Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునిపల్లి
పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం పోరా డుతామని బీఎస్పీ జిల్లా నాయకులు ముప్పారం ప్రకాష్ అన్నారు. పత్తి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మ హత్యాయత్నానికి యత్నించిన మండలంలోని ఖమ్మంపల్లి రైతు కలాల్ సత్తయ్య గౌడ్‌ను శనివారం ఆయన పరామర్శి ంచారు. రైతుల పక్షాన బీఎస్పీ పోరాడుతుందని.. రైతులు అధైర్యపడొద్దన్నారు. గిట్టుబాటు ధర గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గౌడ్‌కు హామీ ఇచ్చారు.
ధర లేదు.. అప్పులెట్ట తీర్చాలి?
కాగా బాధిత రైతు మాట్లాడుతూ.. 'పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. పెట్టుబడికి సుమారు రూ.3లక్షల పైనే ఖర్చు అయింది. అప్పులు తెచ్చి సాగు పంట పండించిన. చివరికి పంట చేతికొచ్చిన తర్వాత ధర లేకుండా పోయింది.యాభై క్వింటాళ్ల పంట పండినప్పటికీ.. ధర మాత్రం చాలా తక్కువగా ఉన్నది. వచ్చే పైసలు కైలుకు పోతే.. బాకీలు ఎలా తీర్చాలి. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు తాగాను.' అని వాపోయాడు.