Authorization
Mon April 14, 2025 07:55:05 pm
- ప్రారంభించిన కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్
కేరళ : వైకోమ్ సత్యాగ్రహ 100వ వార్షికోత్సవ వేడుకలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ సంయుక్తంగా వైకోమ్లో ప్రారంభించారు. ట్రావెన్ కోర్ సంస్థానంలోని వైకోమ్ పట్టణంలో కులవ వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా మార్చి30, 1924 నుంచి నవంబర్ 23,1925 వరకు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం విదితమే. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా దళితుల ఆలయ ప్రవేశ ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.