Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ట్రాజెడీ క్వీన్‌ పర్వీన్‌ బాబీ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 02,2023

ట్రాజెడీ క్వీన్‌ పర్వీన్‌ బాబీ

          ఆమె పేరు సినీ పరిశ్రమకు తెలియకముందే అద్భుతమైన మోడల్‌ గా సౌందర్యారాధకులకు చిరపరిచితమే. అది ప్రచార ప్రపంచానికి బాగా అవసరమైన పేరు. మోడల్‌ రంగంలో ఆమె నిష్ణాతురాలు. కేర్‌ నాట్‌ అటిట్యూడ్‌.. ఫ్లూయెంట్‌ ఇంగ్లిష్‌.. కంప్లీట్‌ క్లారిటీతో పర్వీన్‌ బాబీ అనే ఉత్తుంగ తరంగం ఆ సమయంలో మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా, నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. దర్శకులు కాల్షీట్ల కోసం పోటీ పడ్డారు. పర్వీన్‌ బాబీ గ్లామర్‌ అలాంటిది. ఆమె రాకతో బాలీవుడ్‌ స్క్రీన్‌ కొత్త మెరుపులు సంతరించుకుంది. తెర మీద ఆమె విసిరిన చూపులను.. ఒలికించిన నవ్వులను ఏరుకోవడానికి థియేటర్‌లకు పరిగెత్తిన యువకులు ఎందరో! సినిమా వాళ్లలోనూ ఆమె ఆరాధకులు తక్కువేం లేరు! పర్వీన్‌ కూడా ప్రేమ కోసం పరితపించింది.. ఒంటరిగానే జీవితాన్ని సాగించింది.. చివరికి విషాదంగా ముగిసింది. 1973 నుండి 1983 దాక ఒక దశాబ్ద కాలం పాటు బాలీవుడ్‌లో ఒక పెను సంచలనంగా నిలిచిన పర్వీన్‌ బాబీ ఆ రోజుల్లో తెర మీద, తెర వెనకాల కూడా ఎప్పుడూ వార్తల్లోని వ్యక్తే. పర్వీన్‌ బాబీ గురించి ప్రచారంలో వున్నన్ని కథలు బాలీవుడ్‌ తారల్లో అతి తక్కువ మంది విషయంలో చూస్తాం. పర్వీన్‌ బాబీ తన జీవితాన్ని తాను అనుకున్నట్లు జీవించాలని నిర్ణయించుకోవడం, అలాగే జీవించడం ఆ ట్రాజెడీ క్వీన్‌ లవ్‌ అండ్‌ లైఫ్‌ స్టోరీ. ఇదీ పర్వీన్‌ బాబీ సిగేచర్‌. 55 ఏళ్ళకే తనువు చాలించిన ఈ అందాలరాశి జయంతి ఏప్రిల్‌ 4వ తేది సందర్భంగా పర్వీన్‌ గురించి సోపతి పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
          పర్వీన్‌ బాబీ గుజరాత్‌ లోని జూనాగడ్‌లో ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబంలో 1949వ సంవత్సరం ఏప్రిల్‌ 4 న జన్మించింది. తండ్రి వలీ మహమ్మద్‌ ఖాన్‌ బాబి, జూనాగడ్‌ నవాబు వద్ద కార్యనిర్వాకుడుగా ఉద్యోగం చేస్తుండేవాడు. తల్లి జమాల్‌ బక్తే బాబి గృహిణి. వారికి పెళ్ళయిన పద్నాలుగేళ్ళ తరువాత కలిగిన ఏకైక సంతానం పర్వీన్‌. పర్వీన్‌ బాబీ పూర్తి పేరు 'పర్వీన్‌ సుల్తానా వలీ మహమ్మద్‌ ఖాన్‌ జీ బాబీ'. పర్వీన్‌ కు పదేళ్ళ వయసున్నప్పుడే తండ్రి మరణించాడు. పర్వీన్‌ బాబీ అహ్మదాబాద్‌లోని మౌంట్‌ కార్మెల్‌ హైస్కూలులో విద్యనభ్యసించి, సెయింట్‌ జేవియర్‌ కళాశాల ద్వారా ఇంగ్లీష్‌ సాహిత్యంలో 'బ్యాచెలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌'లో పట్టా తీసుకుంది. 1972లో పర్వీన్‌ బాబి మోడలింగ్‌ వృత్తిలోకి దిగింది. మోడలింగ్‌ వృత్తిలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ వుండగా బాలీవుడ్‌ నుంచి ఆమెకు తెరవేలుపుగా వెలిగే పిలుపొచ్చింది. 'చరిత్ర' సినిమాలో నటించమని దర్శకనిర్మాత బి.ఆర్‌. ఇషారా ఆహ్వానం మేరకు మోడలింగ్‌ నుండి సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
