Authorization
Thu April 10, 2025 08:45:15 am
నవతెలంగాణ-కంగ్టి
గొర్రె, మేకలపెంపకం దారులసంఘం నారాయణఖేడ్ తాలుకా యువత అధ్యక్షుడిగా కంగ్టి గ్రామానికి చెందిన తొంటవిశ్వనాథ్ను రాష్ట్ర అద్యక్షులు మల్ శెట్టియాదవ్ ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు. కాగా నారాయణఖేడ్‌లో జరిగిన సమావేశంలో వివిధ మండలాల సంఘాలను ఎన్నుకున్నారు. కంగ్టి మండలాధ్యక్షులుగా చందర్ గొండ, గౌరవాధ్యక్షులుగా నరేశ్ కురుమ, మండల యువత అధ్యక్షులుగా అనీల్ కురుమ, ఉపాధ్యక్షులుగా దత్తు కురుమలను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. గొర్రె, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కురుమలను ఎస్సీ జాబితాలొ చేర్చాలన్నారు. తనకు అధ్యక్ష పదవి ఇచ్చి బాధ్యత పెంచారని.. కాగా తనను ఎన్నుకున్న రాష్ట్రఅధ్యక్షులు మల్ షెట్టికి ధన్యవాదాలు తెలిపారు.