Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రోజ్‌గార్‌ మేళా...మరో దగా... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 26,2022

రోజ్‌గార్‌ మేళా...మరో దగా...

- ఎన్నికలవేళ..ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న ప్రధాని మోడీ
- ఇప్పుడు..10 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామంటూ ప్రకటన
- ఆందోళనబాట పడుతున్న యువత దృష్టి మరల్చడమే ప్రధాని వ్యూహం : రాజకీయ విశ్లేషకులు
- మేక్‌ ఇన్‌ ఇండియా ఎంత నిజమో..ఇదీ అంతే..
- 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత హడావిడి
న్యూఢిల్లీ : ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతోంది. బి.టెక్‌, ఎం.టెక్‌, ఎంబీఏ, ఎంసీఏ.. చదివినా..చిన్న ఉద్యోగం కూడా ప్రభుత్వరంగంలో దొరకటం లేదన్న అసంతృప్తి యువతను వేధిస్తోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రధాని మోడీ...గత 8ఏండ్లుగా దానిపై మాట్లాడలేదు. కొత్తగా 'రోజ్‌గార్‌ మేళా' ప్రారంభించారు. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఖాళీలున్నా.. కేంద్రం భర్తీ చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నవేళ.. కేంద్రం కొత్త పథకానికి తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉపాధి సమస్యపై ఎక్కడికి వెళ్లినా..అనేక గొంతులు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మోడీ సర్కార్‌ కొత్త మోసానికి తెరలేపిందని విశ్లేషకులు చెబుతున్నారు. 10లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామని మోడీ సర్కార్‌ ప్రచారానికి తెరలేపింది. భారత్‌లో తీవ్రరూపం దాల్చిన ఉపాధి సమస్యకు ఇది పరిష్కారం కాదని, కేవలం రాజకీయాల కోసం చేస్తున్న హంగామా తప్ప మరోటి కాదని విమర్శలు వస్తున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ దేశంలో ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటిదేనని...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువత ప్రశ్నించకుండా, వారి దృష్టి మరల్చడానికి వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఏమిటీ రోజ్‌గార్‌..
             10లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నామని గత శనివారం ప్రధాని మోడీ రోజ్‌గార్‌ మేళాను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. మొదటి దశలో భాగంగా 38 కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లోని 75వేల ఖాళీల్ని భర్తీ చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని గత కొన్నాండ్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడీ రోజ్‌గార్‌ మేళా వాటి భర్తీ కోసమే అన్నట్టు మీడియాలో కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అధిష్టానం మొదలుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. 8ఏండ్లలో గుర్తుకు రానిది, ఇప్పుడు హఠాత్తుగా రోజ్‌గార్‌ మేళా ఏంటని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. గుజరాత్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హడావిడి ఎక్కువగా కనపడుతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉద్యోగ మేళా పేరు చెప్పుకుంటూ ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తున్నారు.
యువత ఆగ్రహం చల్లారుతుందా?
             ఉపాధి సమస్యతో బాధపడుతున్న యువత మోడీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉంది. దీనిని చల్లార్చడానికి మోడీ సర్కార్‌ రకరకాల సర్కస్‌ ఫీట్లు చేస్తోంది. ఇలాగే సెప్టెంబర్‌ 2014లో 'మేక్‌ ఇన్‌ ఇండియా' పేరుతో హడావిడి చేసింది. దీని ద్వారా ఉత్పత్తిరంగం విస్తరించి..కొత్త ఉద్యోగాలు ఏర్పడి ఉంటే, మనదేశంలో నిరుద్యోగం, ఉపాధి సమస్య తీవ్రస్థాయికి ఎందుకు చేరుకుంటుంది? రోజ్‌గారీ మేళాపై యువతలో నమ్మకం లేదు. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేనా? ప్రయివేటు రంగంలో స్టార్టప్‌ల ద్వారా ఏర్పడేవి రోజ్‌గార్‌ మేళా ఖాతాలో వేస్తారా?అన్నది తెలియదు. 'అగ్నిపథ్‌' నియామకాలు కూడా ఇందులో కలుపుతోంది. రైల్వే నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. పీఈటీ ఉద్యోగాలను యోగి సర్కార్‌ ప్రకటించింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది. కాగా యూపీలో 37లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ పరీక్షలకు నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఇబ్బందిపడినట్టు మీడియా కథనాలు వచ్చాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.