చరిత్ర సినిమాతో సినీరంగంలోకి
1973 వ సంవత్సరంలో నాగి ఎంటర్‌ ప్రైజెస్‌ సమర్పణలో బి.ఆర్‌.ఐ ఆర్ట్స్‌ పతాకం మీద ఇషారా నిర్మించిన 'చరిత్ర' సినిమాలో మోడలింగ్‌ రంగంలో కొత్తపుంతలు తొక్కుతున్న సెక్స్‌ సింబల్‌ పర్వీన్‌ బాబీ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా టైటిల్‌ క్రెడిట్స్‌లోనే ఆమె పేరు కింద 'హాటెస్ట్‌ డిస్కవరీ' అని పేర్కొనడాన్ని బట్టి ఆమె మోడల్‌ రంగంలో ఎంతటి విలువగల తారో ఊహించవచ్చు. ఆరోజుల్లో మంచి క్రికెటర్‌గా క్రేజ్‌ సంపాదించిన సలీం దురానీ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. గతంలో ఇషారా నిర్మించిన 'చేతనా' చిత్రానికి ఇది పొడిగింపు వంటిది. అయితే పర్వీన్‌ బాబి అహ్మదాబాద్‌లో అప్పుడు బి.ఎ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ముందు సినిమాల్లో నటించడం ఇష్టం లేకున్నా పర్వీన్‌ బాబి ఆ సినిమాలో నటించక తప్పలేదు. ఈ సినిమాలో విధి వంచితురాలయ్యే ఆమె పాత్ర కూడా భవిష్యత్తులో ఆమె అనుభవించబోయే భావి జీవితానికి అద్దంపట్టేలా వుంటుంది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కానీ, పర్వీన్‌ బాబి విప్పారిన కళ్ళతో సెక్స్‌ సింబల్‌గా పేరుతెచ్చుకుంది. అప్పుడే దర్శక నిర్మాత కిషోర్‌ సాహు పర్వీన్‌ ని 'దుయే కి లకీర్‌' అనే సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. రమేష్‌ అరోరా పర్వీన్‌ సరసన హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. అందులో వాణి జయరాం, నితిన్‌ ముఖేష్‌ ఆలపించిన ''తేరే ఘాయిల్‌ సి ఘేహరీ ఆంఖో మే'' అనే పాట బాగా పాపులర్‌ అయింది. తను నటించిన రెండు సినిమాలు ఫ్లాపులైనా పర్వీన్‌ బాబీ వెంటవెంటనే తొమ్మిది సినిమాల్లో బుక్కయింది. వాటిలో రాజ్‌ తిలక్‌ దర్శకత్వంలో నిర్మించిన '36 ఘంటే' లో హీరో రాజకుమార్‌ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. అయితే 1975లో అమితాబ్‌ బచన్‌ హీరోగా నటించిన రవి టాండన్‌ త్రిల్లర్‌ చిత్రం 'మజబూర్‌' లో పర్వీన్‌ బాబి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌ స్వరపరచిన ''ఆద్మీ జో కెహతా హై, ఆద్మీ జో సున్తా హై'', ''దేఖ్‌ సకతా హూ మై కుచ్‌ భీ హౌతే హుయే'' పాటలు సూపర్‌ హిట్లుగా మారుమోగాయి. 1975లో మరొక సూపర్‌ హిట్‌ చిత్రం 'దీవార్‌' అమితాబ్‌ బచ్చన్‌ తోపాటు పర్వీన్‌ బాబి కి హీరోయిన్‌గా మంచిపేరు తెచ్చిపెట్టింది. యష్‌ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెండవ జంటగా శశికపూర్‌-నీతుసింగ్‌ నటించారు. సలీం-జావేద్‌ రచన చేసిన ఈ సినిమాకు దిలీప్‌ కుమార్‌ 'గంగా జమునా', మెహబూబ్‌ ఖాన్‌ 'మదర్‌ ఇండియా' సినిమాలు స్పూర్తిగా నిలిచాయి. ఈ సినిమాకు ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు వచ్చాయి. తరవాత రవికాంత్‌ నగాయిచ్‌ దర్శకత్వంలో వచ్చిన 'కాలా