Authorization
Wed May 07, 2025 07:43:08 am
- సిలిగురిలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీ
సిలిగురి : పశ్చిమ బెంగాల్లో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విభజన రాజకీయాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో సిపిఎం ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి బాగజతిన్ పార్కులో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజానీకం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీజేపీ, టీఎంసీలు ప్రజలను కులాలు, మతాల పేరుతో విభజించి, వారి మధ్య కలహాలు సృష్టించి లబ్ధిపొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం, పార్టీ నాయకులు అశోక్ భట్టాచార్య, జివిఎస్ సర్కార్, మీనాక్షి ముఖర్జీ తదితరులు ప్రసంగించారు.