Authorization
Tue May 06, 2025 09:22:09 am
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను త్వరగా లిస్టింగ్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఈ పిటిషన్లను త్వరగా విచారించాల్సిన అవసరం ఉందని పిటీషన్‌దారుల్లో ఒకరి తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరిసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణకు గతంలోనే ఐదుగురు జడ్జిలతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులోని అప్పటి ప్రధాన న్యాయమూరి ఎన్వి రమణ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఈ ధర్మాసనాన్ని మళ్లీ ఏర్పాటు చేయాల్సి ఉన్నది.