సోనా'లో ఫిరోజ్‌ ఖాన్‌ కు జంటగా పర్వీన్‌ నటించింది. ఆపై ఎస్‌. రామనాథన్‌ దర్శకత్వంలో నిర్మించిన 'రంగీలా రతన్‌' లో రిషికపూర్‌ సరసన, నరేష్‌ కుమార్‌ చిత్రం 'మజ్దూర్‌ జిందాబాద్‌', 'భన్వర్‌', 'మామా భాంజా' సినిమాల్లో రణధీర్‌ కపూర్‌ సరసన పర్వీన్‌ నటించినా అవి అంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో ఆమె నవకేతన్‌ సంస్థ కోసం విజయానంద్‌ దర్శకత్వం వహించిన 'బుల్లెట్‌' చిత్రంలో దేవానంద్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా కూడా 'మిస్‌ ఫైర్‌' అయింది. 1977లో మన్మోహన్‌ దేశారు దర్శక నిర్మాతగా తొలి ప్రయత్నంగా రూపొందించిన 'అమర్‌ అక్బర్‌ అంథోని' సినిమాలో అమితాబ్‌ కు జంటగా పర్వీన్‌ బాబి నటించింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో పర్వీన్‌ బాబి సూపర్‌ స్టార్‌ స్థాయికి ఒక్కసారిగా ఎగబ్రాకింది. ఇందులో ముఖేష్‌, రఫీ, కిశోర్‌ కుమార్‌, లతామంగేష్కర్‌ అందరూ కలిసి పాడిన ''ఓ హమ్‌ కో తుమ్సే హౌ గయా హై ప్యార్‌'' సినిమాకే హైలైట్‌ గా నిలిచింది. ఈ పాటలో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించడం విశేషం. ''మై నేమ్‌ యీజ్‌ ఆంథోని గోన్సాల్విస్‌'' పాటను పర్వీన్‌ బాబి, అమితాబ్‌ మీద చిత్రీకరించారు. పర్వీన్‌ బాబి ఒక గ్లామర్‌ కలిగిన సెక్స్‌ సింబల్‌ నటిగానే బాలీవుడ్‌ వుపయోగించుకుంది కానీ ఆమెలో వున్న నటనకు అవకాశం ఇవ్వలేదు. అమితాబ్‌ బచన్‌తో పర్వీన్‌ ఎనిమిది సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ ఎనిమిది సినిమాలు సూపర్‌ హిట్లు కావడం విశేషం. వాటిలో 'దీవార్‌', 'సుహాగ్‌', 'కాలా పత్తర్‌', 'అమర్‌ అక్బర్‌ ఆంథోనీ', 'నమక్‌ హలాల్‌' చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ చిత్రాల ద్వారా పర్వీన్‌ హిందీ చిత్రసీమలో సౌందర్యదేవతగా ఒక వెలుగు వెలిగింది. సంజరు ఖాన్‌ సరసన నటించిన 1977 లో 'చాంది సోనా', 1983 లో ధర్మేంద్ర సరసన 'జాని దోస్త్‌' చిత్రాలు బాగా ఆడాయి. పర్వీన్‌ బాబి హేమామాలిని, రేఖా, జీనత్‌ అమన్‌ లకు పోటీగా నిలిచి విజయవనతమైన హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది దశాబ్దకాలం పాటు బాలీవుడ్‌ పరిశ్రమ ఆమె వెంట పరుగులు పెట్టింది. ఆమె నటించిన ప్రతి చిత్రం అద్భుత విజయాలను అందించింది. జీనత్‌ అమన్‌ తో నంబర్‌ వన్‌ స్థానానికి గట్టి పోటీ ఇచ్చింది. 1976లో 'టైమ్‌' అంతర్జాతీయ పత్రిక కవర్‌ పేజీ మీద ముద్రణకు నోచుకున్న తొలి భారతీయ ఫొటో ఆమెది కావడం, పర్వీన్‌ బాబి ఎంతటి గొప్ప నటో బేరీజు వేయవచ్చు. అటువంటి పర్వీన్‌ బాబి కోసం అర్రులు చాచిన పరిశ్రమే ఆమెను దూరంగా విసిరేసింది. ఆమె తెరవెనక జీవితం అంధకార బంధుమై, దారీతెన్నూ లేని ఆ జీవితం వెనుక ఎన్నో అగాధాలు, ఆక్రోశనలు. ఒంటరిగా పోరాడిన పర్వీన్‌ అందంతో ఎంతోమంది లాయర్లు, ప్రతినిధులు, నిర్మాతలు సొమ్ముచేసుకున్నారు. పర్వీన్‌ 1991 లో నటించిన చివరి చిత్రం శతృఘ్న సిన్హా తో నటించిన 'ఇరాదా'.
