా ఉండడం గమనించదగ్గ విషయం.
           1947 మార్చి 28 ఏడాది చందా కింద కృష్ణాపత్రికను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆంధ్రపత్రికతో పాటు మరికొన్ని పత్రికలు అందుబాటులో ఉండే ఏర్పాటు చేశారు. అయితే 1947 ఏప్రిల్‌ 24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం తరుపున పాడిపంటలు అనే పత్రికను ఏడాది పాటు ఉచితంగా అందించారు. 1955 కాలంలో అంబూరి వరద రెడ్డి, కొండపల్లి రాజగోపాల్‌, ఈర్ల గోపిరెడ్డి, పొడి శెట్టి వీరయ్య, గాయం గోవిందరెడ్డి, జాబిశెట్టి రామయ్య, కొండపల్లి వెంకట రంగయ్య, దేవరశెట్టి లచ్చయ్య, ఓరుగంటి రాములు, యామా సత్యనారాయణ, సాధు సత్యనారాయణ, రాచ సూర్య నారాయణ పోతుగంటి వీరయ్య వంటి పెద్దలు ఈ గ్రంథాలయ ఉన్నతికి ఇతోదిక సేవలు అందించారు. ప్రతి ఏడాది సభలు సమావేశాలు ఏర్పాటు చేసి గ్రంథాలయ ఉన్నతికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేవారు. అదేవిధంగా జాతీయ నాయకుల జయంతులు, వర్థంతులు, కవి సమ్మేళనాలు, జాతీయ పండుగలు ఘనంగా నిర్వహించేవారు. ముఖ్యంగా 1947 నుంచి 55 వరకు ప్రతి జాతీయోద్యమ నాయకుల జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించి ఆ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర మహాసభ నాయకులను సన్మానించే వారు. రాను రాను గ్రంథాలయానికి వస్తున్న చదువుల దష్ట్యా గ్రంథాలయాన్ని ఉన్నతీకరించాలి. గ్రంథాలయ అభివద్ధికి ద్రవ్యాన్ని సేకరించాలి. నూతన పుస్తకాలను కొనుగోలు చేయాలి. అందుకోసం రాము చందాలు సేకరించే ప్రయత్నం చేశారు.
           తత్వశాస్త్రం, నవలలు, కథలు, పురాణాలు ఇతిహాసాలు, చారిత్రక పుస్తకాలు, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అందుబాటులో ఉండేవి. వీటితో పాటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం వారి సహకారంతో 150 పుస్తకాలు దానంగా స్వీకరించారు. 1955 నాటికి ఈ గ్రంథాలయం దగ్గర ఉన్న ద్రవ్య నిధి రూ.3000. ఇవి ప్రజల నుంచి స్వీకరించినవే. ప్రతి ఏటా రూ.250 దిన, మాస, వార పత్రికలకు కేటాయిస్తూ వచ్చారు. ఆంధ్ర పత్రిక, కష్ణా పత్రిక, కొన్ని గోల్కొండ పత్రికలు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, కూడా అందుబాటులో ఉండేవి. ఆనాటికి ఈ గ్రంథాలయంలో 622 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. టీవీ రాఘవరావు హుజూరాబాద్‌ తాలూకా కాంగ్రెస్‌ సెక్రెటరీ ఈ గ్రంథాలయానికి కుర్చీలు, బల్లాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు. కోదాడ మాజీ సర్పంచ్‌ అప్పయ్య, కమ్యూనిస్టు నాయకుడు స్థానికం కష్ణారెడ్డి గ్రంధాలయ ఉన్నతికి సేవలందించారు.
