Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దిలావర్పూర్
మండల కేంద్రంలో సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున కర్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ వాహనదారులు వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు కచ్చితంగా కలిగి ఉండాలని, వాహనాలపై ఉన్న జరిమానాలు ఎప్పటికప్పుడు మీసేవ కేంద్రాల్లో చెల్లించుకోవాలన్నారు. సైబర్ నేరాగాల్లు చాక చాక్యంగా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే వారికి ఎలాంటి వివరాలు ఇవ్వద్దని, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరగాల్ల బారినపడి మోసానికి గురైన వారు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేశారు. బాలికలకు ప్రేమ పేరుతో హింసించడం, మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. కార్డెన్ సర్చ్‌లో పట్టుబడిన సరైన పత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేసి, రూ.12 వేలు జరిమానాలు కట్టించామని ఎస్సై గంగాధర్ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన నిర్వహించుకునే గంగనీళ్ల జాతరకు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని, జాతర ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్దె అక్షర అనిల్, సర్పంచ్ విరేష్ కుమార్, ఎంపీటీసీ దొడ్డికింది గంగవ్వ ముత్యం రెడ్డి, నిర్మల్ రూరల్ ఎస్సై చంద్రమోహన్, నర్సాపూర్ ఎస్సై పాకాల గీతా, మామడ ఎస్సై జి అశోక్, సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్, లక్ష్మణచాంద ఎస్సై రాహుల్ పాల్గొన్నారు.