జీనత్‌ తో పోటీ పడ్డ పర్వీన్‌
జీనత్‌ అమన్‌ కు పర్వీన్‌ బాబీకి కాస్త పోలికలు ఉండడమే కాకుండా ఇద్దరూ సెక్స్‌ సింబల్స్‌ గానే బాలీవుడ్‌ సినిమాల్లో పోటీ పడ్డారు. 1981లో 'క్రాంతి' సినిమాలో హీరోయిన్‌ హేమామాలిని. అయినా పర్వీన్‌ బాబి పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే 'షాన్‌' చిత్రంలో సునీత పాత్రలో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తరవాత 1983 లో పర్వీన్‌ బాబి ఆశ్చర్యకరంగా తెరమరుగైంది. ఆమె ఎక్కడున్నదో అనే వివరాలు కూడా తెలియనీయకుండా జాగ్రత్తపడింది. అండర్‌ వరల్డ్‌ డాన్ల వద్ద బందీ అయిందేమోననే వార్తలు కూడా బయటకు పొక్కాయి. పర్వీన్‌ పోషించిన పాత్రలన్నీ ఇంచుమించు పాశ్చాత్య నాగరికతా ప్రభావమున్నవే కావడం విశేషం. ఆమె ఎప్పుడూ చీర ధరించి కనపడలేదు. 'మేరా దేశ్‌' చిత్రం తో తనకీ జీనత్‌ అమన్‌ కి పోటీ పెరగడంతో వెస్ట్రన్‌ డ్రస్సుల్లోనే ఎక్కువగా కనపడేది. ఆమె సెక్స్‌సింబల్‌గా పేరు తెచ్చుకునేందుకు ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. పర్వీన్‌ బాబి పది సంవత్సరాలపాటు బాలీవుడ్‌లో చలాకీ పాత్రలు ధరిస్తూ సుమారు యాభైకి పైగా సినిమాల్లో నటించింది. 'నమక్‌ హలాల్‌' చిత్రంలో పర్వీన్‌ బాబి మీద చిత్రీకరించిన ''జవాని జానేమన్‌'', ''రాత్‌ బాఖి బాత్‌ బాఖీ'', 'షాన్‌' చిత్రంలో చిత్రీకరించిన ''ప్యార్‌ కరనే వాలే'', 'క్రాంతి'లో చిత్రీకరించిన ''మారా తుమ్‌ కా'' వంటి మోడరన్‌ పాటలు యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పర్వీన్‌ బాబి 'టైమ్‌' అంతర్జాతీయ మాగజైన్‌ మాత్రమే కాకుండా ఫిలింఫేర్‌, స్టార్‌ డస్ట్‌, ఫెమినా, స్క్రీన్‌ వంటి పత్రికల్లో ముఖపత్ర సుందరిగా అనేకసార్లు కనిపించి తన ఐడెంటిటీని నిలుపుకుంది. 1983 లో పర్వీన్‌ బాబి భారత దేశం వదలి తన స్నేహితురాలు వాలేన్టిన్‌ తో కలిసి ఆధ్యాత్మిక గురువు జిడ్డు కృష్ణమూర్తితో అనేక దేశాలు పర్యటించింది. తరవాత కాలిఫోర్నియాలో ఎక్కువకాలం గడిపింది. 