Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుజరాత్‌లో ఘోర ప్రమాదం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 31,2022

గుజరాత్‌లో ఘోర ప్రమాదం

- మోర్బీలో కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జి
- 70 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం
- ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది
- బ్రిడ్జి 140 ఏండ్ల బ్రిటీషు కాలం నాటిది
- ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా ఐదురోజుల క్రితమే రీఓపెన్‌.. అంతలోనే ప్రమాదం
- సామర్థ్యానికి మించిన బరువే కారణం?
గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మోర్బీలోని మచ్చూ నదిపై నిర్మించిన బ్రిటీషు కాలం నాటి 140 ఏండ్ల చరిత్ర కలిగిన కేబుల్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 70 మంది మంది వరకు మృతి చెందారు. పలువురికి గాయాల య్యాయి. వీరిలో మహిళలో, చిన్నారులూ ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవటంతో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా భయానకంగా మారింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మంది ఉన్నారు. వీరిలో వంద మంది నదిలో పడిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రక్షణ చర్యలను కొనసాగించాయి. ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించటానికి అధికారులు, పోలీసులు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అయితే, ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్యపై గుజరాత్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు.అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బ్రిడ్జి కూలిపోయిన సమయంలో కొందరు బ్రిడ్జి కేబుల్‌పై వేలాడుతూ కనిపించారు. నదిలోని లోతులేని ప్రాంతాల్లో చాలా మంది నడుము లోతు నీటిలో మునిగిపోయారు. నదిలో పడిపోయినవారిలో కొందరు ఇతరులను కాపాడిన దృశ్యాలు కనిపించాయి. బాధితులు సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు వినిపించాయి. ఇటీవల మరమ్మతులకు నోచుకున్న ఈ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం అధిక సంఖ్యలో సందర్శకుల తాకిడితో బరువును తట్టుకోలేక కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు. '' బ్రిడ్జి కూలిపోవటంతో చాలా మంది సందర్శకులు నదిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక మంది గాయాలపాలైనట్టు వార్తలు వస్తున్నాయి. వారిని ఆస్పత్రులకు తరలించాం'' అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి బ్రిజేశ్‌ మేర్జా అన్నారు. 70 మంది వరకు మృతి చెందారని చెప్పారు.
ఈ ప్రమాదంపై భారత ప్రధాని మోడీ గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, ఇతర అధికారులతో మాట్లాడారు. సహాయక బృందాలను వెంటనే మోహరించాలనీ, పరిస్థితిని దగ్గరగా, నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. బాధితుల కోసం వీలైనంతవరకు సహాయం అందించాలని సీఎంకు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోనే ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మోడీ రూ. 2 లక్షల ఎక్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50వేల ప్రకటించారు. ఈ ఘటనపై ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్‌ చేశారు.
దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యుల కమిటీ
             కాగా, మృతుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు. ప్రమాద ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ రాజ్‌కుమార్‌ బేణివాల్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో సహాయక చర్యలను పర్యవేక్షించటానికి సీఎం భూపేందద్ర పటేల్‌తో సహా ఇతర మంత్రులు మోర్బీకి తరలారు.
ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకుండానే రీఓపెన్‌
             మని మందిర్‌ దగ్గర మచ్చూ నదిమీద నిర్మించిన ప్రసిద్ధమైన సస్పెన్షన్‌ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పున:ప్రారంభించారు. మరమ్మతుల కోసం ఆరు నెలల పాటు ఈ బ్రిడ్జిని మూసివేశారు. మరమ్మతులకు దాదాపు రూ. 2 కోట్లను ఖర్చు చేశారు. అయితే, ఈ బ్రిడ్జ్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకుండానే రీఓపెన్‌ చేసినట్టు తెలుస్తున్నది. ఒక ప్రయివేటు ట్రస్టు ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించిందనీ, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించకుండానే బ్రిడ్జి ప్రారంభమైందని మోర్బీ మునిసిపాలిటీ అధికారులు తెలపటం గమనార్హం.
బ్రిడ్జి చరిత్ర
             ఈ బ్రిడ్జికి 140 ఏండ్ల చరిత్ర ఉన్నది. బ్రిటీషుకాలంలో దీనిని నిర్మించారు. 1879, ఫిబ్రవరి 20న దీనిని అప్పటి ముంబయి గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ఆవిష్కరించారు. బ్రిడ్జి నిర్మాణం 1880లో పూర్తయ్యింది. దీనికి మొత్తం రూ. 3.5 లక్షల వరకు ఖర్చయ్యింది. నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అంతా ఇంగ్లాండ్‌ నుంచే వచ్చింది. దర్బార్‌గర్‌ నుంచి నజర్‌బాఫ్‌ుకు కలిపేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం ఈ వేలాడే వంతెన మహాప్రభుజీని, మొత్తం సమకంత ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జి పొడవు దాదాపు 765 ఫీట్లు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.