Authorization
Sun April 13, 2025 08:41:39 pm
నవతెలంగాణ-కోహెడ
ఈ నెల 15న వీరాభైరన్పల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ పిలుపునిచ్చారు. కోహెడ మండల కేంద్రంలో సంస్మరణ సభ కరపత్రాలను మండల కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కావాలని కోరుతూ ఎర్రజెండా నాయకత్వన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజం పాలనలో ఉందని నైజాం పాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలో గెరిల్లా పోరాటం సాగిందని బైరాన్ పల్లి కేంద్రంగా నిజాం రజాకాలను తిప్పి కొట్టారని దీనిని మనసులో పెట్టుకున్న నిజం. ఈ పోరాటాన్ని అనిచివేయాలని పన్నాగం పన్ని బైరాన్ పల్లి గ్రామంలో 1948 ఆగస్టు 27వ తేదీన ఒకేరోజు ఉదయం నాలుగు గంటలకే గ్రామంలోకి చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా 96 మంది ఊచ కోత కోశారని అన్నారు. ఆశయ సాధనకై భవిష్యత్తులో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సభకు పార్టీ రాష్ట్రకార్యదర్శి మాజీ ఎంపీ కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క రాములు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, నాయకులు రమేష్, శ్రీనివాసు, సంపత్, స్వామి, వీరన్న, లింగం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.