Authorization
Tue May 06, 2025 03:14:50 am
నవతెలంగాణ:గౌతం అదానీ గ్రూప్ కంపెనీలపై ఓ వైపు తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తుంటే, అహ్మదాబాద్‌లో అత్యంత విలువైన భూమిని కట్టబెట్టడానికి గుజరాత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్ఈజెడ్, టౌన్షిప్ నిర్మాణం కోసం అదానీ గ్రూప్ 94వేల చదరపు మీటర్ల భూవి కావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇదిగాక, గాంధీనగర్‌కు సమీపంలోని జాస్పూర్ గ్రామంలో 202 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వ్యవసాయేతర భూమిని ఇవ్వాలని అదానీ గ్రూప్ బీజేపీ సర్కార్‌ను కోరింది. అహ్మదాబాద్‌కు సమీపంలో ఖోదియార్ గ్రామ పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)ని, జాస్పూర్లో టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని అదానీ గ్రూప్ తెలిపింది.