1984లో కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరైన వ్యక్తిగత ఋజువులు చూపనందుకు, అనుమానాస్పదంగా వ్యవహరించినందుకు ఆమెను బేడీలు వేసి ముప్పై రోజులు మానసిక చికిత్సాలయంలో ఉంచారు. భారతీయ దౌత్య కార్యాలయ అధికారుల ప్రమేయంతో ఆమెను వదలిపెట్టారు. తరవాత పర్వీన్‌ బాబి 1989లో భారత్‌కు వచ్చింది. ఆమె బొంబాయి విమానాశ్రయంలో దిగినప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు. అందుకు కారణం ఆమె విపరీతమైన బరువు పెరిగిపోవడమే! ఆమెను మానసిక వ్యాధి ఆవరించిందని పత్రికలు రాయడంతో తనపై గిట్టనివాళ్ళు అపనిందలు వేసి అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారని, తనను పిచ్చిదానిగా చిత్రీకరించి ఆస్తిపాస్తులు కాజేయాలని చూస్తున్నారని బహిరంగ ప్రకటన చేసింది. దాంతో ఆమెకు సన్నిహితమైన స్నేహితులే కాదు, బంధువులు కూడా దూరం జరిగారు.
డేనీ తో సహజీవనం
బాంబే చిత్రసీమ అంతా ఆమె కోసం వెంపర్లాడుతుంటే పర్వీన్‌ మాత్రం డేనీ డెంజోంగ్పా కోసం పరితపించింది. డానీ, పర్వీన్‌ ఇద్దరూ సమవయస్కులే. విలన్‌గా డానీ, హీరోయిన్‌గా పర్వీన్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అప్పటికీ పర్వీన్‌ బాబీ గురించి డానీ విని ఉన్నాడు. తొలి చూపులోనే మతిపోగొట్టుకున్నాడు. పర్వీన్‌కూ డానీ ప్రత్యేకమయ్యాడు. అలా ఆ ఇద్దరి మనసులు కలిశాయి. తన ఫస్ట్‌ లవ్‌గా పర్వీన్‌ను మనసులో భద్రంగా దాచుకున్నాడు. కబర్లు, లాంగ్‌ డ్రైవ్‌లు వాళ్ల సాంగత్యాన్ని మరింత పెంచింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి తెచ్చింది. దీంతో ఇద్దరు కలిసి ఉండడం ప్రారంభించారు. పెళ్లికాకుండా ఆ జంట ఒకే ఇంట్లో ఉండడం అప్పట్లో బాలీవుడ్‌లో సంచలనం. దాంతో బుగ్గలు నొక్కుకుంది. గాసిప్స్‌ పంచింది. ఖాతరు చేయలేదు ఆ ఇద్దరూ. పర్వీన్‌ తల్లికి తెలిసినా బిడ్డ సంతోషాన్ని చూసి మనసుకు సర్దిచెప్పుకుంది. వరుస హిట్లతో పర్వీన్‌ బిజీ అయిపోయింది. అవకాశాల పరంపర డానీనీ తీరిక లేకుండా చేసింది. ఒకే రంగంలో ఉన్నా ఇద్దరి ప్రపంచాలూ వేరవడం మొదలైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి గడిపే కాలం కరువవడం స్టార్ట్‌ అయింది. మౌనంగానే ఎవరికి వారవసాగారు. ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. బంధం తెగిపోయినా స్నేహం చెడిపోవద్దనే అవగాహనకు వచ్చారు. ఆ ఇంటిని ఖాళీ చేసి తమ ప్రేమప్రయాణాన్ని ఆపేశారు. షేక్‌ హ్యాండ్‌తో స్నేహాన్ని కొనసాగించారు. పర్వీన్‌ బాబీతో బ్రేకప్‌ అయ్యాక డేనీ.. నటి కిమ్‌ యశ్‌పాల్‌ ప్రేమలో పడ్డాడు. కాని పర్వీన్‌.. డానీని మరిచిపోలేకపోయింది. ఆప్తమిత్రుడుగా అతడి అండను కోరుకుంటూనే ఉంది.
