Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కమ్మని కథల బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 12,2023

కమ్మని కథల బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి

       నల్లగొండ జిల్లా నుంచి బాల సాహిత్యం రాస్తున్న నేటి తరం బాల సాహిత్యకారుల్లో కవి, రచయిత, బాల సాహితీవేత్త, కార్యకర్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ఒకరు. 'కొబురె'గా సాహితీవేత్తలకు పరిచితుడైన వీరు వృత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడైనా, రచయితగా తెలుగు పిల్లల కోసం సాహిత్య సృజన చేస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బుచ్చిరెడ్డి కార్యకర్త కూడా.
           కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి జూన్‌ 16, 1969లో నల్లగొండ జిల్లా మేళ్ళదుప్పలపల్లిలో పుట్టారు. తల్లితండ్రులు సత్తెమ్మ, మల్లారెడ్డి. ఎం.ఎ., బి.ఇడితో పాటు న్యాయశాస్త్రంలో పట్టా పొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చండూరులో టీచర్‌గా పని చేస్తున్నారు. కవి, కథా రచయిత, వ్యాసకర్త, బాల సాహితీవేత్త అయిన బుచ్చిరెడ్డి విద్యాశాఖలో మండల రిసోర్స్‌ పర్సన్‌గా, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేశారు. పదేండ్లు రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రిసోర్స్‌ పర్సన్‌గా విద్యాశాఖ మంత్రి చేతులుమీదుగా పురస్కారం అందుకున్నారు. విద్యాశాఖ నడిపిన బాలల మాస పత్రిక 'జాబిలి' సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. నల్లగొండ జిల్లా బాలలు రాసిన సాహిత్యానికి వేదికగా నిలిచిన ఈ పత్రిక వందలాది మంది బాల రచయితలకు వేదికగా నిలిచింది. ఈ జిల్లా నుంచి సేకరించి పంపిన రచనలు 'లేత గులాబీలు'గా వెలువడ్డాయి.
           బాలల సాహిత్య వికాసం ఇవ్వాళ్ళ తెలంగాణలో విస్తృతస్థాయిలో జరుగుతోంది. వందలాది మంది బాల బాలికలు కవులు, రచయితలుగా తమ రచనల ద్వారా పరిచయం అవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఈ ఉద్యమం సాగుతోంది. కార్యకర్తగా పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పనిచేస్తున్న కార్యకర్తల్లో బుచ్చిరెడ్ది ఒకరు. వందలాది పిల్లలచే రచనలు చేయించడమేకాక వాటిని అచ్చువేసుకోవడంలో తోడ్పడుతున్నారు. బాలచెలిమి ఇటీవల తెచ్చిన తెలంగాణ బడిపిల్లల కథలలో బుచ్చిరెడ్డి పాఠశాల చండూరు విద్యార్థులు మల్లీశరి, కార్తీక్‌లు రాసిన కథలు అచ్చయ్యాయి.
           ఉపాధ్యాయునిగా పిల్లల కోసం తపించే బుచ్చిరెడ్డి పిల్లల చేతిరాత అందంగా ఉండేందుకు శిక్షణను ఇవ్వడమేకాక, పిల్లల కోసం 'మార్గదర్శి' పేరుతో అందమైన చేతిరాత వికాసం కోసం పుస్తకం రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన కవితలను 'ఢమరుకం' పేరుతో సంకలనం చేసి ప్రచురించారు. ఇది నాలుగు వందల తెలంగాణ కవుల స్వర ఢమరుకం. కవిగా బుచ్చిరెడ్డి తెచ్చిన కవితా సంపుటి 'ధీరుల మొగసాల'. ఇదే కాక 'మనం-మన బతుకమ్మ' పేరుతో రాసిన పాటలు వీరికి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా మన ప్రాచీన ఆటల గురించి రాసిన 'అష్టా-చెమ్మ', 'ముక్కుడు గిచ్చుడు', 'దాగుడు మూతలు' వంటివి ప్రాచుర్యం పొందాయి. ఉపాధ్యాయునిగా, రచయితగా పలు గౌరవాలు, సత్కారాలు అందుకున్న వీరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ వారిచే ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఖమ్మం కలెక్టర్‌ ద్వారా ఉగాది పురస్కారం వంటివి అందుకున్నారు.
           బాలల కోసం, బాలల సాహిత్య వికాసం కోసం నల్లగొండ కేంద్రంగా పనిచేస్తున్న కొమటిరెడ్డి బుచ్చిరెడ్డి పిల్లల కోసం మూడు వందలకు పైగా కథలు, బాల గేయాలు, వ్యాసాలు, సమీక్షలు రాశారు. సాహిత్య, సామాజిక రంగాల్లో సమానంగా పని చేస్తున్న బుచ్చిరెడ్డి కథలు, కవిత్వంతో పాటు పిల్లల కోసం రాసిన గేయాలు, కథల్లోంచి ఎంపికచేసిన కథలతో తెచ్చిన బాలల కథా సంపుటి 'మొలకలు'. ఇది ముప్పై రెండు కథల సంపుటి. ఇందులోని కథలన్నీ మీవి, మావీ అంటూ చెబుతారు రచయిత. ఇందులోని 'బుగ్గ-బుడత' కథ పిల్లల్ని అతి గారాబం చేసే తల్లితండ్రుల గురించి అతి సున్నితంగా చెప్పిన కథ. ఇందులోని బుడతడు గాలి బుగ్గలు కావాలని మారాం చేయగా, ఆరు కొనిస్తారు. గాలి వచ్చి వాడు ఎగిరిపోతాడు. కొబురె సమయ స్ఫూర్తి, కథా కల్పనకు ఇదే సంపుటిలోని 'కోడి-గద్ద' కథ చూడవచ్చు. ఇందులో కోడి-గద్దల జాతి వైరాన్ని గురించి చెబుతాడు రచయిత.
           ఈ కథల్లోని వస్తువు విషయంలో, ఎంచుకున్న పాత్రల వంటి వాటిలో వైవిధ్యాన్ని చూడవచ్చు. ఒక్కో కథలో నీతి, పిల్లలకు బోధించాలన్న తపన మనకు కనిపిస్తాయి. 'తెలివి ఒకరి సొత్తుకాదు' కథలో ఒక జిత్తులమారి నక్కకు తన తెలివితో బుద్ధి చెప్పి చిలుక కథ యిది. ఇదే కోంలో రాసిన మరో కథ 'తెలివైన చిన్నోడు'. ఇది పిల్లల్లోని సమయస్ఫూర్తికి నిదర్శనం. ఇందులోని పిల్లవాడు తన తెలివితో పెద్దలందరిని రప్పించి, చిరుతను జూ అధికారులకు అప్పగించడం కథ. కవి, రచయిత, ఉపాధ్యాయుడు, బాల వికాస కార్యకర్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి బాలల కోసం రాసిన గేయాలు, వ్యాసాలు త్వరలో అచ్చులోకి రావాలని మనమూ కోరుకుండాం. జయహో! బాల సాహిత్యం.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.