Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామకృష్ణాపూర్
రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఫిజియోథెరపి కేంద్రాన్ని సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరాం ఫైనాన్స్ ప్రారంభించారు. మొదటగా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యంపట్ల సీఎండీ శ్రీధర్ ముందున్నారని ఉద్యోగులు అడగగానే ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రాన్ని సమకూర్చి అతి తక్కువ రోజుల్లో పూర్తిచేసుకుని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. ఫిజియోథెరపీ కేంద్రాన్ని డాక్టర్లు, టెక్నీషియన్లు, పేషెంట్లను ఎక్సర్సైజ్ చేపిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఠాగూర్ స్టేడియంను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఎస్ఓ టూ జీఎం కృష్ణారావు, డీవైసీఎంఓ డాక్టర్ ఉషా, సుపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్, డీవైపీఎం శ్యాంసుందర్, మందమర్రి ఏరియా హెచ్ఓడీలు, ఏజీఎంలు, సంక్షేమ అధికారులు, డాక్టర్లు, ఏరియా ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.