Authorization
Fri March 14, 2025 08:45:36 pm
- ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం
బగోటా: టోక్యో ఒలింపిక్స్ రజత పతకం సాధించిన మీరాబాయ్ ఛాను... ఇప్పుడు మరో ఘనతను సాధించింది. కొలంబియాలోని బగోటాలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా రజత పతకం సాధించి సత్తా చాటింది. ఈ టోర్నీలో కూడా మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 200 కేజీల బరువు ఎత్తి అద్భుత ప్రదర్శన కనబర్చింది. మణికట్టు గాయంతో బాధపడుతున్నప్పటికీ మీరాబాయ్ ప్రదర్శన అభిమానుల మన్ననలు అందుకుంది. చైనాకు చెందిన జియాంగ్ హిహువా స్నాచ్‌లో 93కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల (మొత్తం 206 కేజీలు) బరువు ఎత్తడం ద్వారా తొలి స్థానంలో నిలిచి, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. చైనాకు చెందిన మరో క్రీడాకారిణి హౌ జిన్హువా 198 కేజీల (89ం109) బరువు ఎత్తి కాంస్యం పతకం నెగ్గగా, భారత్ క్రీడాకారిణి మీరాబాయ్ ఛాను 200కేజీల(87ం113) ఎత్తి రజతం గెలుచుకుంది.