Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పు డప్పు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2023

అప్పు డప్పు

- రుణ ఊబిలో  గుజరాత్‌ అన్నదాత
- ప్రతి రైతు కుటుంబానికి సగటున రూ.56వేల అప్పు
- బీహార్‌లోరూ.23వేలు.. ఛత్తీస్‌గఢ్‌లో రూ.21వేలు
- 40లక్షల కుటుంబాలకు వ్యవసాయమే ఉపాధి
- ఆదాయం కాదు.. అప్పులు రెండింతలు : నిపుణులు
            దేశానికే మోడల్‌ గుజరాత్‌ రాష్ట్రమంటూ మోడీ మొదలుకుని బీజేపీ నేతలంతా తెగ ప్రచారం చేస్తారు. వాస్తవానికి అక్కడి దుర్భర పరిస్థితుల గురించి కానీ, దయనీయ బతుకుల గురించి కానీ ఎక్కడా చర్చల్లోకి రావు. పత్రికల్లోనూ కనిపించవు. ఎందుకంటే కార్పొరేట్‌ మీడియా గుజరాత్‌ లో దాగిన గుట్టు విప్పకుండా ..స్వామి భక్తి చాటుకుంటూ ఉంటోంది. గుజరాత్‌ లో కనిపించేదంతా మేడిపండు లాంటి అభివృద్ధేనని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా గుజరాత్‌ లో అన్నదాత అప్పుల్లో ఏ విధంగా కూరుకుపోతున్నాడో..సగటున అతని కుటుంబంపై ఎంత భారం ఉన్నదో.. తాజా గణాంకాల్లో తేటతెల్లమైంది.
న్యూఢిల్లీ : పెట్టుబడులు పెరిగాక సేద్యం భారమవుతోంది. అప్పులు తీసుకుని పంట వేస్తే గిట్టుబాటు ధరరాక అన్నదాత అల్లాడిపోతున్నాడు. మరోవైపు తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకులు డప్పు వేయిస్తూ ఆస్తులకు వేలం వేస్తున్నాయి. ఇక దేశానికే గుజరాత్‌ మోడల్‌ అంటూ చెప్పుకుంటుంటే.. మరోవైపు మిగతా రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్‌ రైతాంగం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నదని కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్‌, ప.బెంగాల్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌..తదితర రాష్ట్రాలు..గుజరాత్‌ కన్నా మెరుగ్గా ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల విడుదల చేసిన 2021-22 నివేదిక ప్రకారం, గుజరాత్‌లో 66 లక్షల 2 వేల 700 వ్యవసాయ కుటుంబాలు న్నాయి. ఇందులో 40 లక్షల 36 వేల 900 కుటుంబాలకు వ్యవసాయ పనులే ఆధారం. రాష్ట్ర జనాభాలో 61శాతం కుటుంబాలకు వ్యవసాయమే ఉపాధి చూపుతోంది. రైతు కుటుంబాలు కలిగివున్న సగటు భూమి కేవలం 1.4 ఎకరాలు. సగటు భూమి విషయంలో గుజరాత్‌ దేశంలో 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై రూ.56,568 అప్పు ఉంది. ఇదే విషయమై బీహార్‌లో సగటు అప్పు రూ.23వేలు, ప.బెంగాల్‌లో రూ.26వేలు, ఒడిషాలో రూ.32వేలు, ఛత్తీస్‌గఢ్‌లో 21వేలు, ఉత్తరాఖండ్‌లో రూ.48వేలుగా ఉన్నదని నివేదిక తెలిపింది.ఆదాయంలోనూ బీహార్‌, ప.బెంగాల్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌లకన్నా గుజరాత్‌ ఎంతగానో వెనుకపడింది. సగటున ఒక రైతు కుటుంబానికి వస్తున్న పంట ఉత్పత్తి ఆదాయం రూ.4318. పశువులపెంపకంపై రూ.3477, కూలి పనులతో రూ.4415, భూమిపై కౌలు ఆదాయం రూ.53..మొత్తం సగటు నెల ఆదాయం రూ.12,631గా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, అధికార బీజేపీ చెప్పేది మరోలా ఉంది. వ్యవసాయరంగంలో దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో గుజరాత్‌ ఉందని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.
అప్పులు రెండింతలు : హేమంత్‌ షా, ఆర్థికవేత్త
            రైతుల అప్పుల్లో పెరుగుదలను గమనిస్తే, వారు ఎంతటి సమస్యల్లో ఉన్నారన్నది అర్థమవుతోంది. పెరిగిన అప్పులకు అనుగుణంగా వారి ఆదాయం పెరగలేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత పాలకులు ఎన్నో వాగ్దానాలు చేశారు. తాజా డాటా ప్రకారం రైతు రుణాలు రెండింతలు అయ్యాయి. రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం.
భారీగా పెరిగిన సాగు వ్యయం : రాజేంద్ర ఖిమానీ, వైస్‌ ఛాన్స్‌లర్‌, గుజరాత్‌ విద్యాపీఠ్‌
            పంట సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా పంట చేతికొచ్చాక..వాటికి కనీస మద్దతు ధర లభించటం లేదు. దాంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ఇన్‌పుట్‌ ధరలు గత మూడేండ్లలో 60శాతం పెరిగాయి. పంట ఉత్పత్తి ధరలు కనీసం 30శాతం కూడా పెరగలేదు. సాగు ఖర్చులు, పంట అమ్మకం ధరకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. ఆహార పంటలు (వరి, గోధుమ, పప్పుదినుసులు) కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, కాఫీ, నూనె గింజలు, చెరుకు సాగు చేయటానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌ శక్తులు వ్యవసాయరంగాన్ని శాసించటం మొదలైంది. రైతుల అప్పులు పెరగటానికి ఇది కూడా ఒక కారణం.
గతంలో తీసుకున్నవి తీర్చలేకపోతున్నాం : రమేష్‌ పటేల్‌, దక్షిణ గుజరాత్‌కు చెందిన రైతు
            ఎరవుల ధరలు పెరిగాయి. విత్తనాల ధరలు రెండింతలు అయ్యాయి. వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్‌ ధర విపరీతంగా పెరిగింది. ఇన్‌పుట్‌ ఖర్చులు భారీగా పెరగటంతో రైతుల ఆదాయం తగ్గింది. గతంలో తీసుకున్న అప్పులు తీర్చడానికే రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
సాగు రుణాలు రూ.96,963 కోట్లు
            పార్లమెంట్‌కు సమర్పించిన డేటా ప్రకారం, గుజరాత్‌లో వ్యవసాయ రుణాలు 2019-20లో రూ.73,228 కోట్లు. 2021-22 నాటికి రూ.96,963 కోట్లకు చేరుకున్నాయి. రెండేండ్లలో క్రెడిట్‌ ప్రోగ్రాం కింద రుణాల పరిమాణం 45శాతం పెరిగింది. ఒక్కో బ్యాంక్‌ ఖాతాలో రుణం రూ.1.7 లక్షల నుంచి రూ.2.48లక్షలకు చేరుకున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.