Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
- పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
నవతెలంగాణ-కెరమెరి
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని అదనపు కలెక్టర్ చహత్ బాజ్ పాయి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ టీచర్లకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పట్ట ప్రత్యే శ్రద్ధవహించాలన్నారు. కెరమెరి 1వ అంగన్వాడీ కేంద్రంలో స్టోర్ రూంను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న అవసరం లేని సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. పిల్లలకు అందించే పౌష్ఠికాహారం పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలన్నారు. బాలామృతం ప్యాకెట్లు రంద్రాలు పడి ఉండడం వల్ల అంగన్వాడీ టీచర్‌పై అసహనం వ్యక్తం చేశారు. గుడ్లను, పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో పరిశుభ్రత పాటించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలలో చెత్త, చెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు. పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. అనంతరం కెరమెరి2 కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరుపై అడిగి తెల్సుకున్నారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలోని మురికికాలువలో మురికి నీరు నిల్వ ఉండడంతో కాలువలో పేరుకు పోయిన బురదను తొలగించాలన్నారు. తాగు నీటి సమస్యపై అంగన్వాడీ టీచర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది వివరాలను డాక్టర్ వెంకటేష్‌ను అడిగి తెల్సుకున్నారు. ధనోరలోని పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందూర్ మోతీరాం, ఉప సర్పంచ్ నిసార్ అహ్మద్, పీఆర్ ఏఈ స్టీఫెన్, ధనోర ఉప సర్పంచ్ రిజ్వాన్, ఉత్తం నాయక్, పాల్గొన్నారు.