Authorization
Tue May 06, 2025 06:26:22 am
శ్రీనగర్ : ప్రస్తుతం జమ్ముకాశ్మీర్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్లో జరిగిన ప్రముఖ కాశ్మీరీ పండిట్ కార్డియాలజిస్టు డాక్టర్ ఉపేంద్ర కౌల్ రచించిన ది హర్ట్ స్పీక్స్ అనే పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. 1990కి ముందు ముస్లింలు, కాశ్మీరీ పండితులు కలిసిమెలసి జీవించేవారని, తరువాత జరిగిన సంఘటనలతో పండిట్లు ఇళ్లు వదలాల్సి వచ్చిందని, తమ భూములను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'పండిట్ల బాధను మేము (ముస్లింలు) నిశ్శబ్దంగా చూస్తున్నాము. ఎందుకంటే మేం కూడా తుపాకీలకు భయపడుతున్నాం' అని అన్నారు. తాము గతంలో ఎప్పుడూ తుపాకీలను చూడలేదని, తాము కోడిని కూడా చంపడానికి భయపడే వ్యక్తులమని చెప్పారు. ముస్లిం-పండిట్ల మధ్య సంబంధాలు పునరుద్దరించబడాలని అబ్దుల్లా కోరుకున్నారు.