Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాబీల మల్లారెడ్డి రచించిన నవల - ప్రేమ పవనాలు - మానవతా సౌరభాలు (క్యాంపస్లో సరిగమలు) - ఆవిష్కరణ సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 16న మధ్యాహ్నం 1:30 గం||లకు నిర్వహించ నున్నారు. ప్రముఖ రచయిత సి.ఎస్. రాంబాబు అధ్యక్షతన నిర్వహించే ఈ సభలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయితలు చెన్నయ్య దోరవేటి, ప్రమోద్ ఆవంచ, వేముల ప్రభాకర్ హాజరవుతారు.