Authorization
Mon April 07, 2025 08:54:20 pm
- సుప్రీంకోర్టులో కేంద్రం
న్యూఢిల్లీ : నూతన సమాచార రక్షణ బిల్లు సిద్ధమైందని, దానిని రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్రప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలో అజయ్ రస్తోగీ, అనిరుద్ధ బోస్, హృషీకేశ్ రాయ్, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ జోసఫ్ జూన్ 16న పదవీవిరమణ చేస్తున్నందున కొత్త బెంచ్ ఏర్పాటు కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు నివేదించనున్నట్లు తెలిపింది. వినియోగదారులు చేసుకున్న కాల్స్, పంపిన ఫొటోలు, వీడియోలు, పత్రాలను మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించి వాట్సప్, దాని మాతృసంస్థ ఫేస్బుక్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తోంది. ఈ ఒప్పందం తమ వ్యక్తిగత గోప్యతకు, వాక్ స్వాతంత్య్రానికి భంగకరమని పిటిషనర్లు వాదించారు.