Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టి20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజా టి20 ర్యాంకింగ్స్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకు న్నాడు. ఐసిసి బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 906పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్తాన్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 811పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా చివరి టి20లో 98పరుగులతో రాణించిన రిజ్వాన్ ఖాతాలో 13పాయింట్లు జమ అయ్యాయి. దీంతో రిజ్వాన్ 798పాయింట్ల నుంచి 811పాయింట్లకు చేరుకొని 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా... పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 756పాయింట్లు మూడో స్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ 758పాయింట్లు, రేన్ షా 724పాయింట్లు టాప్-5లో కొనసాగుతున్నారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన టి20 సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విజేత ఛాప్మన్(527పాయింట్లు) కెరీర్ బెస్ట్ 35వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి(612పాయింట్లు) 12వ ర్యాంక్‌లో ఉన్నాడు.