కబీర్‌ బేడీతో ప్రేమాయణం
ఇటలీలో 'సాండోకాన్‌' అనే ఇటాలియన్‌ సీరియల్‌ సెట్స్‌లో పర్వీన్‌ కబీర్‌ బేడీ దృష్టిలో పడింది.. అందులో పర్వీన్‌ కూడా ఓ భూమిక పోషించింది. ఆ సెట్స్‌లో కబీర్‌ మనసులో అలజడి రేపిన పర్వీన్‌ త్వరలోనే అతని ప్రియురాలు అయింది. ఈ జంట ప్రేమ ఇటాలియన్‌, స్పానిష్‌ మీడియానూ కనువిందు చేసింది. అక్కడి దిన పత్రికల పేజ్‌త్రీ కాలమ్స్‌, మ్యాగజీన్స్‌కు పర్వీన్‌, కబీర్‌ల డేటింగ్‌ కబుర్లు, ఫొటోలు బాగానే కాలక్షేపం అయ్యాయి. సాండోకాన్‌తో యూరప్‌లో కబీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చాన్స్‌ల గ్రాఫ్‌ కూడా హెచ్చింది. వెనక్కి బాలీవుడ్‌కు మళ్లే అవకాశం కనిపించలేదు. కాని బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఉన్న పర్వీన్‌ బాబీకి ముంబై తిరిగిరాక తప్పలేదు. అప్పటికే ఆమె కోసం 40 సినిమాలు వేచి చూస్తున్నాయి. ముంబైలో పర్వీన్‌ ఫోన్‌లో పలకగానే నిర్మాతలంతా నిశ్చింతగా నిట్టూర్చారట. అయితే ఈ సమయంలో కెరీరా? కబీరా? అన్న పరిస్థితి వచ్చింది పర్వీన్‌ బాబీకి. కెరీర్‌ ఎంత ముఖ్యమో కబీర్‌తో లైఫ్‌ అంతకన్నా ముఖ్యం. కబీర్‌ను ఇండియాకు వచ్చేయమనడం అంత భావ్యంగా అనిపించలేదు ఆమెకు. అలాగని తన కెరీర్‌నూ వదులుకోవడానికి మనసొప్పలేదు. అలా అతనక్కడ.. ఇలా తానిక్కడ.. కుదిరేట్లు లేదు. కబీర్‌ అదివరకే వివాహితుడు. ప్రతిమా బేడీ నుంచి విడిపోవాలనుకుంటున్న సమయంలో తాను అతనికి దగ్గరైంది. కాని తనకూ ఓ లైఫ్‌ ఉంది.. గుర్తింపు ఉంది. దాన్ని వదులుకొని కబీర్‌కు నీడలా ప్రపంచమంతా తిరగాలని లేదు ఆమెకు. దాంతో పర్వీన్‌ బాబీ కబీర్‌ చేయి విడిపించుకొని రెండేళ్ల ఆ ప్రణయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేంది.
