Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో రంజీ స్టార్ తుది శ్వాస
నవతెలంగాణ, హైదరాబాద్ : వెటరన్ రంజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అబ్దుల్ అజీమ్ మంగళవారం తుది శ్వాస విడిచారు. 1980-1995 మధ్య కాలంలో దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అబ్దుల్ అజీమ్ తనదైన ముద్ర వేశారు. ఓపెనర్‌గా ధనాధన్ శైలికి ఆటను పరిచయం చేసిన అబ్దుల్ అజీమ్ రంజీ ట్రోఫీలో సౌత్ జోన్ నుంచి ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించారు. 62 ఏండ్ల అబ్దుల్ అజీమ్ ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2021 నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అబ్దుల్ అజీమ్‌కు ఫిబ్రవరిలోనే కిడ్నీ శస్త్రచికిత్స విజయవంతమైంది. 73 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4644 పరుగులు చేసిన అబ్దుల్ అజీమ్.. 43.40 సగటుతో 12 సెంచరీలు, 18 అర్థ సెంచరీలు సాధించారు.