Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వనపర్తి
మన ఊరు- మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. బుధవారం ప్రజావాణి సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ''మన ఊరు - మనబడి'' కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంకా గ్రౌండింగ్ కాని పనులను తక్షణమే గ్రౌండింగ్ చేయాలని ఆమె సూచించారు. టెండర్ పనులను వెంటనే పూర్తి చేయాలని, పనులలో వేగవంతం చేయాలని ఆమె అన్నారు. పనులు పూర్తయిన పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ వేయించాలని, బిల్లులకు ఎలాంటి ఇబ్బంది లేదని, పూర్తి చేసిన పనులకు సంబంధించి ఎఫ్ టి ఓ జనరేషన్ ను తక్షణమే చేయాలని ఆమె తెలిపారు. ఇకపై ''మన ఊరు- మన బడి'' పాఠశాలల నిర్మాణ పనులపై ప్రతి వారం సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 54 పాఠశాలలు పెయింటింగ్ చేయాల్సి ఉండగా, 11 పాఠశాలలు పెయింటింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని, ఎఫ్.టి.వో జనరేట్ చేయాలని ఆమె తెలిపినారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో వెంకట్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, పంచాయతీరాజ్ ఈ.ఈ. మల్లయ్య, సిపిఓ వెంకటరమణ. డిపిఓ సురేష్, ఆర్ అండ్ బి, టి ఎస్ ఎం ఐ డి సి, ఈ డబ్ల్యూ ఐ డి సి, ఇరిగేషన్ శాఖల సిబ్బంది, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.