Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
దుబాయ్ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మరో మెరుపు ప్రదర్శన చేశాడు. మూడో సీడ్ ఇండోనేషియా జోడీ మహ్మద్ ఆశాన్, హెండ్రా సెటివన్లపై వరుస గేముల్లో గెలుపొంది ఆసియా చాంపియన్‌షిప్స్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో 21-11, 21-12తో 30 నిమిషాల లోపే భారత జోడీ విజయం సాధించింది. ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు, హెచ్.ఎస్ ప్రణరు క్వార్టర్స్ నుంచే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో పి.వి సింధు 21-18తో తొలి గేమ్ నెగ్గినా.. 5-21, 9-21తో కొరియా షట్లర్ యంగ్‌కు తలొంచింది. మెన్స్ సింగిల్స్‌లో ప్రణరు 11-21, 9-13తో వెనుకంజలో నిలువగా.. గాయంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో జపాన్ షట్లర్ నేరుగా సెమీఫైనల్ బెర్త్ సొంతం చేసుకున్నాడు.