Authorization
Fri April 11, 2025 02:23:13 am
అమరచింత : పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న యోధుడు జ్యోతి బాసు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ అన్నారు. జ్యోతిబాసు 108 వ జయంతి సంద ర్భంగా అమరచింత మండల కేంద్రంలోని శుక్రవారం రాత్రి జిఎస్ భవనంలో ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ భూస్వాములతో పోరాటం జరిపి పేద ప్రజలకు భూములను పంపిణీ చేసిన ఘనత జ్యోతి బాసు కె దక్కిందన్నారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరం తరం పేద ప్రజల హక్కులు సాధించేందుకు వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. ఆయన చివరి వరకు పేద ప్రజల సమస్యలపై పరి ష్కారానికై అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ జి ఎస్ గోపి,మండల నాయకులు ఆర్యన్ రమేష్,బుచ్చన్న, శ్యాంసుందర్, పి వెంకటేష్, కాకి శీను, రవి ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి రాఘవ పాల్గొన్నారు.