Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి ఓటమే... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 26,2022

ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి ఓటమే...

- హిందూ, ముస్లింల మధ్య ఎలాంటి ఘర్షణ లేదు
- మతం పేరుతో బీజేపీ అల్లర్లకు యోచన
- దేశాన్ని నాశనం చేసేవారిని తరిమికొట్టాలి: సమ్మాన్‌ దివస్‌ ర్యాలీలో ప్రతిపక్ష నేతలు
న్యూఢిల్లీ: 'బీజేపీని గద్దెదించడంతోనే దేశాన్ని కాపాడుకోగలం. బీజేపీ దుష్టపాలనను అంతమొందించేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఏకతాటిపైకి వస్తే బీజేపీకి ఓటమి తప్పదు. ఎన్డీఏ ఇప్పుడు లేదు. శివసేన, జేడీయూ, ఎస్‌ఏడీ వంటి పార్టీలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల సంఖ్య,బలం పెరుగుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పాలనను మారుస్తాయి. అందుకోసం అందరం కృషి చేయాలి'' అంటూ ప్రతిపక్ష నేతలు పిలుపు నిచ్చారు. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్‌ 109 జయంతి సందర్భంగా ఆదివారం హర్యానాలోని ఫతేహాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) సమ్మాన్‌ దివస్‌ ర్యాలీ నిర్వహించింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
బీజేపీ ద్వేషపూరిత ఆలోచనలను ప్రజలు ఓడిస్తారు: సీతారాం ఏచూరి
          ''దేశాన్ని, దాని నీతిని నాశనం చేయడంతో బీజేపీ తప్పించుకోవాలని చూస్తోంది. అది అనుమతించబడదు. ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకునేలా చేసి లాభపడాలని బీజేపీ చూస్తోంది. వారి ప్రమాదకరమైన ఆలోచనలను ప్రజలు ఓడిస్తారు'' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారనీ, పేదలు మరింత పేదలవుతు న్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజల బతుకులు చిధ్రమవుతున్నాయన్నారు. దేశం ఆస్తులను అదానీ, అంబానీలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. ''ఈ ప్రభుత్వ రంగ కంపెనీలకు దేశ ప్రజలే యజమానులు. ఆయన మేనేజర్‌ మాత్రమేనని మనమందరం మన ప్రధానికి చెప్పాలి. మేనేజర్‌ ప్రజలకు చెందిన ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తే, మేము మేనేజర్‌ను మార్చేస్తాం '' అని పేర్కొన్నారు. ''మనం మన దేశాన్ని కాపాడుకోవాలంటే, బీజేపీని అధికారం నుంచి తొలగించాలి. ఇది మన్‌ కీ బాత్‌ కాదు. ఇది దిల్‌ కీ బాత్‌'' అని ఏచూరి అన్నారు. కేరళలాగా అన్ని రాష్ట్రాలను తీర్చిదిద్దాలనీ, కేరళలో బీజేపీకి ఒక ఎమ్యెల్యే ఉండేవాడని, గత ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా సీపీఐ(ఎం) కైవసం చేసుకున్నదని తెలిపారు. దీంతో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సున్నా అని, ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీని జీరో చేయాలని పిలుపు నిచ్చారు. మతోన్మాద శక్తులను నిర్వీర్యం చేసే ఏ పోరాటంలోనైనా ఎర్ర జెండా తన వెంట ఉంటుందని స్పష్టం చేశారు.
దేశాన్ని నాశనం చేసేవారిని తరిమికొట్టాలి: నితీశ్‌ కుమార్‌ (బీహార్‌ సీఎం)
బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ హిందువులు, ముస్లింల మధ్య ఎటువంటి ఘర్షణ లేదనీ, బీజేపీ మాత్రం మతం పేరుతో అల్లర్లు సష్టించాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌, వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం కావాలని పిలుపు నిచ్చారు. ''ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్‌'' కాషాయ రంగును ప్రతిఘటిస్తోందనీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందని తెలిపారు. ఇక్కడ ప్రారంభమయ్యేది మూడో ఫ్రంట్‌ కాదనీ, కేంద్రంలోని బీజేపీని గద్దెదించే మొదటి ఫ్రంట్‌ అని పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేయడానికి పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని అన్నారు. జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా కోరిక.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలి, నేను ప్రధాని అభ్యర్థిని కాదు. మూడో కూటమనే ప్రశ్నే లేదు. ఒకే కూటమి ఉంటుంది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం'' అని అన్నారు.
