Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పివి సింధు 21-15, 22-20తో చైనీస్ తైపీకి చెందిన హు-వెన్-ఛిపై వరుససెట్లలో నెగ్గింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో ప్రత్యర్ధినుంచి గట్టి పోటీని ఎదుర్కొని 22-20తో ఆ గేమ్‌ను ముగించింది. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ జోడీ 177-21, 21-17, 21-18తో ఇండోనేషియాకు చెందిన మయసరి-సుగియార్టోపై, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జోడీ 21-12, 21-16తో మలేషియా జోడీపై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-13, 21-8తో బహ్రెయిన్‌కు చెందిన ఇబ్రహీంపై గెలుపొందగా.. కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్ 7-21, 21-23తో మాజీ ప్రపంచ ఛాంపియన్ లో-కెన్- యు(సింగపూర్) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మరో పోటీలో మాల్విక బన్సోద్ 23-25, 19-21తో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అకానే యమగుచి(జపాన్) చేతిలో పోరాడి ఓడింది.