Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
- వివరాలు లేకపోవడంతో ఎంపీఓపై ఆగ్రహం
నవతెలంగాణ -పాపన్నపేట
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 100 రోజుల్లో నాలుగు లక్షల 70 వేల మందికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించావ ున్నారు. అందులో భాగంగా 40 టీంలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్యాంపులు అనుకున్న రీతిలో కొనసాగుతున్నాయని వెల్లడిం చారు. ఇక మండల కేంద్రమైన పాపన్నపేటలో 3100 మందికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించా మన్నారు. ప్రతిరోజు 200 మందికి పరీక్షలు కొనసాగుతు న్నాయని.. సంబంధిత సిబ్బంది పనితీరు బాగుందని వెల్లడించారు. ఎవరైనా కంటి చూపు లోపం ఉంటే వెంటనే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో 17 నుంచి 18 ఏండ్ల వయసు గల యువకుల వివరాలు ఇవ్వా లని స్థానిక ఎంపీఓ లక్ష్మీకాంతరెడ్డిని ఆదేశించారు. అన్ని గ్రామాల వివరాలు లేవని ఆయన సమాధానం చెప్పడ ంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రం కల్లా అన్ని గ్రామాల వివ రాలు ఇవ్వాలని లేకుంటే చర్యలు తీసుకుం టానని హెచ్చ రించారు. అనంతరం నేరుగా పాపన్నపేట గ్రామ శివారులో నిర్వహిస్తున్న నర్సరీ వద్దకు వెళ్లి మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం బాగుందని ఎండి పోయిన మొక్కలు తానే నూతనంగా మొక్కలు నాటాల్సి ందిగా ఆయన సూచిం చారు. కలెక్టర్ వెంట స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మండల ప్రత్యేక అధికారి భీమయ్య, సిహెచ్ఓ చందర్ , కోఆప్షన్ సభ్యులు గౌస్, ఉప సర్పంచ్ బాలరాజు, ఎంపీడీవో జగదీశ్వర చారి, ఎంపీఓ లక్ష్మీకాం తరెడ్డి, కార్యదర్శి నయీమ్, తదితరులున్నారు..