అందరం కలిసి బీజేపీ పాలనను మారుస్తాం: శరద్‌ పవార్‌
2024లో కేంద్రంలో ప్రభుత్వం మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ''రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారు ఏడాది పాటు శాంతియుతంగా పోరాడారు. కాని వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. కేసులను ఉపసంహరించుకుంటామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. నేడు, రైతులు న్యాయస్థానాలకు హాజరుకావలసి వస్తుంది. మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ప్రతి గంటకు, ఎక్కడో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు చదువుతున్నాం. అలాంటి పరిస్థితులను సృష్టించే వారిని మనం తొలగించాలి. 2024లో మనకు అవకాశం వచ్చినప్పుడు, మనమందరం కలిసి బీజేపీ పాలనను మారుస్తాం'' అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. రైతులు, యువకుల ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ప్రభుత్వంలో మార్పు తీసుకురావడమే నిజమైన పరిష్కారమని సూచించారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: తేజస్వి యాదవ్‌
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి జేడీయూ, ఎస్‌ఏడీ, శివసేన వైదొలిగాయని ఆర్జేడీ నేత, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఆయా పార్టీలు వైదొలిగాక, ఇప్పుడు ఎన్‌డీఏ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బీజేపీ నియంతృత్వ పాలనను అంతమొందించేందుకే నితీశ్‌ కుమార్‌ ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగారని, బీహార్‌లో బీజేపీకి పునరుజ్జీవం ఉండదని పేర్కొన్నారు. ఎన్‌డీఏ మునిగే నావ నుంచి ఒక్కో పార్టీ బయటపడుతోందని తెలిపారు. ఇక మిగిలేది బిజెపి మాత్రమేనని స్పష్టం చేశారు. మోడీ హయంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోయాయని విమర్శించారు. ఇండియన్‌ ఆర్మీని కూడా కాంట్రాక్ట్‌ లేబర్‌గా మార్చేశారని ఆరోపించారు. యువతను మోసం చేసిన మోడీ సర్కార్‌ను గద్దె దించడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీ తప్పుడు వాదనలు, వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ ్ద అబద్ధాల పార్టీ అని ధ్వజమెత్తారు. బీహార్‌ ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కసరత్తు ప్రారంభించగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.
కొత్త కూటమి ఏర్పాటు చేయాలి: సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌
భావసారూప్యత గల పార్టీలు ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు నిచ్చారు. దేశంలో బీజేపీ బలహీనమైన శక్తిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడిందని అన్నారు. అప్పుడు తమ పార్టీతో పాటు శివసేన, జేడీయూలతో కలిసి 'అసలు ఎన్డీఏ' ఏర్పడిందని గుర్తు చేశారు. ''అసలు ఎన్‌డీఏ ఇక్కడ కూర్చొని ఉన్నది. అది శివసేన, అకాలీదళ్‌, జేడీయూలు కలిసి స్థాపించినట్టు తెలిపారు. బీజేపీ చిన్న పార్టీగా ఉన్నప్పుడు ఆపార్టీకి మేం అండగా నిలిచాం. కానీ ఇప్పుడు రైతులు, కార్మికుల కోసం ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది'' బాదల్‌ అన్నారు. భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ రైతులు, వ్యవసాయ కూలీల జెండా కింద ఏకమై వారి సంక్షేమం కోసం పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రధాన కార్యదర్శి అభరు చౌతాలా, అరవింద్‌ సావంత్‌ (శివసేన), కెసి త్యాగి (జేడీయూ), మేవర్‌ కుమార్‌ జమాటియా (ఐపీఎఫ్‌టీ) 11 రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరయ్యారు. డీఎంకే, టీఎంసీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, ఎస్‌పీ, జేడీఎస్‌ తదితర పార్టీల నేతలు హాజరు కాలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.