డానీ డెన్‌ జోంగ్పా, కబీర్‌ బేడిలతో పాటు ఆమెకు దర్శక నిర్మాత మహేష్‌ భట్‌ తో వివాహేతర సంబంధాలు వున్నాయని పత్రికలు రాశాయి. అంతే కాకుండా నటులు అమితాబ్‌ బచన్‌ లతో శారీరక సంబంధాలు వున్నట్లు వదంతులు ఉండేవి. పైగా ఎనిమిది సినిమాల్లో ఆమె పక్కన హీరోగా నటించిన అమితాబ్‌ బచన్‌ 'సూపర్‌ ఇంటర్నేషనల్‌ గ్యాంగ్‌ స్టర్‌' అని, అతని అనుచరులు తనని కిడ్నాప్‌ చేసి ఒక ద్వీపానికి తీసుకెళ్ళి తన చెవి వెనక ఒక ట్రాన్స్‌ మిటర్‌ చిప్‌ పెట్టి ఆపరేషన్‌ చేయించారని, తరవాత ఆమెను చంపించేందుకు పథకం రచించాడని, దాంతో భయాందోళనలకు గురైనానని అమితాబ్‌ మీద పర్వీన్‌ అభియోగం మోపింది. అందుకు రుజువుగా తన చెవి కింద వున్న కత్తిగాటును కూడా చూపింది. అలాగే రాజేష్‌ ఖన్నా తో కూడా తనకు సంబంధాలను అంటగట్టారని ఒకసారి వాపోయింది. 1987లో మహేష్‌ భట్‌ నిర్మించిన 'అర్థ్‌' చిత్ర కథా నేపథ్యం 'పర్వీన్‌ బాబి' స్వీయకథ అని, ఆమెతో తనకుగల వివాహేతర సంబంధాలు అందులో ప్రధాన కథాంశంగా తీసుకున్నారని చెబుతుంటారు. అందులో స్మితాపాటిల్‌ పర్వీన్‌ పాత్రను పోషించగా, కులభూషణ్‌ ఖర్బందా మహేష్‌ భట్‌ పాత్రలో నటించాడు. తరవాత పర్వీన్‌ మరణాంతరం 2006 లో మహేష్‌ భట్‌ 'వో లమ్హే' అనే చిత్రాన్ని నిర్మించాడు. కష్టకాలంలో తనను అన్నివిధాలా ఆదుకున్న ఒకవ్యక్తితో కుదిరిన వివాహేతర సంబంధం వలన మానసిక రుగ్మత, అస్వాభావిక ప్రవర్తన, అసాధారణ భాషణం వంటి వింత వ్యాధితో బాధపడుతూ వుండే పాత్రను అందులో హీరోయిన్‌కి ఆపాదించే నేపథ్యంతో నిర్మితమైన సినిమా 'అర్థ్‌'. తనతో కాలం గడిపిన ఒక మహిళకు ఇచ్చిన నివాళి 'అర్థ్‌' సినిమా అని మహేష్‌ భట్‌ ప్రకటించడం పర్వీన్‌ తో తనకుగల సబంధాలకు బలమిచ్చినట్లయింది. మొహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాకు కథా రచన మహేష్‌ భట్‌ చేయడం విశేషం. అందులో పర్వీన్‌ బాబి పాత్రను కంగనా రనౌత్‌ పోషించింది. మహేష్‌ భట్‌ పాత్రను షైనీ అహుజా పోషించారు. 30 మంది విశేష వ్యక్తులమీద తనను చంపేందుకు పథకం పన్నారని లాయర్ల ద్వారా కేసులు వేసి పర్వీన్‌ డబ్బు ఖర్చు చేసింది. సాక్ష్యాధారాలు లేని ఆ కేసులన్నీ వీగిపోయాయి. ఎప్పుడైనా పాత్రికేయులు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు వస్తే తనవద్ద వున్న ఆహారాన్ని తినమని, పానీయాలు తాగమని నిర్బంధించేది. అందులో విషంవంటి పదార్ధాలు కలపలేదని నిర్ధారించుకున్న తరవాతే పుచ్చుకొనే స్థితికి ఆమె భయాంధోళనలు చేరుకున్నాయి. అంతటి మానసిక రుగ్మతకు దిగజారింది. పాత్రికేయులను 'అమితాబ్‌ ఏజంట్లు' అని సంబోధించేది. తనతో ఎవరు మాట్లాడినా వాటిని రికార్డు చేసే బలహీనతకు దిగజారింది. 2002 లో నటుడు సంజరు దత్‌ మీద ప్రత్యేక కోర్టులో అతనికి 1993 బొంబాయి పేలుళ్ళ కేసులో ప్రమేయమున్నట్లు ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. 1990 తరవాత ముస్లిం మతాన్ని వదలి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. సినిమా సాంగత్యం త్యజించాక సంగీతం, పెయింటింగ్‌, సాహిత్యం, ఫొటోగ్రఫీ, పియానో నేర్చుకోవడం వంటి పనులమీద ధ్యాస పెంచుకుంది.
