Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాడిన కమలం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2023

వాడిన కమలం

- కర్నాటక కాంగ్రెస్‌దే
-
136 స్థానాలతో జయభేరి
- 12 మంది మంత్రుల ఓటమి
- 31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ 
- జేడీ (ఎస్‌) ఆశలు గల్లంతు

- 'గాలి'కి కొట్టుకుపోయిన కేఆర్‌పీపీ 
- నేడు కేసీఎల్‌పీ భేటీ

         బీజేపీ విద్వేష రాజకీయాన్ని కన్నడ ఓటర్లు తిరస్కరించారు. కర్నాటకలో హిందుత్వ పేరుతో ఆపార్టీ చేసిన వికృత చేష్టలను బ్యాలెట్‌ బాక్సుల తీర్పు ద్వారా కన్నడిగులు తిప్పికొట్టారు. గడచిన 34 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. కేవలం వ్యక్తి పూజతో మోడీని ఆకాశానికెత్తి ఓట్లు దండుకోవాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనల్ని కర్నాటక ఓటరు పట్టించుకోలేదు. ప్రధాని మోడీ చరిష్మా కరిగిపోయిందని ఈ ఎన్నికలతో తేలిపోయింది. కర్నాటకలో మరోసారి విజయం సాధించి, క్రమంగా దక్షిణాదిని ఆక్రమించాలనే మోడీ, అమిత్‌ షా ద్వయం ఆశలు ఆవిరయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ కన్నడ తీర్పు పునరావృతం అవుతుందంటూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షపార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో సాధించిన విజయానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఈ ఎన్నికల ప్రభావం కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపైనా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ చేస్తున్న  ప్రయత్నాలను ఓటర్లు సమర్ధవంతంగా తిప్పికొడతారనే భరోసాను అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యక్తం చేసింది బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలను కర్నాటక ఫలితాలు  వెల్లడించాయని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తున్నది. ఏదేమైనా కన్నడిగుల తీర్పు దేశ రాజకీయాలను గట్టిగానే ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ఓటమిని సహించలేని బీజేపీ ప్రజల్ని చీల్చేందుకు మరిన్ని ప్రమాదకర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు : కర్నాటకలో 'కమలం' వాడిపోయింది. మోడీ గారడీలు, ఆ పార్టీ కుటిల యత్నాలు ఏవీ పని చేయలేదు. ఎన్నికలలో మరోసారి విజయం సాధించి దక్షిణాదిలో బలోపేతానికి పునాదులు వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు మాత్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిన బీజేపిని చావుదెబ్బ కొట్టి విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తున్నా ఆశ చావని కమలనాథులు జేడీ (ఎస్‌) నేత కుమారస్వామితో మంత నాలు మొద లెట్టారు. హంగ్‌ ఏర్పడితే సంకీర్ణ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న అత్యాశతో 'ప్లాన్‌ బీ' అమలుకు ప్రయత్నాలు జరిపారు. అయితే చివరికి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ లభించడంతో బీజేపీ నేతలు నిరాశానిస్పృహలలో మునిగిపో యారు. కర్నాటక పట్టణ ప్రాంతాలలో బీజేపీ తన పట్టును కొంతమేర నిలుపు కున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం మాత్రం కాంగ్రెస్‌కే జై కొట్టారు. 1990 తర్వాత ఏ పార్టీకీ ఇవ్వనంత మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. 'కింగ్‌ మేకర్‌ కాదు. మేమే కింగ్‌ అవుతాము' అంటూ బీరాలు పలికిన జేడీ (ఎస్‌) నేత కుమారస్వామి ఆశలు అడియాసల య్యాయి. ఆ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థానాలను కూడా కోల్పోయింది. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ సైతం ఓటమి చెందారు. ఆ పార్టీ ఓటుబ్యాంకును కాంగ్రెస్‌ భారీగా కొల్లగొట్టింది. ఆ పార్టీకి ఏకంగా 139 సీట్లలో డిపాజిట్లు దక్కలేదు. మరోవైపు బళ్లారి ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని యత్నించిన గాలి జనార్ధనరెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. ఆయన మినహా ఆయన ఏర్పాటు చేసిన పార్టీ కేఆర్‌పీపీలో ఒక్కరూ గెలవలేదు. చివరికి గాలి సతీమణి కూడా ఓడిపోయారు. ఒక్క కోస్తా ప్రాంతంలో మినహా బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. పైగా ఆ పార్టీ 31 స్థానాలలో ధరావతులు కోల్పోయింది. కర్నాటక ఎన్నికలలో బరిలో దిగిన అమ్‌ఆద్మీ పార్టీ ఒక్క సీటూ దక్కించుకోలేక చతికిలపడింది. ఆ పార్టీకి 209 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు కర్నాటక పీసీసీ నేడు సమావేశం అవుతుంది.
హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్‌పోల్స్‌ వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో కాంగ్రెస్‌ 136 సీట్లు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచింది. బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీ (ఎస్‌)కు 19, ఇతరులకు నాలుగు సీట్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే హైదరాబాద్‌ కర్నాటకలో కాంగ్రెస్‌కు 19, బీజేపీకి 9 స్థానాలు లభించాయి. పాత మైసూర్‌లో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. ఆ ప్రాంతంపై గంపెడాశలు పెట్టుకున్న జేడీ (ఎస్‌) 14 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ముంబయి కర్నాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు 33, బీజేపీకి 16 సీట్లు రాగా మధ్య కర్నాటకలో కాంగ్రెస్‌కు 26, బీజేపీకి 6 స్థానాలు దక్కాయి. ఒక్క కోస్తా కర్నాటక ప్రాంతంలో మాత్రం బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అక్కడ బీజేపీకి 12 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. గ్రేటర్‌ బెంగళూరులో రెండు పార్టీలకూ చెరో 16 స్థానాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతంలో (35.9%) పెద్దగా మార్పు రానప్పటికీ సీట్లను మాత్రం భారీగా కోల్పోయింది. మరోవైపు జేడీ (ఎస్‌) కోల్పోయిన ఐదు శాతం ఓట్లను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు 43% ఓట్లు, జేడీ (ఎస్‌)కు 13.3% ఓట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 40, జేడీ (ఎస్‌) 17 సీట్లు కోల్పోయాయి. బసవరాజ్‌ బొమ్మై కేబినెట్‌లోని 12 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. మంత్రి సోమన్న తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు.
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారు : రాహుల్‌ గాంధీ
విద్వేష రాజకీయాలను కర్నాటక ప్రజలు తిప్పి కొట్టారని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్‌ అవుతాయని చెప్పారు. ఇది బలవంతులపై బలహీనుల విజయమని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి రోజే అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో తాము ప్రేమతో పోటీ చేశాం తప్ప.. ద్వేషంతో కాదని పేర్కొన్నారు. కర్నాటక ప్రజలకు, గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రాహుల్‌ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.
నిర్ణయాత్మక తీర్పు ! : సీపీఐ(ఎం)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని రాష్ట్ర ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారని, బీజేపీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన అవినీతి, అసమర్ధపాలన తాలుకూ ఫలితం ఈ ఓటమి అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలో సాగిన తీవ్రమైన మత ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని ఈ తీర్పు రుజువు చేసింది. ప్రభుత్వం పట్ల తీవ్రంగా వున్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు బాగా కలిసి రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిందని పేర్కొంది. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన తీర్పునిచ్చిన కర్ణాటక ప్రజలను పొలిట్‌బ్యూరో అభినందించింది.
