Authorization
Sat March 15, 2025 09:33:20 am
- డిసెంబర్ 23న మినీ వేలం
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం వేదిక, తేది ఖరారు అయ్యాయి. సంప్రదాయ వేదిక బెంగళూర్‌ను కాదని బీసీసీఐ ఈసారి కొత్త వేదికను ఎంచుకుంది. కోచి నగరంలో డిసెంబర్ 23న ఆటగాళ్ల మినీ వేలం నిర్వహణకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ మినీ వేలం వేదిక రేసులో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ సహా హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. కేరళలో ఐపీఎల్ జోష్ ఏదో ఒక రూపంలో ఉండాలనే ఉద్దేశంతో మినీ వేదికగా కోచిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు పది ప్రాంఛైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను తీసుకుని, అవసరం లేని ఆటగాళ్లను వదులుకునేందుకు మినీ వేలం వేదిక కానుంది. ఇక మినీ వేలానికి ముందు ప్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ శుభవార్త అందించింది. గత సీజన్ వేలం పర్స్ రూ.90 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లను కేటాయించనుంది. దీంతో గత ఏడాది వేలం ప్రక్రియ అనంతరం మిగిలిన డబ్బుకు ఈ రూ.5 కోట్లు తోడు కానున్నాయి. ఈ సొమ్ముతో జట్టుకు అవసరమైన ఇద్దరు, ముగ్గురు క్రికెటర్లను కొనుక్కునేందుకు ప్రాంఛైజీలకు వీలు చిక్కనుంది. ఈ సీజన్ వేలంలో స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, శామ్ కరణ్, కామెరూన్ గ్రీన్‌లు అందుబాటులో ఉంటే వేలం ప్రక్రియ వేడెక్కనుందని చెప్పవచ్చు.