Authorization
Wed May 07, 2025 03:39:28 pm
న్యూఢిల్లీ : డిసెంబరు 5 నుంచి మరో వారం రోజుల పాటు మూడవ విడతలో ఎన్నికల బాండ్ల జారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలు జరిగే సంవత్సరాల్లో బాండ్ల కోసం అదనంగా పక్షం రోజులు కేటాయించేందుకు వీలుగా ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రభుత్వం గత నెలలో సవరించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 29 ఎస్బీఐ శాఖల ద్వారా 24వ విడత ఎన్నికల బాండ్ల జారీని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. డిసెంబరు 5 నుండి 12వరకు ఈ బాండ్లను జారీ చేయడం, నగదు చేసుకోవడం ఈ శాఖల ద్వారా చేయవచ్చు. ఒరిజినల్ పథకం ప్రకారం అక్టోబరులో పదిరోజుల పాటు బాండ్ల అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత సవరించిన నిబంధనల మేరకు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు నవంబరు 9నుంచి వారం పాటు సాగాయి.