కాంగ్రెస్‌కు ఇది భారీ విజయం : సిద్ధరామయ్య
కర్నాటక ఎన్నిలక ఫలితాలు కాంగ్రెస్‌కు ఒక పెద్ద విజయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అగ్రనాయకులు సిద్ధరామయ్య అన్నారు. ఇది ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని తెలిపారు. నేడు(ఆదివారం) కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ మీటింగ్‌ ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ 130 సీట్లు సాధిస్తుందని తాను అంచనా వేశాననీ, ఆ మార్కును పార్టీ చేరుకున్నదని అన్నారు. '' ఈ ఎన్నికలు కీలకమైనవి. ఈ ఫలితం లోక్‌సభ ఎన్నికలకు గీటురాయి. బీజేపీని ఓడించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆశిస్తున్నాను. రాహుల్‌ గాంధీ కూడా ఈ దేశానికి ప్రధాని అవుతారని నేను ఆశిస్తున్నాను'' అని సిద్ధరామయ్య అన్నారు.
తెలంగాణలోనూ ఇవే ఫలితాలు
కర్నాటక ఫలితాలే తెలంగాణలో పునరా వృతం కాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని అన్నారు. భారత్‌ జోడోయాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చింద న్నారు. జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌ వరుస విజయాలు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక ఫలితాలనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాయకులు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె జానారెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. హిమాచల్‌లో తొలి విజయం, కర్నాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామన్నారు. చివరికి ఫైనల్స్‌ లో 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్‌ జెండా ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడం ద్వారా మోడీని, జేడీఎస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌ ను ఓడించామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలవొద్దని ప్రయత్నించిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆలోచనలను కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించారని చెప్పారు. కర్ణాటకలో మత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ..రాజకీయ అంశం కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు.
భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ నఫ్రత్‌ చోడో అంటూ ఇచ్చిన సందేశాన్ని విశ్వసించి కర్ణాటక ప్రజలు మోదీని ఓడించారన్నారు. రాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలను కోవడం బీజేపీ మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ సర్వశక్తులు ఒడ్డిందనీ, ఆ ఫలితాలు తమకు వెయ్యి ఎనుగుల బలానిచ్చాయని తెలి పారు. దక్షిణ భారతంలో బీజేపీకి స్థానం లేదనీ, అక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారని గుర్తు చేశారు. కుట్రలు, కుతంత్రాలతో జేడీఎస్‌ను గెలిపించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని వ్యాఖ్యానించారు.కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు బీఆర్‌ఎస్‌ కు ఇష్టం లేదనీ, అందుకే కర్నాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారన్నారు. 'కాంగ్రెస్‌ గెలుపును కెేటీఆర్‌ ప్రజాతీర్పుగా అభివర్ణించలేదు. కర్ణాటక తీర్పు తెలంగాణ మీద ఉండదు అంటున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు వారికిష్టం లేదు. మోడీ ఓడిపోతే టీఆర్‌ఎస్‌ వాళ్లు ఎందుకు అంత బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు' అన్నారు.
ఇక్కడ పనిచేయదు
కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటకవాసులకు ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్‌, బెంగళూరుల మధ్య ఆరోగ్యకరమైన పోటి నెలకొనాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీని చావు దెబ్బ కొట్టారు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీయాలని చూసిన బీజేపీని కర్ణాటక ప్రజలు చావుదెబ్బ కొట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలతో కాంగ్రెస్‌ నేతలపై కేంద్రం దాడులు చేయించిందని గుర్తుచేశారు. అక్కడ ఊరురా మఠాలు ఉన్నాయని, బీజేపీకి మఠాలపై ప్రేమలేదనే విషయాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. దక్షిణ భారత దేశాన్ని, ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అవమానించిన ఆ పార్టీకి భంగపాటు తప్పలేదని చురకలంటించారు.
మోడీకి ప్రజలు బుద్ధి చెప్పారు..
కేంద్రంలో మోడీ ప్రభుత్వ దుర్మార్గపూరిత చర్యలకు కర్నాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అవినీతికి ఆలవాలంగా నిలిచిందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులు 40 శాతం పక్కదోవ పట్టడంతో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. కర్నాటక ఎన్నికల్లో మోడీ ప్రచారంలో భాగంగా 'జై భజరంగబలి' అంటూ నినాదాలు ఇస్తూ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడటాన్ని ఖండించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.