Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు
నవతెలంగాణ-మంచిర్యాల
మహాత్మా గాంధీజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆదివారం గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన వారి పోరాట తీరు ఎందరికో ఆదర్శనీయమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. అనంతరం ఆండాలమ్మ కాలనీలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణం తొమ్మిదో వార్డు ఆండాలమ్మ కాలనీలో గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత రమేష్, మున్సిపల్ కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవి, కౌన్సిలర్లు, నాయకులు హేమలత, సల్ల మహేష్, రాజమౌళి, కొండ చంద్రశేఖర్, దోమల రమేష్, కొత్తపల్లి రమేష్ పాల్గొన్నారు.