Authorization
Mon April 07, 2025 01:35:02 am
మహబూబ్ నగర్ : తెలంగాణ మహిళా సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ ఆవాధాన్ని చుక్కపల్లి శ్రీదేవి చేత శతావధానం నిర్వహించడం జిల్లాకే గర్వకారణమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గెలాక్సీ పాఠశాలలో నిర్వహించిన శతవ దానం కార్యక్రమానికి సభ అధ్యక్షురాలుగా రావూరి వనజ సమన్వయకర్తగా శాంతా రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శతావ దానం సాహితీ ప్రక్రియలో ఒకటి అని ఆమె అన్నారు. సమయస్ఫూర్తి, చాతుర్యం ధారణ శక్తి అవసరమంటూ అవధాని యొక్క గొప్పతనాన్ని ఆమె అభివర్ణించారు. శ్రీదేవి అష్టావధానం శతాంశంలోని పూర్వ భాగాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా విభజించి వర్ణించారని ఆమె తెలిపారు. ప్రభుత్వం తరఫున 33 జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వంతో మాట్లాడతానని ఆమె తెలిపారు. ఈ అవధాన కార్యక్రమంలో ప్రముఖ రచయిత మనోహర్ రెడ్డి, పొద్దుటూరు ఎల్లారెడ్డి, వల్లభాపురం జనార్ధన్, బాలస్వామి, రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ అవధానం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు పాల్గొన్నారు.