Authorization
Mon April 14, 2025 08:17:22 pm
- నిర్వహణలో లేని భారీ నగదు..కేంద్రం
న్యూఢిల్లీ : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో నిర్వహణలో లేని ఖాతాల్లో రూ.4,962.70 కోట్ల నిధులు ఉన్నాయని కేంద్ర కార్మికశాఖమంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు. 2022 మార్చి 31 నాటికి ఈ మొత్తం పేరుకుపోయిందని మంత్రి లోకసభకు తెలిపారు. అయితే వీటికి హక్కుదారులున్నారని పేర్కొన్నారు. వరుసగా 36 నెలల పాటు ఏదైనా పీఎఫ్ ఖాతాలో నగదు జమ కాకపోతే వాటిని నిర్వహణలోని లేని ఖాతాలు (ఇన్ ఆక్టివ్)గా గుర్తిస్తారు. వీటికి వడ్డీ మాత్రం జమ అవుతూ ఉంటుందని మంత్రి తెలిపారు.