Authorization
Mon April 07, 2025 12:48:19 am
నవతెలంగాణ- కల్వకుర్తి
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం సేవ్ ఎన్విరాన్మెంట్ మరియు పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా శారీర దృఢత్వంపెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.