Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రీజెన్సీ కాలేజ్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో భారత వర్థమాన మహిళా క్రికెటర్, భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష సందడి చేశారు. బంజారాహిల్స్లో శనివారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొంగడి త్రిష రీజెన్సీ కళాశాల విద్యార్ధులతో ముచ్చటించింది. ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషను కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. 'క్రికెట్ మ్యాచులను విజయవంతం చేసేందుకు ఆఫ్ గ్రౌండ్లో ఎంతో మంది కష్టపడతారు. ఇక్కడ ఆ కష్టాన్ని ప్రత్యక్షంగా చూశానని' త్రిష తెలిపింది. వార్షికోత్సవంలో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు తయారు చేసిన క్రికెట్ స్టేడియం, పిచ్, బ్యాట్, బాల్ థీమ్ ఆహార పదార్థాలను త్రిష రుచి చూసింది.