Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు
జైపూర్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ జట్టు 17.5ఓవర్లలో కేవలం 118పరుగులకే ఆలౌట్ కాగా.. ఛేదనలో గుజరాత్ జట్టు 13.5ఓవర్లలో వికెట్ కోల్పోయి 119పరుగులు చేసి ఘన విజయం సాధించింది. తొలుత రాజస్తాన్ కెప్టెన్ సంజు శాంసన్(30), బౌల్ట్(15), జైస్వాల్(14) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. జోస్ బట్లర్(8) మరోసారి నిరాశపరిచాడు. హెట్‌మైర్(7), రియాన్ పరాగ్(4), ధ్రువ్ జోరెల్(9), అశ్విన్(2) పేలవంగా ఆడారు. ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్(15) ఓ సిక్స్, ఓ ఫోర్ బాదడంతో రాజస్థాన్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14, దేవదత్ పడిక్కల్ 12 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కీలకపాత్ర పోషించారు. రషీద్ ఖాన్ కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 25పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మహ్మద్ షమీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, జాషువా లిటిల్ 1 వికెట్ తీసి రాజస్థాన్ ను కుప్పకూల్చడంలో తమ వంతు సహకారం అందించారు. ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాహా(41నాటౌట్), శుభ్‌మన్ గిల్(36) తొలి వికెట్‌కు 71పరుగులు జతచేశారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(39నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. చాహల్‌కు ఒక వికెట్ లభించింది.
స్కోర్‌బోర్డు..
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) మోహిత్/రషీద్ ఖాన్ 14, బట్లర్ (సి)మోహిత్ శర్మ (బి)హార్దిక్ పాండ్యా 8, సంజు (సి)హార్దిక్ (బి)జోషూ లిట్టిల్ 30, పడిక్కల్ (బి)నూర్ అహ్మద్ 12, అశ్విన్ (బి)రషీద్ ఖాన్ 2, రియాన్ పరాగ్ (ఎల్బి)రషీద్ ఖాన్ 4, హెట్‌మైర్ (ఎల్బి)రషీద్ ఖాన్ 7, ధృవ్ జోరెల్ (ఎల్బి)నూర్ అహ్మద్ 9, బౌల్ట్ (బి)షమీ 15, జంపా (రనౌట్) మనోహర్ 7, సందీప్ శర్మ (నాటౌట్) 2, అదనం 8. (17.5ఓవర్లలో ఆలౌట్) 118పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/47, 3/60, 4/63, 5/59, 6/77, 7/87, 8/96, 9/112, 10/118
బౌలింగ్: షమీ 4-9-27-1, హార్దిక్ పాండ్యా 2-0-22-1, రషీద్ ఖాన్ 4-0-14-3, జోష్ లిట్టిల్ 4-0-24-1, నూర్ అహ్మద్ 3-0-25-2, మోహిత్ శర్మ 0.5-0-5-0
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41, శుభ్‌మన్ గిల్ (స్టంప్) సంజు (బి)చాహల్ 36, హార్దిక్ పాండ్యా (39నాటౌట్), అదనం 3. (13.5ఓవర్లలో వికెట్ నష్టానికి) 119పరుగులు.
వికెట్ల పతనం: 1/71 బౌలింగ్: బౌల్ట్ 3-0-28-0, సందీప్ శర్మ 3-0-19-0, ఆడం జంపా 3-0-40-0, చాహల్ 3.5-0-22-1, అశ్విన్ 1-0-8-0.