Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేద విద్యార్థులపై ఫీజుల భారం.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 28,2022

పేద విద్యార్థులపై ఫీజుల భారం..

- కేంద్ర నిధులపై ఆధారపడరాదంటూ మోడీ సర్కార్‌ ఆదేశాలు
- ఐఐటీ బాంబేలో 53శాతం ఫీజుల పెంపు
- 500శాతం పెరిగిన ఎం.టెక్‌ ట్యూషన్‌ ఫీజు
- ఫీజులు భరించలేక అడ్మిషన్లు తీసుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీలు
- గతేడాది 63శాతం తగ్గిన రిజర్వ్‌డ్‌ కేటగిరీ అడ్మిషన్లు..
- ఉన్నత విద్య ప్రయివేటీకరణే అసలు ఉద్దేశం : రాజకీయ విశ్లేషకులు
            దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అన్నిరకాల ఫీజులు భారీగా పెరిగాయి. ఐఐటీ, బాంబేలో ట్యూషన్‌ ఫీజు, పరీక్షల ఫీజు, హాస్టల్‌ రెంట్‌, మెస్‌, సెక్యూరిటీ డిపాజిట్లు..ఇలా అన్నీ పెంచేశారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థుల ఫీజుల్లోనూ పెంపుదల 53.21శాతంగా ఉంది. ఎం.టెక్‌ ట్యూషన్‌ ఫీజు 500శాతం పెరిగింది. ఇది ఐఐటీలకే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, అలహాబాద్‌, హైదరాబాద్‌..అన్ని నగరాల్లోనూ సెంట్రల్‌ వర్సిటీలు, విద్యా సంస్థల్లో ఫీజులు పెంచుకోవాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడటం తగ్గించుకోవాలని మోడీ సర్కార్‌ ఆదేశాలు పంపింది. ఇదంతా కూడా పేద, అణగారిన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఉన్నత విద్యారంగంలో మోడీ సర్కార్‌ చేపడుతున్న మార్పులు..అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఓ వైపు విద్యారంగాన్ని ప్రయివేటీకరిస్తూనే, మరోవైపు ప్రభుత్వరంగంలోని వర్సిటీల్లో ఫీజులు భారీగా పెంచుతూ వస్తోంది. ఈ ఫీజుల భారాన్ని తట్టుకోలేక అనేకమంది ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు అడ్మీషన్లు తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. దాంతో దేశవ్యాప్తంగా ఐఐటీలు, వర్సిటీల్లో ఫీజు పెంపును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉన్నత విద్యారంగంలో నిధుల వ్యయాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ...కొత్త పాలసీలను పాలకులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇదంతా కూడా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఐఐటీల్లో, ఢిల్లీ, ముంబయి, అలహాబాద్‌, హైదరాబాద్‌..మొదలైన నగరాల్లోని వర్సిటీల్లో వివిధ కోర్సుల ఫీజులు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఉన్నత విద్యారంగాన్ని 'వ్యాపారాత్మకం' చేయాలన్న వ్యూహంలో భాగంగానే పాలకులు గతకొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్సిటీల్లో ఫీజుల పెంపు వివాదానికి మూలం 2016లో కేంద్రం తీసుకొచ్చిన హెచ్‌ఈఎఫ్‌ఏ. దీనికి అప్పటి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 'హెచ్‌ఈఎఫ్‌ఏ' ఫండ్స్‌ వర్సిటీలో వసతుల కల్పనకు ఉపయోగపడతాయని బడ్జెట్‌ ప్రసంగంలో ఆనాటి కేంద్ర ఆర్థికమంత్రి దేశ ప్రజలకు తెలిపారు. దీంతో సెంట్రల్‌ వర్సిటీలు రుణాలు చేసి నిధులు సమకూర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. విద్యార్థులపై వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ..రుణాల ఈఎంఐలు చెల్లించాలని కేంద్రం వర్సిటీలకు దిశానిర్దేశం చేసింది.
ప్రతిఏటా రుణ వాయిదా చెల్లించాల్సిందే
            హెచ్‌ఈఎఫ్‌ఏ తీసుకొచ్చాక ఈ పథకం కింద తొలుత రుణాలు అందుకున్న విద్యా సంస్థలు ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ. ఈ నిధులు అందాయో లేదో..ఐఐటీ బాంబే, ఢిల్లీలో ఫీజులు భారీగా పెంచేశాయి. ఫీజుల పెంపు వాస్తవమేనని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ ధ్రువీకరించారు. ఉదాహరణకు ఐఐటీ బాంబే అంతర్గత నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కోర్సుల ఫీజులు భారీగా పెంచేసింది. హెచ్‌ఈఎఫ్‌ఏ కింద మంజూరైన రుణాలు దాదాపు రూ.42కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పదవ వంతు ప్రతి ఏటా ఆ విద్యా సంస్థ చెల్లించాల్సి వస్తోంది. వర్సిటీ అంతర్గత నిధుల సమీకరణ పెంచుకోవాలని అలహాబాద్‌ వర్సిటీకి కేంద్రం ఇటీవల ఆదేశాలు పంపింది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహకారంపై ఆధారపడటం తగ్గించుకోవాలని కచ్చితంగా తెలిపారని వర్సిటీ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జయ కపూర్‌ తెలిపారు.
ఎన్‌ఈపీలో భాగంగానే..
            నూతన జాతీయ విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగానే 'హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ' (హెచ్‌ఈఎఫ్‌ఏ) పథకాన్ని మోడీ సర్కార్‌ తీసుకొచ్చిందని సమాచారం. ఉన్నత విద్యారంగాన్ని క్రమక్రమంగా ప్రయివేటీకరించాలన్నదే 'ఎన్‌ఈపీ'లోని ప్రధాన లక్ష్యం. దీనిపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, 2016లో హెచ్‌ఈఎఫ్‌ఏను కేంద్రం తెరపైకీ తీసుకొచ్చింది. ఈ రుణ పథకాన్ని అన్ని విద్యా సంస్థల్లో అమలు చేయాలని వివిధ రాష్ట్రాలకు ఆదేశాలు సైతం జారీచేసింది. గత ఐదేండ్లుగా తొలుత ఐఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో అమలుచేస్తోంది. కేంద్ర నిధులపై ఆధారపడరాదని, వర్సిటీలు స్వంతంగా నిధుల సమీకరణ పెంచుకోవాలని మోడీ సర్కార్‌ చెబుతోంది. గతకొన్నేండ్లుగా విద్యాసంస్థల్లో పెరిగిపోయిన ఫీజుల దెబ్బకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థుల అడ్మీషన్లు పడిపోతున్నాయి. ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అడ్మీషన్లు గణనీయంగా పడిపోయాయి. టాప్‌-7 ఐఐటీల్లోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో గత ఐదేండ్లలో రిజర్వ్‌డ్‌ కేటగిరీ అడ్మీషన్లు 63శాతం తగ్గాయని పార్లమెంట్‌లో కేంద్రమే వెల్లడించింది. అడ్మీషన్లు పడిపోవటానికి ఫీజుల పెంపు ప్రధాన కారణమని విమర్శలున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.