1951 ఆగస్టు 1న జగ్గయ్యపేట నేతాజీ చౌక్‌ విజయ స్టోర్స్‌ నందు రెడియోను కొనుగోలు చేశారు. తదుపరి రేడియో కోసం లైసెన్స్‌ అప్లై చేయగా 1952 ఫిబ్రవరి 6 వరకు లభించలేదు. 1951 నుంచి 1968 వరకు నిత్యం సాయంత్రం పూట దేశంలో జరుగుతున్న విషయాలను, వార్తలను, సాంస్కతిక కార్యక్రమాలను గ్రామ పంచాయతీ దగ్గర ప్రజలు వినేవారు. 1958, 59 కాలంలో నెలకి ఒకసారి హరికథ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. నానాటికి పెరుగుతున్న చదవరుల దష్ట్యా 1954 అక్టోబర్‌ 18న రూ.300 పుస్తకాలు జగ్గయ్యపేట నుంచి కొనుగోలు చేశారు. తదనంతర కాలంలో ఆర్థిక వనరుల లేమి కారణంగా ఈ గ్రంథాలయం కొద్ది కాలం పాటు (రెండేండ్లు) అనుకున్నంత స్థాయిలో సేవలు అందించలేకపోయింది.
           ఆ ప్రాంతంలో ఉన్న యువకుల సహాయ సహకారాలతో తిరిగి గ్రంథాలయాన్ని పునర్‌ వైభవం తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రాంతంలో ఉన్న దాతల సహకారంతో పక్కా భవనం నిర్మించారు. దాదాపు దశాబ్దం తర్వాత చదువరుల రద్దీ దష్ట్యా ఈ గ్రంథాలయ భవనం పైన ఇంకొక భవనానికి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు ఈ ప్రాంత వాసి నర్సింగ్‌ యాదవ్‌. 1963 జనవరి 26న ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. 1980 వరకు ప్రభుత్వ ఆధీనంలో గ్రంథాలయం సేవలందించింది. తదనంతరం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ గ్రంథాలయ సేవలు కుంటు పడిపోయాయి. గ్రంథాలయం పై కప్పు పాడైపోగా, మరమ్మతులు చేయించి 1984 ఏప్రిల్‌లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాల కష్ణయ్య, డా. సమరం తిరిగి భవానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది గ్రంథాలయ సావనిర్‌ కూడా అచ్చు వేశారు.
ఈ ఊరుకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే 1940 నుంచి 1980 వరకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ రాజకీయ కక్షలతో, భావజాలాలతో నిత్యం ఘర్షణ పడుతున్న సందర్భం... ఈ ప్రాంతంలో వామపక్ష భావజాల పార్టీలు ఉన్నా, కాంగ్రెస్‌ పక్ష భావజాల పార్టీలు ఉన్నా, ఎంతో ఐక్యత ఉండేది. ఎంతగా అంటే సమితీలు ఏర్పడిన నాటి నుంచి 1983 వరకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా నాయకులను ఎన్నుకునేవారు. ఐక్యతకు వరవర రంగనాయక భాష నిలయం కూడ ఒక ప్రధాన కారణం.
           ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి వట్టికుటి వెంకటేశ్వర్లు కార్యదర్శిగా ఉన్నారు. గ్రంథాలయ కమిటీ సహకారంతో చక్కటి సేవలందిస్తున్నారు. చందాలు వసూలు చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేసి చదువురులకు గ్రంథాలయం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 3000 పుస్తకాలు 20 దిన, మాస, వార, త్రైమాసిక పత్రికలు అందుబాటులో ఉన్నాయి.
           ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ గ్రంథాలయాన్ని ఉన్నతీకరించాలనే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత చదువరులకు ఉపయోగపడే పుస్తకాలను, జర్నల్స్‌, దినపత్రికలు, ముఖ్యంగా నేటి పోటీ పరీక్షలకు, ఉన్నత చదువులకు ఉపయోగపడే పుస్తకాలను, అదేవిధంగా ప్రస్తుత చదువులకు అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయంలో అంతర్జాల సౌకర్యాన్ని కల్పించి ఆ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్‌ సమాచారాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ గ్రంథాలయానికి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రీడింగ్‌ రూమ్స్‌కు అందించే నామ మాత్రపు ఆర్థిక సహాయం (దినపత్రికలకు, గ్రంథపాలకునికి) అందించాలని కోరుకుందాం. ఈ గ్రంథాలయానికి కావాల్సిన మౌలిక వసతుల కోసం, పుస్తకాల కోసం, సహాయ సహకారాలను దాతల నుంచి స్వీకరిస్తున్నారు.

- డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.