Authorization
Wed May 07, 2025 03:13:03 am
మధ్యప్రదేశ్: భారత వాయు సేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు శనివారం కుప్ప కూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు, రాజస్థాన్లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైనట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోరు-30, మిరాజ్ 2000 విమానాలు కాసేపటికే మెరెనా ప్రాంతంలో కూలిపోయాయి. కాగా రాజస్థాన్లోని భరత్పూర్లో వాయుసేనకు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్వల్పగాయాలయ్యాయి.