Authorization
Thu April 10, 2025 10:04:33 am
నవతెలంగాణ-జోగిపేట
హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర జాయినింగ్ కమిటీ అధ్యక్షులు ఈటల రాజేందర్‌ను ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం బీజేపీ ఆందోలు అసెంబ్లీ కన్వీనర్ ఉదరు బాబుమోహన్ ఆధ్వర్యంలో నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉదయ బాబు మోహన్ ఈటల రాజేందర్‌కు రుద్రాక్ష మొక్క ఇచ్చి, మొక్కను నాటారు. జ్ఞాపకను కూడా అందజేశారు. ఆయన వెంట పుల్కల్ ఉమ్మడి అధ్యక్షులు శేఖర్ గౌడ్, అందోల్ అధ్యక్షులు నవీన్, అల్లాదుర్గం ఆనంద్ శర్మ, పట్టణ అధ్యక్షులు సయ్య సాయి, మండల నాయకులు సుమన్, గోవర్ధన్, కరుణాకర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.