Authorization
Sun April 06, 2025 09:05:13 pm
- మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీర్మానం
నవతెలంగాణ-నర్సాపూర్
ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పశువుల సంతను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొత్తగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దుకాణ సముదాయాన్ని త్వరలో ప్రారంభించాలని, మార్కెట్లో అంతర్గత రోడ్లు మరమ్మతులు చేయాలని ధర్మ కంఠను ఇతర చోటకు మార్చాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆదాయాన్ని పెంచేందుకు పాలకవర్గ సభ్యు లందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ హబీబ్ ఖాన్, డైరెక్టర్లు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, సూరారం నరసింహులు, సా గర్, నరసింహారెడ్డి నాగేష్ దేవుల నాయక్ కార్యదర్శి ఐశ్వర్య, తదితరులు ఉన్నారు.