Authorization
Thu April 10, 2025 09:52:09 pm
నవ తెలంగాణ - కందనూలు
తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్లో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న టమోట ధరలను నియంత్రించాలని వాటిని సబ్సిడీ ధరకే ప్రజలకు విక్రయించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ధరల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలతో పాటు టమాటా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి పేద ప్రజల కోన లేని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టమాటాలు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ప్రజలకు సబ్సిడీ ద్వారా విక్రయించాలని అనే విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సత్య చారి, శ్రీనుచారి, రాములు, కృష్ణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.