Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీపనగండ్ల : బొల్లారం నుంచి కర్నూలు వెళుతున్న కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ 241 నెంబర్ గల బస్సులో వీపనగండ్ల మండలం కల్వరాళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి ఎక్కి తన 25 వేల సెల్‌ఫోన్ బస్సులో మర్చిపో యాడు.పెబ్బేరులో కండక్టర్ సాయి ఈశ్వర్ సెల్‌ఫోన్‌ను గుర్తించి అప్పటికే ప్రయా ణికుడు హైదరాబాద్ వెళ్తూ భూత్పూర్ దాటి వెళ్లిపోవడంతో ఫోన్ నెం బర్ వివరా లు తెలుసుకొని ప్రయాణికునికి సమా చారం చేరవేశారు. దీంతో ప్రయాణికుడు తిరిగివచ్చి పెబ్బేర్ ఆర్టీసీ బస్టాండ్‌లో కంట్రోలర్ కండక్టర్ సాయి ఈశ్వర్ బాలకృష్ణరెడ్డికి సెల్ ఫోను అందించారు. ప్రయాణికులు, డ్రైవర్లు కండక్టర్‌ను అభినందించారు.