ఒంటరి మరణం
పర్వీన్‌ బాబీ తన 55 వ ఏటా 2005వ సంవత్సరం జనవరి 20 న జుహులోని తన సొంత ఫ్లాట్‌లో ఒంటరిగా మరణించింది. పర్వీన్‌ వరసగా మూడు రోజులపాటు పాలు, న్యూస్‌ పేపరు తీసుకోకపోవడంతో పొరుగున ఉన్న వారి ఫిర్యాదు మేరకు అపార్టుమెంటు యాజమాన్యం పోలీసులకు తెలియపరచింది. పోలీసులు వచ్చి పర్వీన్‌ మృతదేహాన్ని కనుగొని ఆమె మూడురోజుల క్రితమే చనిపోయిందని నిర్ధారించారు. ఆమె తీవ్ర మధుమేహ వ్యాధితో బాధపడుతూ వుండేది. ఆమె పడక ప్రక్కన ఒక వీల్‌ చెయిర్‌ కూడా పోలీసులు కనుగొని ఆమె కాలికి 'గాంగ్రెన్‌' వున్నట్లు నిర్ధారించారు. మూడురోజులుగా తిండి తినక మద్యం పుచ్చుకొని వున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు తెలిపింది. చివరికి ఆమెది సహజ మరణమేనని పోలీసులు ధృవపరిచారు. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు 'శేఖర్‌ సుమన్‌ టాక్‌ షో'లో కనిపించడం మినహా, ఆమె మరెక్కడా కనిపించలేదు.
పర్వీన్‌ బాబీ ఆస్తులు చారిటీ కి
పర్వీన్‌ మరణాంతరం 2005లో ఆమెకు బాగా సన్నిహితుడైన మేనమామ మురద్‌ఖాన్‌ బాబీ పర్వీన్‌ బాబీ కోరిక మేరకు నిరుపేద మహిళలు, పిల్లల కోసం ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టి, తన ఆస్తుల్లో 80 శాతం ఆస్తులను చారిటీ కోసం వినియోగించాలని చేసిన ప్రయత్నాన్ని పర్వీన్‌ తండ్రివైపు బంధువులు వ్యతిరేకించి, మురద్‌ఖాన్‌ తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. దీంతో ఆయన నిరుపేదలైన మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి పర్వీన్‌ తన సంపాదనలో 80 శాతాన్ని ఉపయోగించాలని రాసిచ్చిన పత్రాలతో పాటు, పర్వీన్‌ తన ఆస్తిలో 20 శాతాన్ని తనకు ఇచ్చినట్లు నిరూపించే పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు. హై కోర్టులో 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ అనంతరం పర్వీన్‌ కోరిక మేరకు ఆమె ఆస్తులను చారిటీ కోసం వినియోగించాలని నిరుపేదలైన మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి ఆమె సంపాదనలో 80 శాతాన్ని ఉపయోగించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఏదేమైనా చనిపోయి కూడా పర్వీన్‌ తన దాతృత్వాన్ని చాటుకుంది.
పర్వీన్‌కు ముంబైలోని జుహులో సముద్రం పక్కన ఫోర్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ ఉంది. దీంతో పాటు గుజరాత్‌లోని జూనాగడ్‌ లో ఒక ఎస్టేట్‌, ఆభరణాలు, బ్యాంకులో సుమారు రూ. 20 లక్షల నగదు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. పర్వీన్‌ కోరిక ప్రకారం ఈ సంపాదనలో 80 శాతాన్ని ఉపయోగించి ఒక ట్రస్ట్‌ నడపాలి. జూనాగడ్‌ లోని బాబీ వర్గానికి చెందిన నిరుపేద మహిళలు, పిల్లలకు ఈ ట్రస్ట్‌ ద్వారా సేవ చేయాలి. నిజానికి పర్వీన్‌ కూడా జూనాగడ్‌లో బాబీ వర్గానికి చెందిన కుటుంబంలోనే జన్మించారు. ప్రస్తుతం పర్వీన్‌ బాబీ ట్రస్ట్‌ను ఆమె మేనమామ మురద్‌ఖాన్‌ తన నాయకత్వంలో పర్వీన్‌ సంపాదనలో మిగిలిన 20 శాతాన్ని అనుభవిస్తూ, ట్రస్టు నిర్వహిస్తున్నాడు. అలాగే ట్రస్ట్‌ నిధుల్లో 10 శాతం పర్వీన్‌ తను మాస్టర్‌ డిగ్రీ చేసిన అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీకి అందాయి.
- పొన్నం రవిచంద్ర,
  9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.